trinayani serial today Episode: బెడ్ రూంలో ఉన్న నయని.. గాయత్రి దేవి ఫోటో ముందు నిలబడి ఏడుస్తుంది. మీరు నా బిడ్డగా పుట్టి.. గాయత్రి పాపగా నా దగ్గరే పెరుగుతున్నారని తెలియక… పోయిన మీరు ఎక్కడున్నారు.. ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఆరాట పడేదాన్ని. ఇప్పుడు మీరు నా కళ్ల ఎదురుగా పసిపాపగా ఉన్నారు. నాకు ఏదైనా జరిగితే తిలొత్తమ్మ అత్తయ్యకు మీరు దొరికిపోతారేమో.. మిమ్మల్ని ఏమైనా చేస్తారేమోనన్న భయం నన్ను వెంటాడుతుంది. అని ఏడుస్తుంది. ఇంతలో విశాల్ వచ్చి వింటాడు. ఏం జరిగింది అని ఆలోచిస్తాడు విశాల్. ఏదో జరుగుతుందని భయంగా ఉందని నయని టెన్షన్ పడుతుంది.
నిన్నటిదాకా నేను అనవసరంగా ఆందోళన పడ్డానేమో అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు వచ్చే ప్రతి కల నా ప్రాణగండానికి చెందినదే అని స్పష్టంగా తెలుస్తుంది. ఒక పాము వచ్చి బుసలు కొడుతూ నన్ను కాటేయబోయింది అమ్మ. పదే పదే నాకు మృత్యు గండం అని చెబితే అందరూ నన్ను అపహాస్యం చేస్తారేమోనని చెప్పలేకపోయాను అమ్మా.. గులాబి రంగు డ్రెస్ వేసుకుని నేను ఒకచోట కూర్చున్నాను. పాము వచ్చి నన్ను కాటేయబోయింది అమ్మా అంటూ ఏడుస్తుంది. ఇంతలో విశాల్ రాబోయే ఆ ఆపదను నవ్వు పసిగట్టగలవని అనుకుంటున్నాను. అని వెళ్లిపోతాడు విశాల్. మీరు ఆత్మగా వచ్చైనా నాకు దారి చూపించాలి అని కోరుకుంటుంది నయని.
గార్డెన్ లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంది తిలొత్తమ్మ. ఇంతలో వల్లభ వచ్చి గాయత్రి పాపను ఎత్తుకొద్దామని చూస్తే వీలు కావడం లేదని చెప్తాడు. పిల్లతో ఏం పని అని తిలొత్తమ్మ అంటుంది. నేను ఇప్పుడు తల్లి గురించి ఆలోచిస్తున్నాను అంటుంది. పెద్దమరదలుకేం బాగానే ఉంది కదా? అంటాడు వల్లభ. ఆకారం బాగానే ఉంటుంది వల్లభ. తన బుర్రలో మెదిలే ఆలోచనల గురించే నా వ్యాపకం అంతానూ.. అని తిలొత్తమ్మ చెప్పగానే కార్తీకమాసం మొదలు కాగానే గాయత్రి పాపకు పట్టాభిషేకం చేయదలుచుకున్నారు.
కానీ సుమన అడ్డు పుల్ల వేయగానే ఆ ఫంక్షన్ కూడా వాయిదా వేసుకున్నారు. నీకు ఇంకా ఏ క్లారిటీ కావాలి అని వల్లభ అడగ్గానే టిఫిన్ చేద్దాం రండి అని చెప్పిన నయని టక్కున ఆగిపోయే అలాగే రూంలోకి వెళ్లిపోయింది. మనవైపు తిరగకుండా అంతసేపు నిల్చుని పైకి వెళ్లిన నయని ఇప్పటి వరకు హాల్ లోకి రాకుండా ఉండింది అంటే అనుమానమే కదా వల్లభ అని చెప్తుంది. ఎందుకు ఆగింది. తన బుర్రలో ఏం ఆలోచిస్తుంది అని మనం గెస్ చేయాలి అంటుంది తిలొత్తమ్మ. గాయత్రి పాపే తన కూతురు అని తెలుసుకున్నప్పుడు నయని ఎంత సంతోషపడిందో.. తర్వాత ఆ పసిపాప చేత నన్ను ఎలా చంపాలో ప్లాన్ వేస్తుంది అని వల్లభను హెచ్చరిస్తుంది తిలొత్తమ్మ.
రూంలో ఏడుస్తూ కూర్చున్న నయని దగ్గరకు విశాల్ కొత్త డ్రెస్ తీసుకుని వచ్చి చూపిస్తాడు. ఆ డ్రెస్ చూసిన నయని ఆశ్చర్యంగా బాబుగారు అని అడుగుతుంది. నీకు కలలో కనిపించిన లంగావోణీ ఇదే కదా నయని అని అడుగుతాడు. దీంతో మీకెలా తెలుసు అని అడుగుతుంది. నువ్వు అమ్మ ఫోటో ముందు నిలబడి చెప్పింది మొత్తం నేను విన్నాను అంటాడు. ఇప్పుడు నిర్భయంగా చెప్పు నయని.. అంటాడు. పదేపదే నేను ఒక్కటే చెప్తుంటే మీకు కోపంగా లేదా? బాబు గారు అని నయని అడుగుతుంది.
విశాల్ ఏం లేదని.. నిన్నటి దాకా నీకు ఏం జరగకపోయినా.. నీ కంగారు చూసి నిన్ను వారించడం వాస్తవం. మా అమ్మనే గాయత్రి పాప అని తెలుసుకున్నాక మళ్లీ ఈరోజు నువ్వు టెన్షన్ పడుతున్నావంటే అదేంటో తెలుసుకోవాలన్న ఆశతో నువ్వు చెప్పిన డ్రెస్ తీసుకొచ్చాను అంటాడు విశాల్. దీన్ని నేను కట్టుకుని నాకు ఏ ఆపద వస్తుందో తెలుసుకోమంటారా? బాబు గారు అని అడుగుతుంది. అవునని నీ క్షేమం నాకు ముఖ్యం కాబట్టి నీ ఆలోచనలకు అనుగుణంగా నేను ఈ ఏర్పాటు చేశాను అంటాడు విశాల్. ఎవరైనా అడుగితే నా కోసమే ఇలా రెడీ అయ్యాను అని చెప్పు అంటాడు విశాల్. దీంతో నయని ఏమోషనల్ అవుతుంది. డ్రెస్ నయనికి ఇచ్చి కట్టుకునిరా హాల్ లో ఎదురుచూస్తూ ఉంటాను నయా నయని కోసం అని వెళ్లిపోతాడు.
హాల్ లో అందరూ నయని కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో నయని లంగావోణీలో కిందకు వస్తుంది. నయనిని చూసిన అందరూ షాక్ అవుతారు. హాసిని మాత్రం ఇదేంటి చెల్లి శారీ చాలా బాగుంది కొత్త మాడలా.. అని అడుగుతుంది. దీంతో అది శారీ కాదని ఆఫ్ శారీ అని చెప్తుంది సుమన. అంటే చీరను సగం కట్ చేసి కట్టుకుందా? అని వల్లభ అడుగుతాడు. తెలియకుండా మాట్లాడితే తన్నులు తింటారు అని హాసిని అంటుంది. ఇంతలో నయని పాము కాటేయడానికి రావాలని ఇలా కట్టుకున్నాను అని చెప్తుంది. దీంతో అందరూ భయపడతారు. పాము కరవాలా.. ఎవర్ని అని అడుగుతారు. మీరెవరూ భయపడవద్దు పాము కాటేసింది నన్నే అని నయని చెప్పగానే అందరూ మరోసారి షాక్ అవుతారు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.