Intinti Ramayanam Today Episode October 31st : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ పెళ్లిరోజు వేడుకలను ఇంట్లో వాళ్ళు ఘనంగా జరుపుతారు.. అవనిని దారుణంగా అవమానించాలి అని అనుకుంటుంది. కానీ పల్లవి ప్లాన్ ప్రకారం రావడం ఒక వ్యక్తి లోపలికి వస్తాడు. ఇక అతను అందరిలోకి మెల్లగా వెళ్తాడు. ఎవరికి అనుమానం రాకుండా గెస్ట్ లాగా తిరుగుతాడు.. మొత్తానికి అవని నగలు ఇచ్చిందని అతను చెబుతాడు. దానికి ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది. ఇక అవని తప్పు ఏమి లేకపోవడంతో అంతా హ్యాపిగా ఫీల్ అవుతారు.. ఇక సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. అవని తప్పు లేదని తెలిసిన తర్వాత అందరూ హ్యాపీగా ఉంటారు, కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం బాధపడుతూ ఉంటాడు. నా ఇంట్లో ఇలాంటి జరగడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కేక్ కట్ చేయమని అడుగుతారు. ఇలా జరగడం నాకు బాధగా ఉంది నేను కట్ చేయలేను అవసరం లేదు అనేసి రాజేంద్రప్రసాద్ అనడంతో అందరూ ఫీలవుతారు. ఇక రాజేశ్వరి కూడా వాడెవడో వచ్చి అన్నాడని మీరెందుకు అన్నయ్య ఫీలవుతారు ఇందులో అవని తప్పు లేదని తెలిసిపోయింది కదా అప్పుడప్పుడు ఇలాంటి సహజం బిజినెస్ చేస్తున్నప్పుడు ఇలాంటివి కామన్ మీరు ఇవన్నీ పట్టించుకోవద్దు మీరు హ్యాపీగా మీ పెళ్లి రోజు వేడుకల్ని జరుపుకోండి అనేసి అంటుంది. కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం అందుకు ఒప్పుకోడు. ఇక ప్రణవి పార్వతీతో చెప్తుంది అమ్మ నువ్వైనా నాన్నతో చెప్పు కేక్ కట్ చేయమని అనేసి అంటుంది. ఇక పార్వతి పిల్లలు ఏదో సంతోష పడుతున్నారు వాళ్ళ సంతోషాన్ని ఎందుకండీ కాదనడం అనేసి అనగానే రాజేంద్రప్రసాద్ ఆలోచిస్తాడు ఇక ఆరాధ్య నువ్వు కేక చేయకపోతే నేను స్కూల్ కి వెళ్ళాలని చెప్తుంది ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు నేను కేక్ కట్ చేస్తానని ఆరాధ్యతో అంటాడు. ఇక అందరూ సంతోషంగా ఫీల్ అయ్యి అమ్మానాన్నలు కేక్ కట్ చేస్తే పంచుతారు. అక్షయ్ మాత్రం అవని కేక్ ఇస్తే తీసుకోవడానికి ఇష్టపడడు . కమల్ పల్లవికి కేక్ ని పెడతాడు. అక్షయ్ ఆరాధ్యకు కేక్ పెడుతుంటే మమ్మీకి పెట్టు తర్వాత తీసుకుంటాను అని చెప్తుంది.
ఇక అందరూ సంతోషంగా ఉంటారు. పెళ్లి రోజు ఫంక్షన్ బాగా జరిగిందని మాట్లాడుకుంటూ ఉంటారు. గెస్ట్లు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలని వాటిని ముందేసుకుని ఓపెన్ చేస్తారు. అన్ని గిఫ్ట్లను ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. అందులో ఒకరు ఖరీదైన నెక్లెస్ ని ఇవ్వడంతో అది చూసి అందరూ సంబరపడిపోతుంటారు. చాలా బాగుంది చాలా ఖరీదైన అంటూ మాట్లాడుకుంటారు. అప్పుడే పల్లవి అక్కడికి వస్తుంది. మీరంతా ఇంత సంతోషంగా ఉన్నారు అక్క మీద పడిన నింద గురించి మీరు మాట్లాడరా అక్కది తప్పు లేదని తెలుసు కానీ అతను చెప్పిన దాంట్లో కనీసం 10 శాతం అయినా తప్పు ఉంటుంది కదా అనేసి అడుగుతుంది. దానికి రాజేంద్రప్రసాద్ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు అనేసి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు అవని మీద నింద వేస్తున్నావంటే దానికి సాక్షాలు ఉన్నాయా ఆధారాలు నీ దగ్గర ఏమైనా ఉంటే చూపించు. అప్పుడు మాట్లాడదాం అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు. పల్లవి లేవగానే అందరూ నానా మాటలు అంటారు. ఇక కమల్ వదినను అంత మాట అంటావా వదినది తప్పు అంటావా వాడిని వెనకేసుకొనస్తావని పల్లవిని చెంప దెబ్బ కొడతాడు. ఇక పార్వతి పల్లవికి బుద్ధి లేదా చదువుకున్నావ్ ఆ మాత్రం నీకు ఇంకిత జ్ఞానం లేదా అనేసి దారుణంగా తిడుతుంది. కానీ అక్షయ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. పల్లవి చెప్పింది దాంట్లో నిజం ఉందని అనుకుంటాడు. అది చూసిన పల్లవి సంబరపడిపోతుంది. నాకు కేవలం చెంప దెబ్బ మాత్రమే తగిలింది నీకు అక్క మీద అనుమానం మొదలైంది అనేసి ఆలోచిస్తుంది. ఇక చక్రధర్ మందు తాగుతూ ఉంటాడు. రాజేంద్రప్రసాద్ ఇంట్లో ఏం చేసినా వాళ్ళ సంతోషాన్ని దూరం చేయలేకున్నాను అని కోపంతో గ్లాస్ ని పగలగొడతాడు. రాజేశ్వరి వచ్చి మీరు ఇంకా తాగడం అవ్వలేదని అడుగుతుంది కట్టు కడుతుంది. బ్లడ్ ఎక్కువ వస్తుందని హాస్పిటల్ కి వెళ్దామని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. అక్కడ డాక్టర్ కోసం వెళ్తుంటే మీనాక్షిని చూస్తాడు చక్రధర్. చేతికి కట్టు కట్టిన తర్వాత మీనాక్షిని కలుస్తాడు. మీనాక్షికి వార్నింగ్ ఇస్తాడు. దానికి మీనాక్షి భయపడుతుంది.
ఇక లోపలికి వెళ్ళిన అక్షయ్ లైట్ వేస్తాడు . అవని పూలు పెట్టుకొని రొమాంటిక్గా కనిపిస్తుంది. దానికి ఫిదా అయినా అక్షయ్ ఇద్దరు కలిసి పోతారు. ఇక రేపటి ఎపిసోడ్ లో పండగ కోసం ఇంట్లో అందరూ పూలు కడుతూ ఉంటారు. అక్కడ కూర్చోడానికి వెళ్లిన అవనీకి భరత్ ఫోన్ చేస్తాడు. అమ్మకి సీరియస్ గా ఉందని అనడంతో అవని అక్కడికి వెళుతుంది. ఇంత రాత్రిపూట అవని ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని అక్షయ్ కూడా అవని వెనుక వెళ్తాడు. అవని దాస్తున్న నిజమెంటో అక్షయ్ తెలుసుకుంటాడా? అవని తండ్రి చక్రధరని అవని తెలుసుకుంటుందా చూడాలి..