EPAPER

Nindu Noorella Saavasam Serial Today October 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి మాటిచ్చిన ఘోర – ఘోరాను వెతుక్కుంటూ వెళ్లిన అమర్‌

Nindu Noorella Saavasam Serial Today October 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి మాటిచ్చిన ఘోర – ఘోరాను వెతుక్కుంటూ వెళ్లిన అమర్‌

Nindu Noorella Saavasam Serial Today Episode :  రామ్మూర్తి బాధపడుతుంటే మిస్సమ్మ ఓదారుస్తూ.. మనకు ఎంత కష్టం వచ్చినా అమ్మవారే తోడు ఉంటారని చెప్తావు కదా నాన్నా? ఇప్పుడు కూడా అక్క కోసం అమ్మవారి దీక్ష చేద్దాము అంటుంది. మంచి ఆలోచన తల్లి రేపే దీక్ష మొదలు పెట్టి.. ఎల్లుండి కావడి ఎత్తుదాము తల్లీ అంటాడు రామ్మూర్తి.  సరే నాన్నా కానీ నువ్వు ఇలా ఏడుస్తుంటే అత్తయ్యవాళ్లు చూస్తే బాధపడతారు. మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్తూ లోపలికి తీసుకెళ్తుంది.


వాళ్లిద్దరి మాటలు అంత సేపు విన్న గుప్త ఆశ్యర్యపోతాడు. రక్తసంబంధానికి ఇంత శక్తి ఉందా? అనుకుంటాడు. అమ్మవారికి దీక్ష చేయమని నేను ఎలా చెప్పాలా అని సంశయిస్తుంటే వారికే ఆ ఆలోచన వచ్చేలా చేశావా జగన్నాథ అంటూ ఆకాశం వైపు చూస్తూ నీ లీలలు ఎవరూ తెలుసుకోలేరు కదా స్వామి అంటాడు.

అమర్‌, రాథోడ్‌ ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు. అమర్‌ ఘోరాను గుర్తు చేసుకుని అసలు వాడికి ఏం కావాలి. అసలు మన ఇంటి నుంచి ఏం తీసుకెళ్లాలని ఇన్ని రోజులు మన ఇంటి చుట్టు తిరిగాడు. అంజు బర్తుడే రోజు ఎందుకు ఇంటికి వచ్చాడు. ఎవరిని కలిశాడు..? ఏం తీసుకెళ్లాడు..? మన ఇంట్లో వాణ్ని కలిసే అవసరం ఎవరికి ఉంది అంటూ అనుమానిస్తుంటాడు. వాడు ఏం తీసుకెళ్లాడో తెలియదు కానీ ఇంట్లో అందరూ భయపడుతున్నారు సార్‌ అంటాడు రాథోడ్‌. అవును రాథోడ్‌ నాక్కూడా మనసంతా ఏదో అలజడి. ఎందుకో చాలా భయంగా ఉంది. ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఆరుకు దూరంగా ఉన్నప్పుడు అలా అనిపించేది. మళ్లీ ఇప్పుడు అలజడిగా ఉంది అంటూ అమర్‌ ఎమోషనల్‌ గా ఫీలవుతుంటే ఇంతలో అమర్‌ వాళ్ల కారుకు ఒక స్వామిజీ వచ్చి అడ్డుపడతాడు.


రాథోడ్‌ కారు ఆపి వెళ్లి ఎందుకు మా కారుకు అడ్డంగా నిలబడ్డావు పక్కకు తప్పుకో అని చెప్తుంటాడు. ఆ స్వామిజీ మాత్ర రాథోడ్‌ మాటలు పట్టించుకోకుండా నవ్వుతూ.. ఆ అలజడికి కారణం ఉంది అంటాడు. ఆశ్యర్యంగా అమర్‌ కారు దిగి వచ్చి.. ఏమన్నారు..? కారణం ఉందా? అని అడుగుతాడు. అవును అదే కదా నీ ప్రశ్న అంటాడు స్వామిజీ.. నేను నిన్ను ఏ ప్రశ్న అడగలేదే..? అంటూ అమర్‌ అడగడంతో  అడగాలి సామి.. మీకు తెలియనప్పుడు అడగాలి. అప్పుడే సమాధానం దొరుకుంతుంది.

నీకు ముఖ్యమైనది వాడు స్వార్థానికి  తీసుకెళ్లాడు. అని చెప్పగానే.. ఎం తీసుకెళ్లాడు.. ఇదంతా మీకెలా తెలుసు..? అసలు మీరెవరు..? అని అమర్‌ ప్రశ్నించడంతో ఇప్పుడు నేను ఎవరన్నది ముఖ్యం కాదు. నీకు ముఖ్యమైనది ఏమిటి..? వాడి నుంచి నువ్వు కాపాడాల్సింది ఏమిటి? అనేది తెలుసుకో.. నువ్వు వెతుకుతున్నది ఊరి బయట ఉంది. నీ చేతుల్లో ఓడిపోవడానికి వాడు సిద్దంగా ఉన్నాడు వెళ్లు.. వెళ్లు.. వెళ్లు అంటూ స్వామిజీ వెళ్లిపోతాడు. ఆయన ఏం చెప్పాడో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు సార్‌ అంటాడు రాథోడ్‌. అతను చెప్పింది అర్థం కాకపోయినా ఏదో హింట్‌ ఇచ్చాడనిపిస్తుంది రాథోడ్‌. సరే కానీ నువ్వు లోకల్‌ ఎస్సైతో మాట్లాడి ఈ ఏరియాలో ఘోరను వెతకమని చెప్పు అంటాడు. సరే సార్‌ అని రాథోడ్‌ ఎస్సైతో మాట్లాడతాడు.

ఆరు కోసం ఇంటి చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తుంది మిస్సమ్మ. ఎక్కడా ఆరు గురించి తెలియకపోవడంతో బాధగా వచ్చి గార్డెన్‌ లో కూర్చుంటుంది. నిర్మల వచ్చి ఏంటి మిస్సమ్మ అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్యా పక్కింటి ఆక్క గురించి ఎంత వెతికినా కనిపించడం లేదు అని చెప్తుంది. దీంతో  నిన్న ఘోర రావడం. అప్పటి నుంచి ఇంట్లో అందరి మనసు కీడు శంకిస్తు ఉండటం ఇవన్నీ చూస్తుంటే మనసు ఎందుకో భారంగా ఉంది అమ్మా.. అంటుంది నిర్మల. అవును అత్తయ్య ఆలోచిస్తుంటే కరెక్టుగా ఘోర ఇంటికి వచ్చి వెళ్లినప్పటి నుంచే అక్క కూడా కనిపించకుండా పోయింది.

అసలు మనకు తెలియకుండా నిన్న ఇంట్లో ఏదో జరిగింది అత్తయ్య. ఏది ఎందుకు జరుగుతుందో ఎంత ఆలోచించినా అర్తం కావడం లేదు. ఎటు చూసినా ప్రశ్నలే కానీ సమాధానాలు దొరకడం లేదు అంటుంది మిస్సమ్మ. దూరం నుంచి ఇద్దరిని గమనించిన మనోహరి… దగ్గరకు వచ్చి ఏమైంది ఆంటీ దేని గురించో సీరియస్‌గా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. దీంతో పక్కింటి అక్క గురించి నిన్నటి నుంచి కనిపించడం లేదు అని చెప్తుంది మిస్సమ్మ.

అదేంటి మీకు చెప్పలేదా? ఆవిడ ఇక్కడి నుంచి వెళ్లిపోయింది కదా? అంటుంది మనోహరి. దీంతో కంగారుగా వెళ్లడం అంటే ఎక్కడికి వెళ్లింది. ఎలా వెళ్లింది. ఎందుకు వెళ్లింది అని అడుగుతుంది మిస్సమ్మ. దీంతో వెటకారంగా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది మిస్సమ్మ.. కానీ వెళ్లడం రాసి పెట్టి ఉన్నప్పుడు వెళ్లక తప్పదు కదా? అక్క ఇక తిరిగి రాదు. రాలేదు. నువ్వు మర్చిపోవడం బెటర్‌ మిస్సమ్మ. సరే నాకు చిన్న పని ఉంది వెళ్లోస్తాను అంటూ వెళ్లపోతుంది మనోహరి.

  ఘోర దగ్గర సీసాలో బంధీగా ఉన్న ఆరు ఏడుస్తుంది. దేవుడా ప్లీజ్‌ నన్ను కాపాడు అంటూ వేడుకుంటుంది. అక్కడే దగ్గరలో ఉన్న అమర్‌ హార్ట్‌ వేగంగా కొట్టుకుంటుంది. అమర్‌ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఆరును గుర్తు చేసుకుంటాడు. అమర్‌ ను గమనించిన రాథోడ్‌ ఏమైంది సార్‌.. అని అడుగుతాడు. ఎందుకో ఆరు మాటలు వినిపించినట్టు అనిపించింది రాథోడ్‌. మనసంతా ఎందుకో భయంగా ఉంది. ఎవరి మీదనో తెలియదు కానీ చాలా కోపంగా ఉంది. మనిషిని ఇక్కడ ఉన్నా కానీ మనసు ఎక్కడొక్కడో తిరుగుతుంది. అంటూ బాధపడతాడు.

ఘోర గట్టిగా నవ్వుతూ ఆరు ఉన్న సీసాను చేతిలోకి తీసుకుని ఆత్మా ఇప్పటి నుంచి నువ్వు నా బంధీవి నా బానిసవి.. నా మాటే నీకు శాసనం. ఈ ఘోర లోకాధిపతి అయ్యాడు అనుకుని హ్యాపీగా ఫీలవుతుంటే అప్పుడే అక్కడికి మనోహరి వచ్చి మరి నన్ను ఎప్పుడు గెలిపిస్తావు ఘోర అని అడుగుతుంది. నీ కష్టాలు తీర్చాకే నా పని మొదలు పెడతాను మనోహరి అని ఘోర హామీ ఇస్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Satyabhama Today Episode : మహాదేవయ్య ప్లాన్ ను తిప్పికొట్టిన సత్య.. మైత్రికి షాక్ ఇచ్చిన నందిని..

GundeNinda GudiGantalu Today Episode : రవిని బాలు కొట్టిన విషయం తెలుసుకున్న శృతి.. మీనా కోసం టెన్షన్ పడుతున్న బాలు..

Intinti Ramayanam Today Episode : ఇంట్లో ఫంక్షన్ ను చెడగొట్టాలని పల్లవి ప్లాన్.. అవనిని ఇరికించిన పల్లవి..

Nindu Noorella Saavasam Serial Today October 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఘోర పూజలు చేస్తున్న  ప్లేస్‌ కు వెళ్లిన అమర్‌ – అక్క కోసం దీక్ష మొదలుపెట్టిన మిస్సమ్మ

Brahmamudi Serial Today October 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  మరో కొత్త ప్లాన్‌ వేసిన అపర్ణ, ఇందిర – రుద్రాణిని ఇంట్లోంచి వెళ్లగొడతారన్న స్వప్న

Trinayani Serial Today October 25th: ‘త్రినయని’ సీరియల్‌:  నయని, గాయత్రి దేవికి గొడవ – గాయత్రిదేవిని రెండో సారి చంపడానికి రెడీ అయిన తిలొత్తమ్మ

GundeNinda GudiGantalu Today Episode : బాలుకు దూరమైనా మీనా.. రవిని రెస్టారెంట్ లో కొట్టిన బాలు..

Big Stories

×