EPAPER
Kirrak Couples Episode 1

Nindu Noorella Saavasam Serial Today September 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సింగ్‌ వేషం వేసిన రాథోడ్‌ – మొదటిసారి మనోహరిని మెచ్చుకున్న ఆరు

Nindu Noorella Saavasam Serial Today September 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సింగ్‌ వేషం వేసిన రాథోడ్‌ – మొదటిసారి మనోహరిని మెచ్చుకున్న ఆరు

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌, మిస్సమ్మను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు. ఈ బాబ్జీగాడు ఇంకా లోకేషన్‌ షేర్‌ చేయలేదేంటని మనోహరి టెన్షన్‌ పడుతుంది. ఇంతలో బాబ్జీ, మనోహరికి అమర్‌ వాళ్ల లోకేషన్‌ షేర్‌ చేస్తాడు. హమ్మయ్యా లోకేషన్‌ వచ్చేసింది అని మనోమరి వెళ్తుంది. మనోహరితో పాటు ఆరు ఆత్మ కూడా వెళ్తుంది.


సింగ వేషం వేసుకున్న రాథోడ్‌ అసలు నిజం మిస్సమ్మకు చెప్పాలని స్కూటర్‌ మీద వెళ్తుంటాడు. ఇంటి దగ్గర టెన్షన్‌ పడుతున్న నిర్మల, శివరాం, రాథోడ్‌ కు ఫోన్‌ చేస్తారు. అమర్‌ వాళ్లను కలిశావా..? మిస్సమ్మకు నిజం చెప్పావా? అంటూ అడుగుతారు. లేదు ఇంకా నేను వెళ్లలేదు. వెళ్లి కచ్చితంగా నిజం చెప్తాను. మీరు మాత్రం అమ్మగారు వేసే వేడి వేడి పకోడి తింటూ హాయిగా కూర్చోండి అని చెప్తాడు రాథోడ్‌.

అమర్‌ తో  కారులో వెళ్తున్న  మిస్సమ్మ నాన్‌ స్టాప్‌ గా మాట్లాడుతుంది. దీంతో అమర్ తిడతాడు. మిస్సమ్మ ఫ్లీజ్‌ నీ స్పీకర్‌ ను ఆఫ్‌ చేసి కొంచెం సైలెంట్‌ గా ఉండవా? అంటాడు. దీంతో మిస్సమ్మ ఇరిటేటింగ్‌ గా చూస్తూ..  సరదాగా బయటకు వచ్చినప్పుడు కూడా సైలెంట్‌ గా ఉండమంటారేంటి? అని అడుగుతుంది. సరదాగా మాట్లాడుతున్నావా? నువ్వు. నువ్వు మాట్లాడే మాటలు  కక్ష సాధిస్తున్నట్లుగా ఉన్నాయి.


ఇకనైనా కొద్దిసేపు నీ నోటికి నా చెవులకు కొంచెం బ్రేక్‌ ఇవ్వు మిస్సమ్మ అంటాడు అమర్‌. దీంతో మిస్సమ్మ చిన్నగా  కారులో పాటలు పెట్టకూడదు. మాట్లాడకూడదు ఇంకెందుకు కలిసి వెళ్లడం. మీరు మీ కారులో.. నేను ఏదైనా క్యాబ్‌ లో వెళ్లొచ్చు కదా? అంటూ గొణుగుతుంది. దీంతో అమర్‌ వినిపిస్తుంది అంటాడు. వినిపించాలనే  అన్నాను. మీరు గుర్రున చూస్తే బయపడే రోజుల పోయాయి. నన్ను కాదు రోడ్డును చూసి డ్రైవ్‌ చేయండి అంటుంది. మిస్సమ్మ.

కొంచెం దూరం వెళ్లాక కారు ఆగిపోతుంది. అమర్‌ ఎన్ని సార్లు స్టార్ట్‌ చేసినా కారు స్టార్ట్‌ కాదు. దీంతో మిస్సమ్మ వెటకారంగా హలో మాస్టారు మీరు ఎన్ని సార్లు కొట్టినా స్టార్ట్‌ అవ్వదండి కొంచెం దిగి చూడండి అంటూ మిస్సమ్మ కారు దిగి రోడ్డు మీద వెళ్తున్న వెహికిల్స్‌ ను లిఫ్ట్‌ అడుగుతుంది. అమర్‌ కారు వెనకలే వచ్చిన అరవింద్‌ కూడా తన బైక్‌ ను దూరంగా ఆపుకుని చూస్తుంటాడు. నన్ను చూసి అనుమానం వచ్చి కారు ఆపారా? లేక ఏదైనా ప్రాబ్లమా? అనుకుంటాడు.

ఇంతలో మిస్సమ్మ లిఫ్ట్‌ అడగడం చూసి కారు ప్లాబ్లమ్‌ అయినట్టుంది. అనుకుని ఇప్పుడు వాడిని ఏమీ చేయలేను కనిపించకుండా వెళ్లిపోవడమే బెటర్‌ అనుకుంటాడు. ఇంతలో బాబ్జి అమర్‌ కారు దిగి రోడ్డు మీద నిలబడటం చూసి మనోహరికి ఫోన్‌ చేస్తాడు. కారు దిగి రోడ్డు మీద నిలబడ్డారని మీరిప్పుడు ఇక్కడకు వస్తే బాగుండదని చెప్తాడు. దీంతో మనోహరి వెంటనే తన కారు ఆపుకుని అక్కడే ఉండిపోతుంది. అమర్‌ వాళ్లు అక్కడి నుంచి వెళ్లగానే మళ్లీ ఫోన్‌ చేయి అని బాబ్జీకి చెప్తుంది. సరే అంటాడు బాబ్జీ.

అమర్‌ కు దూరంగా బైక్‌ ఆగి ఉండటం చూసి ఈ బైక్‌ నన్ను మొదటి నుంచి ఫాలో అవుతుంది. ఆ అరవింద్‌ గాడు కానీ ఫాలో అవుతున్నాడా? ముఖం కనిపించకుండా హెల్మెట్‌ పెట్టుకున్నాడు. అనుకుంటుండగానే అరవింద్‌ కూడా నేను ఇప్పుడు ఆ అమరేంద్ర గాడికి దొరికితే జీవితాంతం జైలులో ఉండాలి. వాడి సంగతి తర్వాత చూద్దాం ఇప్పుడైతే అనుమానం రాకుండా వెళ్లిపోవాలి అనుకుని అమర్‌ వైపు చూడకుండా వెళ్లిపోతాడు అరవింద్‌.

బైక్‌ వెళ్లడం చూసిన అమర్‌ వీడు నిజంగా అరవింద్‌ అయ్యుంటే ముఖం కనిపించకుండా హెల్మెట్‌ పెట్టుకుని లిఫ్ట్‌ అడిగినప్పుడు మా ముఖం కూడా చూడలేదు. చ టైంకి కారు ట్రబుల్‌ ఇచ్చింది లేదంటే వాడి వెనకే వెళ్లి వాడు అరవిందో కాదో కనుక్కునే వాడిని అనుకుంటాడు అమర్‌.  సింగ్‌ వేషంలో ఉన్న రాథోడ్‌ పాత స్కూటర్‌ మీద వచ్చి సార్‌ ఏంటి ఇక్కడే ఆగిపోయారు అనుకుని ఇప్పుడే మంచి సమయం మిస్సమ్మకు నిజం చెప్పొచ్చు అనుకుంటాడు.

దూరం నుంచి రాథోడ్ ను గమనించిన మిస్సమ్మ. అమర్‌ను ఏవండి ఆ స్కూటర్‌ అతన్ని లిఫ్ట్‌ అడగండి ఒక్కడే ఉన్నాడు అని చెప్తుంది. దీంతో అమర్‌ వెటకారంగా నేను లిఫ్ట్‌ అడగ్గానే వచ్చి బండి తాళం మనకు ఇచ్చి ఆయన వెనకాల వస్తాను అంటాడా? అని అమర్‌ అంటుండగానే రాథోడ్ వచ్చి  మీ కారు ట్రబుల్‌ ఇచ్చినట్టు ఉంది. నా స్కూటర్‌ మీద మీరు వెళ్లండి సార్‌ ఈ పక్కనే మా ఇల్లు ఉంది. కొద్దిగా ముందుకు వెళ్ళగానే మెకానిక్‌ ఉంటాడు. వాడికి చెబితే మీ కారు మీకు సేఫ్‌గా రెడీ చేసి పంపిస్తాడు అని చెప్తాడు.

మిస్సమ్మ హ్యా పీగా వెళ్దాం పదండి అంటుంది. ఏయ్‌ లూజు వాడు ఎవడో మనకు తెలియదు. అలాంటప్పుడు ఎలా వెళ్తాం అంటాడు. ఎలా అంటారేంటి స్కూటర్‌ మీద వెళ్తాం అని అమర్‌ను వెళ్దామని ఒప్పిస్తుంది మిస్మమ్మ. అమర్‌ సరే అని మిస్సమ్మను ఎక్కించుకుని వెళ్లిపోతాడు.

బాబ్జీ, మనోహరికి ఫోన్‌ చేసి అమరేద్ర సార్‌, ఆ అమ్మాయి బైక్‌ మీద వెళ్లారని చెప్తాడు. దీంతో మనోహరి బైక్ మీద వెళ్లారా? అంటే ఆ మిస్సమ్మ అమర్‌ భుజాల మీద చెయ్యి వేసిందా? అని అడుగుతుంది. వెనక కూర్చున్నాక చెయ్యి వేయకుండా ఉంటుందా? మేడం అంటాడు బాబ్జీ. దీంతో మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతూ కారు స్టార్ట్‌ చేసుకుని వెళ్తుంది. రోడ్డు మీద ఉన్న రాథోడ్‌ మనోహరి కారుకు అడ్డుపడి లిఫ్ట్‌ అడిగి తాను కారులో వెళ్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Satyabhama Today Episode : సత్య భాధను అర్థం చేసుకున్న క్రిష్.. తండ్రి అసలు స్వరూపం తెలిసిపోతుందా?

Trinayani Serial Today September 27th: ‘త్రినయని’ సీరియల్‌: న్యూలుక్‌ లో ఎంట్రీ ఇచ్చిన విశాల్‌ – గజగండ గురించి భయపడ్డ తిలొత్తమ్మ

Nindu Noorella Saavasam Serial Today September 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం తెలుసుకున్న మిస్సమ్మ – బుర్ఖాలో ఫాలో అయిన మనోహరి

Small Screen: 9 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన ప్రముఖ బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్..!

Intinti Ramayanam Serial Today Episode September 26th: పల్లవిని డబ్బులు కావాలని డిమాండ్ చేసిన స్వాతి.. పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న అవని..

Gundeninda GudiGantalu Today Episode: రవికి డెడ్ లైన్ పెట్టిన శృతి.. రోహిణి, మనోజ్ లు వేరు కాపురం..

Satyabhama Serial Today Episode September 26th: మహాదేవయ్యతో సత్య వార్.. క్రిష్ తో గొడవ పడ్డ సత్య..

Big Stories

×