EPAPER

Nindu Noorella Saavasam Serial Today October 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఘోర పూజలు చేస్తున్న  ప్లేస్‌ కు వెళ్లిన అమర్‌ – అక్క కోసం దీక్ష మొదలుపెట్టిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today October 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఘోర పూజలు చేస్తున్న  ప్లేస్‌ కు వెళ్లిన అమర్‌ – అక్క కోసం దీక్ష మొదలుపెట్టిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today Episode :   ఈ ఘోర లోకాధిపతి అయ్యాడు అనుకుని హ్యాపీగా ఫీలవుతుంటే అప్పుడే అక్కడికి మనోహరి వచ్చి మరి నన్ను ఎప్పుడు గెలిపిస్తావు ఘోర అని అడుగుతుంది. నీ కష్టాలు తీర్చాకే నా పని మొదలు పెడతాను మనోహరి అని ఘోర హామీ ఇస్తాడు.  దీని వల్ల నేను కోల్పోయినవి అన్ని దీంతోనే వెనక్కి తెప్పించబోతున్నావన్న మాట. అమర్ తో గడిపిన జీవితం నేను పెట్టిన బిక్షే.. దానికి రుణం తీర్చుకో ఆరు అంటుంది మనోహరి.


మరోవైపు ఘోరాను వెతుక్కుంటూ వచ్చిన పోలీస్‌ కానిస్టేబుల్‌ దూరంగా పాడుబడిన ఇంట్లో పూజలు చేయడం గమనించి రాథోడ్‌ కు ఫోన్‌ చేసి.. సార్‌ మీరు చెప్పినట్లే  ఓఆర్‌ఆర్‌ 19 ఎగ్జిట్‌ దగ్గర అతనెవరో ఏవో పూజలు చేస్తున్నాడు. ఆయన  పక్కన ఇంకెవరో ఉన్నారు సార్‌ అని చెప్తాడు. అవునా అయితే మేము వెంటనే  వస్తున్నాం. అని రాథోడ్‌ చెప్తాడు. మేము వచ్చే వరకు వాళ్లను నువ్వు దూరం నుంచి అబ్జర్వ ‌చేస్తూ ఉండు ఇప్పుడే మేము వస్తున్నాం. కమాన్‌ రాథోడ్‌ అంటూ అమర్‌ చెప్పడంతో ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు.

సరే ఘోర  ముందు నువ్వు చెప్పినట్టు భాగీలోకి ఆరు ఆత్మ  ప్రవేశించేలా చేసి అమర్‌కు దూరం అయ్యేలా చేయ్‌. తర్వాత నా మొగుడి సంగతి చూద్దాం అని చెప్తుంది మనోహరి. దీంతో ఘోర  అలాగే.. పని అవ్వగానే నేను దేవాను కలవడానికి వెళ్లాలి. ఈ శక్తులను నా నుంచి లాక్కోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఆలోగా చాలా శక్తులను నేను శాశ్వతం చేసుకోవాలి అని ఘోర చెప్తుంటే.. బయట అమర్‌, రాథోడ్ వస్తారు.


కానిస్టేబుల్‌ వాళ్లకు దూరం నుంచి ఘోరాను చూపిస్తాడు. ఇద్దరు కలిసి ఘోరవైపు వెళ్తుంటే మనోహరి అమర్‌ కారు చూసి భయపడుతుంది. వెంటనే ఘోరాను అలెర్ట్‌ చేస్తుంది. అమర్‌ వచ్చాడు ఘోర ఇప్పుడు మనం దొరికితే చంపేస్తాడు అని ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పారిపోతారు. స్పాట్‌కు వెళ్లిన అమర్‌ అక్కడ పూజలు చేసిన ప్లేస్‌ను ఫోటోలు తీయమంటాడు. ఆ ఫోటోలను సిద్దాంతికి పంపించు అంటాడు. సరేనని రాథోడ్‌ ఫోటోలు తీస్తాడు. ఆ చుట్టు పక్కల ఘోర కోసం అమర్‌ ఎంత వెతికినా ఘోర దొరకకుండా పారిపోతాడు.

ఇంట్లో అంతా దూపం వేసి ఉండటంతో మనోహరి ఏంటిది అని లేచి వచ్చి చూస్తుంది. మిస్సమ్మ అమ్మవారి దీక్ష చేస్తుంది. ఇల్లంతా దూపం వేసి పూజ చేస్తుంది. అందరూ వస్తారు. పూజ పూర్తి చేసి అందరికి హారతి ఇస్తుంది మిస్సమ్మ. మిస్సమ్మను అలా చూసిన మనోహరి ఏంటి మిస్సమ్మ ఈ అవతారం..? ఈ పూజలేంటి..? ఈ పాటలేంటి..? అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ,  మనోహరి గారు అవతారం అంటే కళ్లు పోతాయి. నేను అమ్మవారి దీక్ష చేస్తున్నాను అని చెప్తుంది. దీంతో నిర్మల  పూజ చేస్తాను అంటే నేనేదో  మామూలు పూజ అనుకున్నాను కానీ ఇంత పెద్ద దీక్ష చేస్తున్నావు అనుకోలేదు మిస్సమ్మ అంటుంది. అయినా ఇంత సడెన్‌ గా దీక్ష ఏంటమ్మా..? అని శివరాం అడుగుతాడు.

నేను నాన్నా మనసుకు ఎప్పుడు కష్టంగా అనిపించినా అమ్మవారికి దీక్ష చేసి కోరిక కోరుకోగానే కష్టాలన్నీ అమ్మవారే తీరుస్తారని మేము నమ్ముతాము. నాన్నకే కాదు.. నాక్కూడా రెండు రోజుల నుంచి మనసంతా అలజడిగా ఉంది. అందుకే దీక్ష చేపట్టాలని అనుకున్నాం. మీకు ఇబ్బంది అవుతుందని ముందు చెప్పలేదు అంటుంది మిస్సమ్మ. నీ పూజ మాకు ఇబ్బంది అవ్వడం ఏంటి మిస్సమ్మ.. దీక్ష అంటే చాలా పాటించాలి కదా..? నీకే కష్టంగా అనిపిస్తుందేమోనని ఆలోచిస్తుంన్నాం అంటాడు అమర్‌. నాకు ముందే చెప్పి ఉంటే నేను సాయం చేసేదాన్ని కదమ్మా.. అంటుంది నిర్మల. పర్వాలేదులే అత్తయ్యా… పిల్లలు మీరు వెళ్లి రెడీ అయి రండి మీకు టిఫిన్‌ రెడీ చేస్తాను అని మిస్సమ్మ చెప్పగానే అందరూ వెళ్లిపోతారు. మనోహరి మాత్రం వెంటనే మిస్సమ్మ దీక్ష చేస్తుందని ఘోరకు చెప్పాలి. ఇది నా ప్లాన్‌ మొత్తం చెడగొట్టేలా ఉంది అని మనసులో అనుకుంటూ వెళ్లిపోతుంది.

అమ్మవారి దీక్షలో ఇంటికి వెళ్లి దేవుడి ముందు దీపం వెలిగించిన రామ్మూర్తిని చూసి మంగళ షాక్‌ అవుతుంది. ఇదేంటయ్యా దీక్ష చేస్తున్నావా? నాకు ఒక్కమాట కూడా చెప్పలేదేంటి? అని ప్రశ్నిస్తుంది. అయినా ఈ వయసులో దీక్ష చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది అని అడుగుతుంది. దీంతో రామ్మూర్తి తన పెద్ద కూతురు బాగు కోసం నేను భాగీ కలిసి దీక్ష చేస్తున్నామని చెప్తాడు. చనిపోయిన దాని బాగు కోసం దీక్ష చేయడం ఏంటి అయినా చనిపోయిందని వీళ్లకు తెలియదు కదా? అని మనసులో అనుకుంటుంది. నాకు చెప్తే నేను వచ్చేదాన్ని కదా అని రామ్మూర్తిని అడగ్గానే నీకు చెప్పకూడదనే చెప్పలేదు అంటూ రామ్మూర్తి వెళ్లిపోతాడు.

ఘోర దగ్గరకు కంగారుగా వెళ్లిన మనోహరి.. ఇంట్లో మిస్సమ్మ అమ్మవారి దీక్ష చేస్తుందని దాన్ని వెంటనే ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేయాలని లేదంటే అది మొదటికే మోసం చేసేలా ఉందని చెప్తుంది. దీంతో ఘోర నవ్వుతూ మనం అనుకున్న వెంటనే జరగడానికి ఇదేం అల్లా ఉద్దీన్‌ అద్బుత దీపం కాదు మనోహరి.. నేను ఇంకా కొన్ని శక్తులు సంపాదించుకోవాలి అని చెప్తాడు. దీంతో షాక్ అయిన మనోహరి అంటే ఈ శక్తులు నీకు సరిపోవా..? అని డౌటుగా అడుగుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Satyabhama Today Episode : మహాదేవయ్య ప్లాన్ ను తిప్పికొట్టిన సత్య.. మైత్రికి షాక్ ఇచ్చిన నందిని..

GundeNinda GudiGantalu Today Episode : రవిని బాలు కొట్టిన విషయం తెలుసుకున్న శృతి.. మీనా కోసం టెన్షన్ పడుతున్న బాలు..

Intinti Ramayanam Today Episode : ఇంట్లో ఫంక్షన్ ను చెడగొట్టాలని పల్లవి ప్లాన్.. అవనిని ఇరికించిన పల్లవి..

Brahmamudi Serial Today October 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  మరో కొత్త ప్లాన్‌ వేసిన అపర్ణ, ఇందిర – రుద్రాణిని ఇంట్లోంచి వెళ్లగొడతారన్న స్వప్న

Trinayani Serial Today October 25th: ‘త్రినయని’ సీరియల్‌:  నయని, గాయత్రి దేవికి గొడవ – గాయత్రిదేవిని రెండో సారి చంపడానికి రెడీ అయిన తిలొత్తమ్మ

GundeNinda GudiGantalu Today Episode : బాలుకు దూరమైనా మీనా.. రవిని రెస్టారెంట్ లో కొట్టిన బాలు..

Big Stories

×