EPAPER

Satyabhama Today Episode: మహదేవయ్యకు నిజం చెప్పిన సత్య.. రేణుక చెప్పిన అబద్దంతో షాకైన సత్య..

Satyabhama Today Episode: మహదేవయ్యకు నిజం చెప్పిన సత్య.. రేణుక చెప్పిన అబద్దంతో షాకైన సత్య..

Satyabhama Today Episode October 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్య క్రిష్ కాఫీ తీసుకొస్తుంది. అప్పుడు వీరిద్దరు రొమాన్స్ చేస్తారు. ఇదే ఎపిసోడ్ కు హైలెట్ అవుతుంది.. అప్పుడు సత్యా క్రిష్ ఇద్దరూ కౌగిలించుకొని ఉంటారు. అలా చూసి బామ్మ సిగ్గు పడుతుంది. మహదేవయ్య భైరవి రెడీ అయ్యి వస్తారు. పెళ్లికి పోవాలి అని అంటాడు. మొన్న ఎటాక్ జరిగింది కదా బాపు నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు.. అన్న వస్తుండాడా అని అడుగుతాడు. వద్దు బాపు నేను మీతో వస్తాను అని క్రిష్ చెప్తాడు. మైత్రి సంతోషించే విషయం ఒకటి హర్ష చెప్పబోతున్నాడు అని నందిని చెప్తుంది. అవునా ఏంట్రా అది అని హర్ష వాళ్ల నాన్న అడుగుతాడు. అప్పుడు నందిని నా నోటితో చెప్తే ఏం బాగుంటుంది. ఆ న్యూస్ తీసుకొచ్చినోళ్ళు చెప్తేనే బావుంటుంది. ఆ విషయం ఏంటో వింటే నందిని ఎగిరి గంతేస్తుంది అని నందిని అంటుంది. అప్పుడు హర్ష మైత్రి కోరుకున్న కోరిక నెరవేరింది. ఫారిన్ లో చదవడానికి సీటు వచ్చేసింది అని అంటాడు. అందరు సంతోషం ఉంటారు. రుద్రకు నరసింహ ఫోన్ చేస్తాడు. మీ బాపు పెళ్లికి వెళ్లాడుగా స్పాట్ పెట్టాను అని అంటాడు. అది రేణుక వింటుంది. అప్పుడు రుద్ర దగ్గరికి వచ్చి ఇన్నాళ్లు మామయ్యను చంపడానికి ప్లాన్ వేసింది నువ్వా? అని ప్రశ్నిస్తుంది. రేణుక బ్రతింటే నాకు ప్రాబ్లమ్ అని గొడవతో కిందకు నెట్టేస్తాడు. రేణుక కింద పడిపోగానే సత్య వస్తుంది. హాస్పిటల్ కు తీసుకొని వెళ్తారు. కడుపుకి బాగా గాయం అయింది. ఇప్పుడు బేబీని పోగొట్టుకోవడం కాదు.. గర్భసంచిని తీసేయాల్సి వచ్చింది. జీవితంలో ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం లేదు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని సత్య తో డాక్టర్ చెప్తుంది. హర్ష మైత్రిని ఫారిన్ పంపించాలని లోన్ కోసం తన ఫ్రెండుకు ఫోన్ చేస్తాడు. మైత్రి వింటుంది. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. హర్ష తన ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు సంతకం పెడితే నాకు లోన్ వస్తుంది అని తన ఫ్రెండ్ తో హర్ష అంటాడు. ఇది ఒక జీవితానికి సంబంధించిన విషయం నీవల్ల ఒక జీవితం నిలబడుతుంది అంటూ హర్ష తన ఫ్రెండ్ తో మాట్లాడటం మైత్రి వింటుంది. ఎవరికోసం లోన్ తీసుకోవాలనుకుంటున్నావని మైత్రి హర్షను అడుగుతుంది. ఇంట్లో బాగు చేయడానికా, నందినికి నగలు కొంటున్నావా? ఇంకెవరికైనా ముఖ్యమైన వాళ్ళకి డబ్బులు అవసరం అయితే లోన్ పెడుతున్నావని మైత్రి హర్షను అడుగుతుంది. దానికి హర్ష నీకోసమే మైత్రి నువ్వు ఫారిన్ వెళ్లడానికి లోన్ తీసుకుంటున్నా అని అంటాడు. ఇల్లు అమ్మేశాను అని మైత్రి హర్షిత్ ఉంటుంది. మన చివరగా ఇచ్చిన ఇల్లు అది దాన్ని ఎందుకు అమ్మాలనుకుంటున్నావని హర్ష అంటాడు. మైత్రి డ్రామాను మొదలు పెడుతుంది. అంటే ఎందుకు హర్షానికి ఇంత అభిమానం నాకోసం ఎంత చేస్తున్నావని మైత్రి హర్షను అడుగుతుంది.

ఇక క్రిష్ సత్య వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సత్య కు ఫోన్ చేయమని చెప్తాడు. ఇంతవరకు తెలియట్లేదు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి అని బామ్మ మహదేవయ్య తో అంటుంది. అందరూ అలా వెళ్తుంటే సత్య వాళ్ళు ఇంట్లోకి వస్తారు. వెళ్లేటప్పుడు బాగానే ఉంది కదా ఇప్పుడు ఏమైంది అని బైరవి అడుగుతుంది. అక్కకి కడుపు పోయింది ఇక జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదని సత్యా అందరితో చెబుతుంది. అందరూ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతుంది ఏం జరిగిందో అసలు అని మహదేవయ్య అడుగుతాడు. వారసుడు వస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. బంగారు మొలతాడు కూడా చేయుంచి పెట్టుకున్నాను అని మహదేవయ్య ఎమోషనల్ అవుతాడు. అంతలోకే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఎస్సై గారు ఇలా వచ్చారు అని క్రిష్ అడుగుతాడు. దానికి సత్య నేనే రమ్మన్నాను అని చెప్తుంది. ఎందుకు పోలీసులు వచ్చారు అని మహదేవయ్య అడుగుతాడు. కడుపు పోవడానికి కారకుడు ఒకరున్నారు ఆ హంతకుడ్ని పట్టుకోడానికి పోలీసులను నేను రమ్మానను అని సత్య అంటుంది. కడుపు పోవడానికి అంత కూడా ఎవరో చెప్పమ్మా నేను నా చేతులతో చంపేస్తానని మహదేవయ్య అంటాడు. సత్య ఎవరో కాదు మావయ్య మీ ముద్దుల కొడుకు రుద్ర ప్రతాప్ గారే అని అంటుంది. అప్పుడు రుద్ర నాకేం సంబంధం లేదు బాపు.. నన్ను కావాలని ఇరికిస్తుంది అని రుద్ర అంటాడు. ఇతనే హంతకుడు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని పోలీసులు సత్య ని అడుగుతారు. భార్య కన్నా వేరే సాక్ష్యం ఏముంది ఎస్ఐ గారు అని సత్య అంటుంది. చెప్పు నీ కడుపు పోవడానికి కారణం ఎవరు నిజం చెప్పు అని సత్య రేణుకను అడుగుతుంది. రేణుక మాత్రం పెనిమిటికీ ఏ సంబంధం లేదు నేనే మేడ పై నుంచి కాలుజారి కింద పడ్డాను అని అబద్ధం చెప్తుంది.


అప్పుడు అక్కడికి వచ్చిన పోలీసులు తప్పుడు కేసు పెడితే నేరం అని తెలియదా మీకు అనేసి సత్యం తిట్టి వెళ్ళిపోతారు. ఇంట్లో అందరూ హత్య చేసిన పనికి సత్యదే తప్పు అంటూ తిడతారు. ఆఖరికి బామ్మ కూడా సత్య పై మండిపడుతుంది. ఇంటి పరువును తీసినందుకు సత్యకు ఏదైనా సత్యకు శిక్ష వేయాలని అంటుంది. మహదేవయ్య కృష్ణ అడుగుతాడు. మహదేవయ్యా నీ పెళ్ళాం కి ఏం శిక్ష వేయమంటావో చెప్పు అని కృష్ణ అడుగుతాడు. మీ ఇష్టం బాపు మీరు ఏ శిక్ష వేసినా నేనేం మాట్లాడను అనేసి క్రిష్ అంటాడు. అప్పుడు రేణుక మాట్లాడుతుంది.. కడుక్కోవడానికి కారణం నా పెనిమిటే అని నిజం చెప్తుంది. నన్ను చంపాలనుకుని నా చెంప మీద కొట్టాడు కిందకి తోసేసాడు దాంతో నా కడుపుపైందనేసి రేణుక ఎమోషనల్ అవుతుంది. పత్తి లాంటి దేవతకు అన్యాయం జరగడం నాకు ఇష్టం లేదు అందుకే నిజం చెప్తున్నాను అప్పుడు పోలీసులు ముందు నిజం చెప్పకపోవడానికి కారణం నా పెనిమిటిని పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండడానికే.. ఇంటిపరువు పోకుండా ఉండాలని నేను నిజం చెప్పలేదంటూ రేణుక చెప్తుంది. మహదేవయ్య రుద్రను దారుణంగా కొడతాడు. అందరూ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఏం చిన్నా సత్య ఇలాంటిదే నీకు తెలియదా అని రేణుక కృష్ణుని ప్రశ్నిస్తుంది. ఇక నందిని గదిలో కూర్చుని గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది. హర్ష లోపలికి వస్తాడు. ఈ పంపించేస్తున్నా కదా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా ఇప్పటికైనా నాతో మంచిగా ఉండొచ్చు కదా అనేసి హర్ష నందినితో అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భైరవి రేణుకను తిడుతూ ఉంటుంది. భర్త పరువు ని అలా ఎవరు తీయరు అంటూ రేణుకను తిడుతుంది. అది సత్య వింటుంది. ఈ మాట అడగాల్సింది అక్కను కాదు అత్తయ్య పొయ్యి మీ అబ్బాయిని అడగండి అంటూ సత్య బైరవిని అడుగుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Gundeninda GudiGantalu Today Episode : సత్యంను అరెస్ట్ చేసిన పోలీసులు.. మీనా మెడకు చుట్టుకున్న రవి పెళ్లి..

Brahmamudi Serial Today October 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అత్తకోసం పరుగెత్తుకెళ్లిన రాజ్‌ – ఆఖరి కోరిక నెరవేరుస్తానని హామీ

Trinayani Serial Today October 11th: ‘త్రినయని’ సీరియల్‌: పంచకమణి ఇవ్వమని గజగండను అడిగిన తిలొత్తమ్మ – రెండు మణులను అమ్మవారి సన్నిధిలో పెడతామన్న నయని

Nindu Noorella Saavasam Serial Today October 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ సీక్రెట్‌ బయట పెట్టిన రాథోడ్‌ – రాథోడ్‌కు తలతిక్క అంటూ తిట్టిన అమర్‌  

Gundeninda GudiGantalu Today Episode : శృతి కిడ్నాప్ కేసులో సత్యం అరెస్ట్.. బాలుకు నిజం చెప్పిన మీనా..

Trinayani Serial Today October 10th: ‘త్రినయని’ సీరియల్‌:  అహల్యను చంపబోయిన తిలొత్తమ్మ – గాయత్రి దేవిని చంపిన వాళ్లను పట్టుకుంటానన్న అహల్య

Big Stories

×