Nindu Noorella Saavasam Serial Today Episode : నా ఆరు గుర్తుకు వస్తే ఇలా బయటకు వచ్చి తనతో మాట్లాడతానని.. కానీ తన మాటలు నాకు వినిపించవు కానీ నా మాటలు తనకు వినిపిస్తాయి కదా? అంటూ అసలు నువ్వెందుకు బయటకు వచ్చావు అని అడుగుతుంది మనోహరి. దీంతో నేను స్కెచ్ వేసుకున్న అమ్మ ఫోటో మిస్సమ్మ తీసుకుని బయటకు వచ్చింది. అందుకే వచ్చానని అంజు చెప్పడంతో.. దొరికావే మిస్సమ్మ ఇప్పుడు చూడు నీ కథ అని మనసులో అనుకుంటుంది మనోహరి.
ఆ ఫోటో గురించి అడగొద్దని అమాయకంగా చెప్తుంది మనోహరి. నిజం తెలిస్తే నువ్వు మిస్సమ్మకు శాశ్వతంగా దూరం అవుతావని అంటుంది. పక్కనే నిలబడ్డ ఆరు ఆత్మ మాత్రం మనోహరి మాటలు నమ్మోద్దని అంజుకు చెప్తుంది. కానీ ఆరు మాటలు అంజుకు వినిపించవు. అంటీ నేను అమ్మ ఫోటో గురించి మాట్లాడుతుంటే మీరెందుకు ఏదేదో మాట్లాడుతున్నారు. మిస్సమ్మ, అమ్మ ఫోటో బయటకు ఎందుకు తెచ్చిందో చెప్పండి అని అడుగుతుంది. దీంతో మనోహరి నీకు నిజం చెప్పి నిన్ను బాధపెట్టలేను అంజు.. నిజాన్ని చూసి తట్టుకునే శక్తి నీకు లేదు అంజు.. పద మనం లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం పద.. అంటూ కావాలనే అంజు కింద పడి ఉన్న ఫోటో చూసేలా చేస్తుంది.
అంజు ఫోటో చూడగానే మళ్లీ మనోహరి అమాయకంగా అంజు నువ్వేం చూడలేదు.. ఇక్కడేం లేదు పద మనం లోపలికి వెళ్దాం అంటుంది. దీంతో అంజు కోపంగా అమ్మ ఫోటోను ఇలా ఎవరు చేశారు ఆంటీ.. అని అడుగుతుంది. నేను చెప్పలేను అంజు. చెప్పి నీ నమ్మకాన్ని నేను పాడు చేయలేను అంటూ నటిస్తుంది మనోహరి. అంజు ఇంకాస్త కోపంగా చెప్పమని అడుగుతున్నాను కదా ఆంటీ అమ్మ ఫోటోను ఇలా ఎవరు చేశారు అంటుంది. మిస్సమ్మ చేసింది అంజు.. ఇందాక ఆరు ఫోటోను కాలితో తొక్కుతుంటే నేను ఆపబోయాను. నన్ను నోటికి వచ్చినట్టు తిట్టింది. ఆరు ఫోటోనే కాదు పేరు కూడా ఇంట్లో వినబడకుండా చేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయింది.
అని మనోహరి చెప్పగానే అంజు కోపంతో రగిలిపోతుంది. మిస్సమ్మ నీ అంతు చూస్తానని శపథం చేస్తుంది. మనోహరి మాత్రం ఏమీ తెలియనట్టు నువ్వు ఒక్కదానివే అయితే మిస్సమ్మను ఏమీ చేయలేవు అంజు నేను చెప్పినట్టు చేస్తే మిస్సమ్మ మీద నువ్వు రివేంజ్ తీర్చుకోవచ్చు అంటుంది. దీంతో అంజు.. ఆ మిస్సమ్మను వదిలేదు లేదు. అమ్మ విషయంలో మిస్సమ్మ చేసే పనులు ఎప్పటికీ మర్చిపోలేను ఆంటీ నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ లోపలికి వెళ్లిపోతుంది. అంజు వెళ్లిపోయాక.. మనోహరి ఆరుకు వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా నువ్వు చూస్తూనే ఉన్నావా..? అంటూ నా పని సగం పూర్తయింది ఆరు. నేను వెలిగించిన చిచ్చుబుడ్డి ఎంత గట్టిగా పేలుతుందో ఏంటో..? నీకు ఏవో ప్లాన్స్ ఉంటాయి కదా ఆ ప్లాన్స్ అన్ని ఈ బుడ్డ చిచ్చు బుడ్డి ఎలా పాడు చేస్తుందో చూస్తూ ఉండు అంటూ మనోహరి లోపలికి వెళ్లిపోతుంది.
వాకింగ్ కు వెళ్లి ఇంటికి వచ్చిన శివరాం.. ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉందని ఆస్వాదిస్తుంటాడు. ఇంతలో నిర్మల వచ్చి అప్పుడే వచ్చేశారా? అని పలకరిస్తుంది. అవునని శివరాం చెప్తుండగానే ఇద్దరికీ మిస్సమ్మ టీ తీసుకొస్తుంది. టీ తాగుతున్న శివరాంతో నిర్మల మనం ఏ పుణ్యం చేశామనండి మనకు ఇంత అదృష్టం దొరికింది అంటుంది. శివరాం అర్థం కాక నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నిర్మల అని అడుగుతాడు. దీంతో నిర్మల మన మిస్సమ్మ గురించి అని చెప్తుంది. శివరాం కూడా మిస్సమ్మను మెచ్చుకుంటాడు. మంచి అమ్మాయి అంటూ చక్కటి బుద్ది. గొప్ప సంస్కారం. శత్రువుకైనా మంచి జరగాలని కోరుకునే మంచి అమ్మాయి అంటాడు.
దీంతో నిర్మల ఏడుస్తూ.. తాను మేడ మీద నుంచి దూకబోయిన విషయం మిస్సమ్మ వచ్చి తనను కాపాడిన విషయం చెప్తుంది. దీంతో శివరాం షాక్ అవుతాడు. అప్పుడే హాల్ లోకి వచ్చిన మిస్సమ్మ చూసి ఎమోషనల్ అయిన శివరాం.. దగ్గరకు వెళ్లి మిస్సమ్మ చేతులు పట్టుకుని థాంక్స్ చెప్తాడు. మిస్మస్మ అయోమయంగా ఎందుకు మామయ్యా అని అడుగుతుంది. నిర్మల వచ్చి ఆ విషయం చెప్పానని సైగ చేస్తుంది. దీంతో ఎవ్వరికీ చెప్పొద్దన్నాను కదా అత్తయ్యా అంటుంది. ఆయనకు చెప్పకుండా ఎలా ఉండగలను మిస్సమ్మ అంటుంది నిర్మల.
ఇక అమర్‌తో పెళ్లి జరిగాక నువ్వు సుఖంగా లేవని నిర్మల అంటుంది దీంతో అదేం లేదత్తయ్యా ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు కదా? అంటుంది మిస్సమ్మ. లేదమ్మా మాకు తెలుసు అని శివరాం అంటూ ఇప్పుడే వెళ్లి అమర్‌తో మాట్లాడతానంటాడు. మిస్సమ్మ వద్దని వారిస్తుంది. అయినా వినకుండా శివరాం పైకి వెళ్లి అమర్‌తో మాట్లాడతాడు. నువ్వు పాత జ్ఞాపకాలలో ఉండిపోతే మిస్సమ్మ పరిస్థితి ఏంటని నిలదీస్తాడు. అమర్ నువ్వు మారి మిస్సమ్మతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టు అని చెప్తాడు. దీంతో అమర్ ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన మిస్సమ్మను తదేకంగా చూస్తుండిపోతాడు అమర్. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.