Satyabhama Today Episode October 28th : గత ఎపిసోడ్ లో .. సత్య మహాదేవయ్య క్రిష్ తో మాట్లాడిన మాటలను వింటుంది. మళ్లీ క్రిష్ ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాడని క్రిష్ ను ఎలాగైనా కాపాడుకోవాలని ప్లాన్ వేస్తుంది. దానికి మహాదేవయ్య దగ్గరకు వెళ్తుంది. నీ పదవి కన్నా నాకు ఎక్కువ కాదని క్రిష్ అన్నాడు. నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుంటే రేపు మారణ హోమం జరుగుతుందని అంటాడు. మహాదేవయ్య ప్లాన్ ప్రకారం సత్యతో కలిసి పార్టీ ఆఫీస్ కు వెళ్తాడు క్రిష్. అక్కడ ఉన్న నరసింహ అనడంతో సత్య మాటను పక్కన పెళ్లి క్రిష్ నరసింహాను చితక్కోడతాడు.. ఇక సత్య బయటకు రాగానే కోపంగా ఉంటుంది. మహాదేవయ్య మీ ఇద్దరు సరదాగా తిరిగి రండి అని చెప్తాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య క్రిష్ కార్లో బయలుదేరుతారు. సత్యకు ఇచ్చిన మాటను కృష్ పక్కన పెట్టడం వల్ల సత్యం మాటలతోనే తూటాలు పేలుతుంది. సత్య కోపంగా ఉందని గ్రహించిన క్రిష్ ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయినా సత్య క్రిష్ కి కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తుంది . మాట మర్చిపోవడం మాట ఇచ్చినంత సులువు కాదంటూ షాక్ ఇస్తుంది. అలా బయలుదేరగానే మధ్యలో ఆపి కొబ్బరి బొండం తాగుతావా అని క్రిష్ అడుగుతాడు. దానికి సత్యా నేను కొబ్బరిబోండం తాగను మా తెలుగు మాస్టారు కలలో మాటిచ్చాను అనేసి అంటుంది. నేను మా ఇంట్లో వాళ్లకి మాటిచ్చాను ఇక్కడ స్వీట్స్ తిననని అనేసి సత్య కౌంటర్ ఇస్తుంది. ఏదన్నా కూడా సత్య క్రిష్ కి కౌంటర్ ఇస్తూనే వస్తుంది. సత్యను కూల్చేయాలని క్రిష్ రకరకాలుగా ప్రయత్నిస్తాడు. కానీ ఏ ఒక్కటి వర్కౌట్ అవ్వదు . . నువ్వు కోపం తగ్గించుకోవాలంటే నువ్వు కూల్ అవ్వాలంటే జర నేను ఏం చేయాలో చెప్పు అనేసి సత్యను క్రిష్ అడుగుతాడు . .అయితే సారీ చెప్పు అనేసి అడుగుతుంది సత్య. సారి ఎప్పుడో చెప్పాను కదా మళ్లీ అడుగుతావేంటి అని అనేసి క్రిష్ సత్య అని అడుగుతాడు. ఒక్కసారి కాదు వెయ్యి సార్లు సారీ చెప్పాలి అని సత్య అడుగుతుంది. ఇదేం శాడిజం సత్య ఇలా కూడా ఉంటారా అనేసి క్రిష్ సత్యాన్ని అడుగుతాడు. సారీ నే కదా చెప్పాల్సింది చెప్తాను అయితే ఒక్కొక్కసారి కి చెంప మీద ఒక్కో ముద్దు పెట్టమని మా బామ్మ కి మాట ఇచ్చాను అని క్రిష్ అంటాడు. దానికి సత్యా నువ్వు వద్దు నీ సారీ వద్దు అనేసి కామ్ అయిపోతుంది.
ఇక అప్పుడే సంధ్య ఫోటోలు పంపిస్తుంది. క్రిష్ సంధ్య వాళ్ళు కూడా హైదరాబాదులో ఉన్నారు అంటూ సంధ్య కు ఫోన్ చేస్తుంది. అక్క మేం హైదరాబాద్ లోనే ఉన్నాం ఎక్కడ కలుద్దాం చెప్పు అనేసి అడుగుతుంది తనకి సంధ్య వాటర్ తీన్ పార్క్ దగ్గర కలుద్దాం అక్క అక్కడ అయితే బాగుంటుందనేసి సత్యకు చెబుతుంది. క్రిష్ వాటర్ పార్క్ టీం దగ్గరికి వెళ్దాం అనేసి సత్య చెబుతుంది. అప్పుడు అందరూ ఆ పార్క్ దగ్గర కలుసుకుంటారు. బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటారు నందిని సత్యవేసే కౌంటర్లకి క్రిష్ హర్ష కామ్ అయిపోతారు సంతు దొరికితే మొగుళ్ళ మీద పడతారు అంటూ బాధపడుతూ ఉంటారు. ఇక హర్షానందిని స్విమింగ్ దగ్గరికి వెళ్తారు. సంజయ్ సంధ్య సత్య కృష్ణ లు రైన్ డాన్స్ దగ్గరకు వెళ్తారు.
డాన్స్ చేస్తున్నప్పుడు సత్యను సంజయ్ ఫోటో తీస్తాడు. అందరి ముందే సత్య సంజయ్ ని తిడుతుంది . అప్పుడు సంజయ్ ఫోటోలు డిలీట్ చేస్తున్నా అని డిలీట్ చేస్తాడు. సరే మీరు డాన్స్ చేస్తూ ఉండండి మేము అలా వెళ్లి చిల్లు వేసేస్తాం అనేసి క్రిష్ సంజయ్ పక్కకు వెళ్తారు. బీరు తాగుతూ మాట్లాడుకుంటారు సంజయ్ కృష్ణ సత్య ఎలా ప్రేమించింది అనేసి చిన్నగా కుప్పి లాగే పని చేస్తాడు . మాటలు కలిపి నిజం తెలుసుకుంటాడు. రేపు నన్ను కూడా ఇష్టపడుతుంది నాకు పడిపోతుంది ఎలాగైనా సత్యం నా సొంతం చేసుకోవాలని సంజయ్ మనసులో అనుకుంటాడు. ఇక నందిని మైత్రి హర్ష స్విమ్మింగ్ దగ్గరికి వెళ్తారు అప్పుడు మైత్రి నాకు స్విమ్మింగ్ రాదు అనేసి అంటుంది మరి అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు కదా అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఉండొచ్చు కదా అనేసి నందిని అంటుంది.
నందిని హర్ష ఎంజాయ్ చేస్తూ ఉంటే చూసి ఓర్వలేక పోతుంది. మైత్రి ఎలాగైనా వీరిద్దరి సంతోషాన్ని చెడగొట్టాలని నా మొగుడితో ఇది డాన్స్ చేయడమేంటి అనేసి కోపంతో మనసులో ప్లాన్ చేస్తుంది. కాలుజారి నీళ్లలో పడినట్లు నటిస్తుంది. దానికి హర్ష అప్పుడే చూసి మైత్రి అని దగ్గరకు వచ్చి బయటకు తీసుకొని వస్తాడు.. వీరిద్దరిని చూసి నందిని కోపంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో సత్య దగ్గరికి సంజయ్ వస్తాడు. మనిద్దరం సీక్రెట్ రిలేషన్ మెయింటెన్ చేద్దాం నీకు మొదట్లో క్రిష్ అంటే ఇష్టం లేదు అలాగే నా మీద కూడా ఇప్పుడు ఇష్టం ఏర్పడుతుంది. ఈ విషయం ఎవరికీ చెప్పను అనేసి సత్యతో అనగానే సత్య సంజయ్ చెంప పగలగొడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో సంజయ్ నిజం చెప్తాడా లేక సత్య మరోసారి క్రిష్ దగ్గర బుక్ అవుతుందో చూడాలి..