EPAPER

Nindu Noorella Saavasam Serial Today September 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ తో మిస్సమ్మ రొమాన్స్‌ – తాను ఆత్మను అని మిస్సమ్మకు చెప్పిన అరుంధతి

Nindu Noorella Saavasam Serial Today September 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ తో మిస్సమ్మ రొమాన్స్‌ – తాను ఆత్మను అని మిస్సమ్మకు చెప్పిన అరుంధతి

Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్, మిస్సమ్మను పిలిచి రేపు వినాయకచవితికి మీ అమ్మా నాన్నా వస్తున్నారా? అని అడగ్గానే వస్తున్నారు ఉదయం బయలుదేరుతారంట అని మిస్సమ్మ చెప్తుంది. దీంతో అమర్ ఏమీ రావొద్దని చెప్పు వాళ్లకు అనగానే మిస్సమ్మ సరే చెప్తాను కానీ ఒకసారి రమ్మని మరోసారి వద్దని అంటే పద్దతగా ఉండదని.. ఎందుకు రావొద్దు అని చెప్పాలో రీజన్ చెప్పండి అని అమర్ ను అడుగుతుంది మిస్సమ్మ. దీంతో అమర్ పలకకుండా ఫోన్ తీసుకుని రామ్మూర్తికి కాల్ చేస్తాడు. రేపు అర్జెంట్  వర్క్ ఉంది. అందుకే   ఇంట్లో పూజ చేస్తామో లేదోనని డౌటుగా ఉంది. అందుకే రేపు మీరేం రావొద్దని చెప్తాడు. రామ్మూర్తి సరే బాబుగారు అంటూ ఫోన్ కట్ చేస్తాడు. మిస్సమ్మ మాత్రం కారణం ఏదైనా కానీ ఇంటికి పిలిచి వాళ్లను మళ్లీ రావొద్దని చెప్పడం బాగాలేదని చెప్పి వెళ్లిపోతుంది.


తాను ఎవరికీ కనిపంచను అన్న అరుంధతి

డల్ గా గార్డెన్ లోకి వెళ్లి కూర్చున్న మిస్సమ్మ కు  సెక్యూరిటీ వాళ్లు వచ్చి బయట కూర్చోవద్దని లోపలికి వెళ్లండని చెప్తారు. వాళ్లు ఎంత చెప్పినా మిస్సమ్మ వినదు.  ఇంతలో అక్కడికి ఆరు వస్తుంది. మిస్సమ్మను చూసి డల్గా కూర్చున్నావు  ఏమైందని అడుగుతుంది. ఇన్ని రోజుల మా ఆయన మంచి వారన్నారు కానీ ఇవాళ ఆయన ఒక తలతిక్క పని చేశారు అక్కా అంటూ అమర్ రామ్మూర్తిని పండక్కి ఇంటికి పిలిచి మళ్లీ వద్దని అవమానించారని చెప్తుంది మిస్సమ్మ. దీంతో పిలిచి మరీ రావొద్దని చెప్పారా? ఆయన అలాంటి వారే కాదే ఎప్పుడూ కూడా అలా చేయరే అంటుంది ఆరు. ఆ ఆయన మీ ఆయననా? నీకు ఆయన గురించి అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు అంటుంది మిస్సమ్మ. దీంతో ఆయన మా ఆయనే మిస్సమ్మ  అందుకే ఆయన గురించి నాకు తెలుసు అని అని మనసులో అనుకుంటుంది ఆరు. ఇంతలో  ఆసలు ఆయన  నాకు అర్థం కారక్కా..? ఒకసారేమో చాలా దగ్గర ఉన్నట్లు.. నాకు  దగ్గర అయిపోయినట్టు అనిపిస్తారు. మరోక్కసారేమో చాలా దూరం అయిపోయినట్టు కనిపిస్తారు అంటుంది మిస్సమ్మ. దీంతో  ఆయన ఏం చేసినా దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది మిస్సమ్మా అంటూ నువ్వే ఆయన్ని  అర్థం చేసుకోకపోతే ఎలా మిస్సమ్మా అంటుంది ఆరు.

Also Read: ‘త్రినయని’ సీరియల్‌: విశాల్ రూపంలో వచ్చిన గజగండ – గాయత్రి పాప దెబ్బకు గజగండ పరార్


అరుంధతికి హాయ్ చెప్పిన రాథోడ్

అయితే ఇరిటేటింగ్ చూస్తున్న మిస్సమ్మ ఎప్పుడూ నేనే అర్థం చేసుకోవాలా? అంటూ అనుమానంగా బయటకు చూస్తూ అక్కా ఎవర్నీ కూడా లోపలికి రానివ్వడం లేదు మీరెలా వచ్చారు అని మిస్సమ్మ అడగ్గానే వెంటనే ఆరు నేను వాళ్లకు కనిపంచను కదా? అని వెంటనే తేరుకుని నేను వాళ్లుక రోజూ కనిపిస్తానుగా పక్క ఇల్లే అని ఏమీ అనలేదు అని అబద్దం చెప్తుంది ఆరు. ఇంతలో అక్కడికి రాథోడ్ రాగానే ఆరు వెళ్లబోతుంటే.. మిస్సమ్మ ఆరును అక్కా నువ్వు కూర్చో రాథోడ్ రాగానే లేచి వెళ్లిపోవాలా?  అంటుంది. దీంతో రాథోడ్ షాక్ అవుతాడు. మిస్సమ్మ బాధలో ఉన్నప్పుడు వాళ్ల అక్కను ఊహించుకుని మాట్లాడుతుందేమో.. అని రాథోడ్ మనసులో అనుకుని తాను కూడా కనిపించని అరుంధతితో  మాట్లాడినట్లుగా నటిస్తాడు. సార్ అరెస్ట్ చేసిన వ్యక్తి జైలు నుంచి తప్పించుకున్నాడు. వాడి వల్ల సారుకు ప్రమాదం ఉండొచ్చని టైట్ సెక్యూరిటీ అరెంజ్ చేశారు. అందుకే సారు రామ్మూర్తి గారిని ఇంటికి రావొద్దని ఉంటారు అని రాథోడ్ చెప్పగానే మిస్సమ్మ షాక్ అవుతుంది. వెంటనే లేచి లోపలికి వెళ్తుంది.

మనోహరికి షాక్ ఇచ్చిన అంజలి

మరోవైపు మనోహరి దగ్గరుక వెళ్లిన అంజు రణవీర్ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వమని అడుగుతుంది. దీంతో మనోహరి షాక్ అవుతుంది. ఎందుకు అని అడగ్గానే రేపు మన ఇంట్లో పండగ ఉంది కదా రణవీర్ అంకుల్ ను పండగకి పిలుద్దామనుకుంటున్నాను అని చెప్తుంది. దీంతో మనోహరి ఏం వద్దని అతను అంత ఇపార్టెంట్ వ్యక్తి కాదని అయినా వాళ్లకు వినాయక చవితి జరుపుకునే సంప్రదాయం ఉందో లేదో అంటుంది. దీంతో అంజు వాళ్లు కలకత్తా వాళ్లు అంటే అక్కడ అమ్మవారి నవరాత్రులు బాగా జరుపుకుంటారు. సో గణేష్ పడుంగ కూడా జరుపుకోవచ్చు అని చెప్తుంది. అయితే నువ్వేదే పెద్ద కలకత్తాలో ఉండి వచ్చినట్టు చెప్తున్నావు అంటూ తిడుతుంది మనోహరి. దీంతో నాకెందుకో కలకత్తా గురించి కానీ కలకత్తా మనుషుల గురించి కానీ మాట్లాడుకుంటుంటే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అని అంజు చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది.

అమర్ ను హగ్ చేసుకున్న మిస్సమ్మ

మరోవైపు అమర్ దగ్గరకు వెళ్లిన మిస్సమ్మ ప్రేమగా అమర్ ను చూస్తూ..  కోపాన్ని మాత్రమే పైకి చూపించే మీరు ప్రేమను లోపల ఎలా దాచుకోగలుగుతున్నారు అంటుంది. మత్తుగా అమర్ ను చూస్తే రొమాంటిక్ గా మాట్లాడతుంది మిస్సమ్మ. అయితే అమర్ బయటకు వెళ్లిపోతుంటే అడ్డు పడుతుంది. సారీ చెప్తుంది. మన ఇంటికి ఉన్న థ్రెట్ గురించి తెలిసింది. అందుకే మా నాన్నను ఇంటికి రావొద్దన్నారు అని అర్థం అయింది అంటుంది మిస్సమ్మ. ఇంతటితో ఇవాళ్టీ నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.

Related News

Gundeninda Gudigantalu Today Episode: ప్రభావతిని ఎదురించిన మీనా.. అడ్డంగా దొరికిన రోహిణి.. శృతి పెళ్లి డేట్ ఫిక్స్..

Satyabhama Serial Today September 19th: క్రిష్ ను కాపాడుకున్న సత్య.. నిజం తెలుసుకున్న మహదేవయ్య..

Trinayani Serial Today Episode: గాజులు దొంగిలించిన వల్లభ – తిలొత్తమ్మను ఓ ఆటాడుకున్న హాసిని

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరికి ధైర్యం చెప్పిన అమర్‌ – గుప్తకు హెల్ఫ్‌ చేసిన అరుంధతి

Brahmamudi Serial Today Episode: రాజ్‌ కు జీతం ఇస్తానన్న కావ్య – రుద్రాణిని రాయబారానికి పంపాలన్న స్వప్న

Kirrak Couples Promo: భార్యను మోయలేకపోయిన ఆదిరెడ్డి, కంగారులో పెదవి కొరికిన షరీఫ్, ఈవారం ‘క్రిర్రాక్ కఫుల్స్‘ ప్రోమో అదుర్స్ అంతే..

Nindu Noorella Saavasam Serial Today September 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు ఘోర పూజలు – ఎలాగైనా కాపాడతానన్న గుప్త

Big Stories

×