EPAPER

Nindu Noorella Saavasam Serial Today October 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని దీక్ష చేయమన్న మిస్సమ్మ – అమర్ ఇంటికి వచ్చిన ఘోర

Nindu Noorella Saavasam Serial Today October 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని దీక్ష చేయమన్న మిస్సమ్మ – అమర్ ఇంటికి వచ్చిన ఘోర

Nindu Noorella Saavasam Serial Today Episode : ఇంట్లో అందరూ దీక్ష చేయడం చూసిన మనోహరి షాక్‌ అవుతుంది. ఏదేదో మాటలు చెప్తుంటే.. మిస్సమ్మ.. మనోహరిని కూడా దీక్ష చేస్తావా అని అడుగుతుంది. నేను ఇలాంటివి నమ్మనని దీక్ష  చేయనని మనోహరి చెప్పగానే దేవుడి దగ్గర అలా మాట్లాడొద్దని భక్తితో ఉండాలని నిర్మల చెప్తుంది. దీంతో అసలు దేవుడు అటే భయం ఉంటేనే కదా అత్తయ్యా భక్తి వచ్చేది అంటుంది మిస్సమ్మ. బయటి నుంచి అంతా వింటున్న గుప్త నవ్వుకుంటూ అయ్యో బాలిక ఆత్మను బంధించినచో అంతా అయిపోయిందని సంతోసపడుతున్నారా. ఈ కుటుంబం దీక్ష చేసి ఆ బాలికను కాపాడతారు అనుకుంటాడు.


ఘోర మళ్లీ పూజక అంతా రెడీ చేసుకుంటాడు. అక్కడ మనోహరి వాళ్ల చేత దీక్ష ఆపించిన వెంటనే మనోహరికి సాయం చేసి వెళ్లి నేను దేవాను కలిసి మళ్లీ శక్తులు పొందాలి. ఏంటి ఆత్మ.. ఆ దీక్ష నిన్ను  కాపాడుతుందని ఆనంద పడుతున్నావా? నువ్వు నా చేతుల్లోంచి ఎప్పటికీ తప్పించుకోలేవు అని సీసా చేతుల్లోకి తీసుకుని అంటాడు. ఇంతలో అమర్‌ వాళ్ల ఇంట్లో జరుగుతున్న పూజలోంచి ఒక పవర్‌ వచ్చి సీసాలోకి వెళ్లి ఆరు ఆత్మను బయటకు తీసుకువస్తుంది. దీంతో ఘోర షాక్‌ అవుతాడు. నా పర్మిషన్‌ లేకుండా ఆత్మ బయటకు ఎలా వచ్చింది. ఆత్మ ఎందుకు వచ్చింది. అని అని గట్టిగా  అరుస్తుంటే.. అప్పుడే అక్కడికి గుప్త వస్తాడు.

నీ బంధనం బలహీనపడుతుంది ఘోర అంటూ హెచ్చరిస్తాడు. దీంతో ఘోరా ఎవరు ఎవరది.. కనిపించండి… ఓహో గుప్తులవారా..? అంటాడు. ఇంతలో ఆరు, గుప్త గారు నేను ఇక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఇక్కడి నుంచి పారిపోలేకపోతున్నాను నన్ను కాపాడండి అని అడుగుతుంది.  నిన్నెవ్వరూ విడిపించలేరు. నువ్వు బంధీగా ఉంది ఈ ఘోర దగ్గర. ఏదో నీ అదృష్టం బాగుండి సీసాలోంచి బయటకు వచ్చావు. నీ చుట్టు ఉంది నా బంధనం. నిన్ను ఆడించేది నా తంత్రం. గుప్తగారిని నానుంచి కాపాడి తీసుకెళమను చూస్తాను అంటాడు ఘోర. దీతో ఆరు, గుప్త గారు నీ దగ్గర శక్తులు ఉన్నాయి కదా? నన్ను కాపాడి తీసుకెళ్లండి అని అడుగుతుంది.  ఏంటి ఆత్మా.. నీ గుప్తుల వారు ఎప్పుడు తీసుకెళ్తారంట అని వెటకారంగా అడుగుతాడు.


ఘోర చెప్పింది నిజం బాలిక నేను నిన్ను కాపాడి తీసుకెళ్లలేను. ఎందుకంటే అది నా కర్తవ్యం కాదు కనక. నిన్ను కాపాడుటకు నీ కుంటుంబం మొత్తం కష్టపడుతుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు నీ పతి దేవుణి దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ దీక్ష చేస్తున్నారు అని గుప్త చెప్పగానే ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. ఘోర భయపడతాడు. దీంతో మాటలకే భయపడుతున్నావు.  నేను చూపించునది చూస్తే ఏమవుతావో..  అంటూ గుప్త మంత్రించి అమర్‌ ఇంట్లో జరిగే పూజను ఘోర, ఆరుకు చూపిస్తాడు.  ఇంతలో ఘోర మరో మంత్రం చదివి మళ్లీ ఆరును సీసాలో బంధించి తీసుకుని వెళ్తాడు.

పూజ పూర్తి చేసిన తర్వాత మిస్సమ్మ అందరికీ హారతి ఇస్తుంది. అందరూ సూర్యాస్తమయం అయ్యే వరకు ఏమీ తినకూడదు. సాయంత్రం పూజ అయ్యాక కొంత మందికి అన్నం పెట్టాక అప్పుడు మనం తినాలి అని చెప్తుంది. ఇంతలో రామ్మూర్తి నా కోసం మీరంతా దీక్ష చేశారు. చాలా సంతోషంగా ఉంది అంటూ ఎమోషన్‌ అవుతాడు. పూజ కోసం మీరు కూడా ఇబ్బంది పడ్డారు అంటాడు. దీంతో అమర్‌.. ఇష్టమైన వాళ్ల కోసం చేసినప్పుడు అది బాధ అనిపించదు అండి అంటూ అమర్‌ బయటకు వెళ్లి  ఘోర గురించి.. ఆరు గురించి ఆలోచిస్తాడు.

రాథోడ్‌ వస్తాడు. చనిపోయిన మేడం కోసం వీళ్లు పడుతున్న బాధ చూసి మీరు బాధపడుతున్నారా? సార్ అని అడుగుతాడు. అసలు ప్రాణాలతో లేని ఆరుకు కష్టమొచ్చిందని వీళ్లకు ఎందుకు అనిపించింది రాథోడ్‌. ఆ పకీర్‌ కూడా నిన్న మాట్లాడిన మాటలు గుర్తున్నాయా..? ఇంటికొచ్చిన స్వామి ఆస్తికలు గంగలో కలిపే వరకు ఆత్మ పరమాత్మలో కలవదు అని చెప్పారు. పకీర్‌ చెప్పిన దాని ప్రకారం నాకు ముఖ్యమైనది వాడు తీసుకెళ్లాడు అని… అసలు  నాకు ముఖ్యమైనది ఏంటి..?  అని అమర్‌ అడగ్గానే రాథోడ్ వెంటనే అరుంధతి మేడం సార్‌.. అంటాడు. వాడు తీసుకెళ్లింది ఆరునా..? ఆరు ప్రాణాలతో లేదు..? అంటే వాడు తీసుకెళ్లింది  ఆరు ఆత్మనా..? నిజంగానే ఆరు ఆత్మ ఇక్కడే ఉందా? నిజమా రాథోడ్‌ ఇది సాధ్యమా..?  అంటూ అమర్‌ అడగ్గానే రాథోడ్‌ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. అమర్ కూడా ఆరుతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు.

తర్వాత అమర్ ఇంటి దగ్గరకు వచ్చిన ఘోర.. మనోహరికి ఫోన్ చేసి బయటకు రమ్మంటాడు. బయటకు వచ్చిన మను టెన్షన్ తో  అమర్ చూస్తే మన ఇద్దరిని చంపేస్తాడని భయపడుతుంది. అయితే ఇంట్లో దీక్షను భగ్నం చేయడానికే వచ్చానని.. ఆత్మను ప్రయోగించి పూజను ఫెయిల్ చేస్తానని ఘోర చెప్పడంతో…  నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Intinti Ramayanam Today Episode : అవని గిఫ్ట్ ను రిజెక్ట్ చేసిన అక్షయ్.. పల్లవికి షాకివ్వబోతున్న అవని..

GundeNinda GudiGantalu Today Episode : సత్యం ఆరోగ్య పరిస్థితి విషమం.. మీనాకు దగ్గరవుతున్న బాలు.

Satyabhama Today Episode : సంజయ్ కు సత్య వార్నింగ్.. సత్య, క్రిష్ రొమాంటిక్ డ్యాన్స్..

Brahmamudi Serial Today October 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  కావ్య కష్టం అంతా వృథా – బిజినెస్‌ కోసం ఎవరూ ముందుకు రాని వైనం – కామెడీగా తీసిపారేసిన రాజ్‌

Trinayani Serial Today October 29th: ‘త్రినయని’ సీరియల్‌: బొమ్మలో బాంబు పెట్టిన తిలొత్తమ్మ – పాప గురించి ఇంట్లో వాళ్లకు ముందే తెలుసన్న అహల్య 

Nindu Noorella Saavasam Serial Today October 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గుప్తకు శక్తులు ఇచ్చిన దేవుడు – ముత్తైదువుల రాకతో మిస్సమ్మ పూజ సక్సెస్‌  

Intinti Ramayanam Today Episode : ఇంట్లో గ్రాండ్ గా పెళ్లిరోజు వేడుకలు.. అవనికి పల్లవి వల్ల ఘోర అవమానం..

×