Intinti Ramayanam Today Episode October 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవనికి తన అంతరాత్మ కనిపిస్తుంది. అవని నగల విషయం ఎలా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఫంక్షన్ కి నేను నగలు పెట్టుకోకపోతే అందరికీ అనుమానం వస్తుంది. ఇప్పటికిప్పుడు నువ్వు అంత డబ్బు కట్టి నగలను విడిపించుకు రావడం చాలా కష్టం అయితే వాటి ప్లేస్ లో ఫంక్షన్ అయిపోయే వరకు గిల్టు నగల్ని తీసుకొస్తే సరిపోతుందని సలహా ఇస్తుంది. మోసం చేయడం అవసరమా అని అవని అనుకుంటుంది. నగలు తాకట్టు పెట్టి ఇంట్లో ఎవరికీ తెలియకుండా మీ అమ్మకి హాస్పిటల్లో కట్టావు అది మోసం కాదా అమ్మకి చేయడం తప్ప వేరొకటి లేదు.. అబార్షన్ విషయం ఇంట్లో తెలియకుండా చూసుకున్నావా అని చక్రధర్ పల్లవిని అడుగుతాడు. డాడీ చెయ్యి పై ఉన్న టాటూ గురించి నిజం దాచిన చక్రధర్.. పల్లవికి అవని గోల్డ్ షాప్ దగ్గర కనిపిస్తుంది. అవని తనకు గిల్టు నగలు కావాలని చూపించి డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తుంది. అవని వెళ్లిపోయిన తర్వాత పల్లవి వెళ్లి ఆ షాప్ అతన్ని అడుగుతుంది. గిల్టు నగలు కావాలంట ఇంట్లో ఫంక్షన్ ఉందంట అని ఆ షాప్ అతను నిజం చెప్పేస్తాడు. ఇక పల్లవి తాకట్టు రిసిప్ట్ తీసుకుంటుంది.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరాధ్యకు అక్షయ్ డ్రెస్ ని తీసుకొని వస్తాడు. డ్రెస్సు కరెక్ట్ గా సరిపోయింది కదా నీకోసమే తీసుకొచ్చాను బాగుందా అనేసి ఆరాధ్యును అడుగుతాడు. దానికి ఆరాధ్య చాలా బాగుంది డాడీ నాకు బాగా నచ్చింది అనేసి చెప్తుంది. ఇక ఎందుకు డాడీ ఇప్పుడు డ్రెస్ తీసుకున్నావని ఆరాధ్య అడుగుతుంది. రేపు నానమ్మ తాత ఇలా పెళ్లిరోజు ఫంక్షన్ కదా అందుకు నీకోసం ఈ డ్రెస్ తీసుకున్నాను బాగుంది కదా అనేసి ఆరాధ్యను అక్షయ్ అంటాడు. నాకు తీసుకున్న సరే మమ్మీ కి ఏ సారీ తీసుకున్న చూపించవా అనేసి అడుగుతుంది. ఇది నీకు అవసరం లేదు వెళ్లి చదువుకో పో తర్వాత చూపిస్తాను అనేసి అంటాడు. అవని నాకు దాస్తున్న నిజం ఏంటో చెప్తేనే ఈసారి తనకి ఇస్తానని అక్షయ్ అంటాడు.
అప్పుడే అవని బెడ్ రూమ్ లోకి వస్తుంది. ఏమైంది మీకు ఎందుకలా ఉన్నారు. తెలియని వాళ్ళు ఎవరో వస్తే ఎలా చూస్తున్నారో అలా చూస్తున్నారనేసి అవని అక్షయ్ ని అడుగుతుంది. నా దగ్గర నువ్వు నిజం దాస్తున్నావు అదేంటో చెప్పు అనేసి అక్షయ్ గట్టిగా నిలదీస్తాడు. కానీ తల్లికి ఇచ్చిన మాట కోసం అవని నోరు మెదపకుండా ఉంటుంది. అప్పుడే భరత్ అవనికి ఫోన్ చేస్తాడు. అవని ఫోన్ ని కట్ చేస్తుంది. మళ్లీ భరత్ ఫోన్ చేస్తాడు. మళ్లీ కట్ చేస్తుంది. అప్పుడు అక్షయ్ ఎవరు అన్ని సార్లు ఫోన్ చేస్తే మాట్లాడవేంటి అని అడుగుతాడు. నాకు తెలిసిన వాళ్ళు లేండి అంత ఇంపార్టెంట్ కాదు అని కట్ చేశాను చెప్పండి అనేసి అవని అంటుంది. నువ్వు ఏదో నిజం దాస్తున్నావు నన్ను మోసం చేస్తున్నాం అనేసి అక్షయ్అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
అవని సెల్ఫ్ లో ఉన్న తాకట్టు రిసిప్ట్ ని తీసుకున్నా ఆ పల్లవి అతనికి కాల్ చేస్తుంది. అవినీలాగే మాట్లాడి తనకు కుదరలేదని పల్లవి వస్తుందని చెప్తుంది. ఇక పల్లవి అతన్ని డబ్బులు ఎంత ఇవ్వాలని అడిగి నగలను తీసుకుంటుంది. ఈ నగలతో రేపు ఫంక్షన్ లో అవనీని అడ్డంగా బుక్ చేస్తానని పల్లవి అనుకుంటుంది. ఇక కమల్ తన నైట్ డ్రెస్ ఎక్కడుందని పల్లవిని అడుగుతాడు. లో ఉన్న బ్యాగ్ ని చూసి ఏంది గిఫ్ట్ ఎవరి కోసం అనేసి అడిగితే అప్పుడు పల్లవి బావ అది అత్తయ్య వాళ్ళ కోసం అనేసి చెప్తుంది. ఇక కమల్ ఈరోజు నీ డేట్ అయిపోయింది కదా ఇక మనకి శోభనం జరిగిపోవాలని చెబుతాడు. పల్లవి దగ్గరికి రాగానే పల్లవి తన్నుతుంది. కమల్ కింద పడిపోతాడు. కమల్ అరచిన అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు.
ఏమైందని అడుగుతారు. భార్యతో సరసాలు ఆడుతుంటే బెడ్ మీద నుంచి కింద పడ్డాను అని చెబుతాడు. అందరు నవ్వుకొని వెళ్ళిపోతారు. ఇక పల్లవికి వాళ్ళ అమ్మమ్మ ఆయిల్ ఇచ్చి మసాజ్ చెయ్యమని చెప్పి వెళ్తుంది. కమల్ కి పల్లవి మసాజ్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ రాజేంద్రప్రసాద్ కి ఆయన భార్యకు అర్ధరాత్రి వాళ్ళ రూమ్ కి వెళ్లి విషెస్ చెప్తారు. గెస్ట్ లు వస్తున్నారు మీరు రెడీ అవ్వండి అనేసి ఫంక్షన్ గురించి రివిల్ చేస్తారు. మీరు సంతోషంగా ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు నేను మీ అందరికీ షాక్ ఇవ్వబోతున్నాననేసి పల్లవి తన మనసులో అనుకుంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఇంట్లో ఫంక్షన్ కి గెస్ట్ లందరూ వస్తారు. ఒకతను నగలను తీసుకొని కింద పడతాడు. అవనీని ఆ నగలు ఇచ్చిందని అబద్ధం చెప్తాడు. అవనీ అతని చెంప చెల్లుమనిపిస్తుంది. ఇక పల్లవి అవి గిల్టు నగలు అయితే ఒరిజినల్ నగలు ఏవి అక్క అనేసి అడుగుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్లో అవనికి పల్లవి షాక్ ఇస్తుందా? అవని పల్లవి కి షాక్ ఇస్తుందేమో చూడాలి..