EPAPER

Trinayani Serial Today Episode: గాజులు దొంగిలించిన వల్లభ – తిలొత్తమ్మను ఓ ఆటాడుకున్న హాసిని

Trinayani Serial Today Episode: గాజులు దొంగిలించిన వల్లభ – తిలొత్తమ్మను ఓ ఆటాడుకున్న హాసిని

Trinayani Serial Today September 19th Episode: విశాలాక్షి ఇచ్చిన మూటలో బంగారం నగలు చూసిన సుమన షాకింగ్‌ లా ఇన్ని నగలు నీకెక్కడివి. నువ్వేమైనా మణికాంత దగ్గరకు వెళ్లావా? ఏంటి అని అడుగుతుంది. ఎన్ని సార్లు వెళ్లానో లెక్కేలేదు అని చెప్తుంది విశాలాక్షి. గజగండ వచ్చాడని అనుమానం వస్తే ఆ రెండు గాజులు వేసుకో వెంటనే నువ్వు మాయం అవుతావు. మంత్రగాళ్లు ఎ రూపంలో వచ్చినా పట్టి ఇవ్వగలదు అంటూ నయనికి చెప్తుంది విశాలాక్షి. గాజులు వేసుకుంటే ఇంత జరుగతుందా? అని వల్లభ అనుమానిస్తే.. విశాలాక్షి ఊరికే చెప్పదురా.. అంటుంది తిలొత్తమ్మ. అంత బంగారు తెచ్చి రెండు గాజులు అక్కకు ఇచ్చిందంటే ఏదో మహిమ ఉండకపోదు బావగారు అని చెప్తుంది సుమన. విశాల్‌ మాత్రం ఆ గాజులను భద్రంగా దాచిపెట్టమని చెప్తాడు. నయని నగలను తీసుకుని విశాలాక్షికి టిఫిన్‌ పెడతానని లోపలికి తీసుకెళ్తుంది.


వల్లభ గాజులు కొట్టేశాడన్న విశాలాక్షి

తర్వాత విశాలాక్షి నగలను పరికించి చూస్తుంది దురంధర. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. అదేంటి పిన్ని ఆ నగలన  అలా చూస్తున్నావు అని హాసిని అడగ్గానే చూడ్డానికి తేలికగా ఉన్నాయి అంటుంది దురంధర. దీంతో స్వచ్చమైనవి ఏవైనా తేలికగానే ఉంటాయని విశాలాక్షి చెప్తుంది. నువ్వు అన్ని చెప్తున్నావు కానీ బ్రో చెయ్యి ఎలా బాగవుతుందో చెప్పడం లేదు విశాలాక్షి అంటాడు విక్రాంత్‌. నేను చెప్పడం ఏంటి చిన్నాన్నా అంటూ గురువుగారు చెప్పిన మాటలు, గాయ్రతిదేవి చెప్పిన మాటలు గుర్తు చేస్తుంది విశాలాక్షి. అన్ని తెలిసినా మళ్లీ ఎలా అని అడుగుతారు. అని చెప్పగానే నయని మళ్లీ భుజంగమణి తీసుకురావాలి అన్నారు అని చెప్పగానే పౌర్ణమికి వెళ్లిరమ్మని చెప్తుంది. అలాగే నయని దాచిపెట్టిన గాజులు వల్లభ తీసుకుని తిలొత్తమ్మకు ఇచ్చాడని విశాలాక్షి చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. అయితే మీరేం భయపడొద్దని ఆ గాజులు వేసుకున్నా మాయమవ్వరని అలా చెబితేనే ఎవరి మనసులో ఏముందో భయటపడుతుంది అని చెప్పాను అంటుంది. అయితే ఆ గాజులు వేసుకుని తిలొత్తమ్మ రాగానే అందరం అత్తయ్య కనిపించడం లేదని నాటకం ఆడదామని చెప్తుంది హాసిని. ఎందుకని నయని అడగ్గానే విశాలాక్షి చెప్పినట్లు నగల మూట కోసం వెళ్తారు కదా అప్పుడు రెండు తగిలిద్దామని డిసైడ్‌ అవుతారు.


రూములోకి వెళ్లి తిలొత్తమ్మ కనిపించనట్టు నాటకం ఆడిన హాసిని

మరోవైపు తిలొత్తమ్మ గాజులు వేసుకుని గాజులు ఎలా ఉన్నాయిరా అని వల్లభను అడుగుతుంది. దీంతో బంగారంలా ఉన్నాయని వల్లభ చెప్పగానే బంగారు గాజులు బంగారం లా కాకపోతే ఇత్తడిలా ఉంటాయా? బావగారు అంటుంది సుమన. ఇంతలో తిలొత్తమ్మ అనుమానంగా నేనింకా మాయం అవ్వలేదేంటి సుమన అని అడుగుతుంది. ఇంతలో అక్కడికి గాయత్రి పాప వస్తుంది. సుమన ఏందుకొచ్చావే వెళ్లిపో అంటుంది. మన ప్లాన్‌ ఏంటో తెలుసుకోవాలని వచ్చిందేమో.. అంటూ అనుమానపోతాడు వల్లభ.  తెలుసుకున్న చెప్పడానికి మాటలు రావు కదరా అంటుంది తిలొత్తమ్మ. ఇంతలో అక్కడికి హాసిని వస్తుంది. ఇక్కడేం చేస్తున్నావు చిట్టి అంటూ సుమనను అడిగి మీరేంటండి మీ అమ్మను ఎక్కడో వదిలేసి ఇక్కడికి వచ్చారు. సుమనతో ముచ్చట్లు పెట్టారా..? ఏంటి అని గాయత్రి పాపను చూసి దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. నేను ఇక్కడే ఉంటే ఎక్కడో ఉన్నాను అంటుంది. అంటే గాజులు పని చేస్తున్నాయి అని మరి మీకు ఎలా కనిపిస్తున్నాను అని అడుగుతుంది. అయితే ఇంతకు ముందు మేము కూడా ఆ గాజులు పట్టుకున్నాము కదా అందుకే మాకు మాత్రమే కనిపిస్తున్నారేమో అని సుమన అంటుంది. ముగ్గురు కలిసి నగలు ఎలా కొట్టేయాలో ప్లాన్‌ చేస్తారు.

Also Read: మనోహరికి ధైర్యం చెప్పిన అమర్‌ – గుప్తకు హెల్ఫ్‌ చేసిన అరుంధతి

గాజులు కొట్టేస్తు్న్న తిలొత్తమ్మను అందరూ పట్టుకుంటారు.

తర్వాత వల్లభ, సుమన, తిలొత్తమ్మ బయటకు వస్తారు. బయట ఉన్నవాళ్లు అందరూ అలర్ట్‌ గా ఉంటారు. తిలొత్తమ్మ కనిపించనట్టు నాటకం ఆడతారు. విశాల్‌ అమ్మ ఎక్కడికి వెళ్లింది అని వల్లభను అడుగుతాడు. ఎక్కడికో వెళ్లిందని వల్లభ చెప్తాడు.  తిలొత్తమ్మ కూడా తాను ఎవ్వరికీ కనిపించడం లేదని డిసైడ్‌ అవుతుంది. ఇంతలో అక్కడే ఉన్న నగల మూట దగ్గరకు వెళ్లి నగలు తీసుకోబోతుంటే గాయత్రి పాప తిలొత్తమ్మను చూస్తుంటే.. ఈ పిల్ల నన్నే చూస్తుందేంటి? ఈ పిల్లకు నేను కనిపిస్తున్నానా..? అనుకుంటుంది. దీంతో హాసిని నాకు కూడా కనిపిస్తున్నారు అత్తయ్యా అంటుంది. మీ మాట వినిపిస్తుంది. మీరు పట్టిన ఆ మూటను వదిలేస్తే మంచిది అంటుంది. నయని కూడా ఏంటత్తయ్యా అలా చూస్తున్నారు అని అడగ్గానే నేను కనిపిస్తున్నానా..? అని తిలొత్తమ్మ అడగ్గానే బాగానే కనిపిస్తున్నారు కదమ్మా..అని విశాల్‌ చెప్పగానే అదేంటి నగలు వేసుకుంటే ఎవరికీ కనిపించరు అన్నారు అని వల్లభ ప్రశ్నించగానే దొంగబుద్ది ఎవరికి ఉందో కనిపెట్టడానికే విశాలాక్షి అలా చెప్పిందట బ్రో అంటాడు విక్రాంత్‌. దీంతో తిలొత్తమ్మ కోపంగా విశాలాక్షిని తిడుతుంది. గాజుల నయనికి ఇచ్చి వెళ్లిపోతుంది తిలొత్తమ్మ.

విశాలాక్షిని అవమానించేందుకు తిలొత్తమ్మ ప్లాన్‌

తర్వాత తిలొత్తమ్మ, సుమన ఇద్దరూ కలిసి విశాలాక్షిని ఎలాగైనా అవమానించాలిన ప్లాన్‌ చేస్తారు. కెమికల్‌ కలిపిన వాటర్‌ విశాలాక్షి మీద పోస్తే అందరి మధ్యలో ఉన్నప్పుడు తనకు దురద పెట్టి అందరి మధ్య చీర విప్పేస్తుందని అప్పుడు అవమానాల పాలు అవుతుందని వల్లభకు చెప్తారు. తిలొత్తమే రెండు గ్లాసుల్లో నీల్లు తీసుకెళ్లి గుడిని నుంచి తెచ్చానని చెప్పి ఇంట్లో జల్లుతూ ఆ విశాలాక్షి మీద కూడా చల్లుతుందని ప్లాన్‌ చేస్తారు. మరోవైపు విశాలాక్షి ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Gundeninda Gudigantalu Today Episode: ప్రభావతిని ఎదురించిన మీనా.. అడ్డంగా దొరికిన రోహిణి.. శృతి పెళ్లి డేట్ ఫిక్స్..

Satyabhama Serial Today September 19th: క్రిష్ ను కాపాడుకున్న సత్య.. నిజం తెలుసుకున్న మహదేవయ్య..

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరికి ధైర్యం చెప్పిన అమర్‌ – గుప్తకు హెల్ఫ్‌ చేసిన అరుంధతి

Brahmamudi Serial Today Episode: రాజ్‌ కు జీతం ఇస్తానన్న కావ్య – రుద్రాణిని రాయబారానికి పంపాలన్న స్వప్న

Kirrak Couples Promo: భార్యను మోయలేకపోయిన ఆదిరెడ్డి, కంగారులో పెదవి కొరికిన షరీఫ్, ఈవారం ‘క్రిర్రాక్ కఫుల్స్‘ ప్రోమో అదుర్స్ అంతే..

Nindu Noorella Saavasam Serial Today September 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు ఘోర పూజలు – ఎలాగైనా కాపాడతానన్న గుప్త

Big Stories

×