Gundeninda GudiGantalu Today Episode 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం కు హార్ట్ ఏటాక్ రావడంతో హాస్పిటల్ లో చేరుస్తారు. అక్కడ డాక్టర్ ఏమి చెప్తాడా అని టెన్షన్ పడతారు. ఇక డాక్టర్ వచ్చి మాసీవ్ హార్ట్ ఏటాక్ వచ్చిందని చెబుతాడు. అయితే డాక్టర్ ఆయన కండిషన్ గురించి ఇప్పుడే మేము ఏమి చెప్పలేము అంటారు. ఇక మీనా సత్యంను చూడాలని హాస్పిటల్ కు వస్తుంది. అక్కడ ఒక్కొక్కరు ఒక్కో మాట అంటారు. అక్కడ లోపలికి వెళ్లనివ్వకుండా ప్రభావతి అడ్డు పడి వెళ్లగొడుతుంది. ఇక సీనియర్ డాక్టర్ వచ్చి సత్యం కు పరీక్షలు చేసి చెక్ చేస్తాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. సత్యం కు సీనియర్ డాక్టర్ పలు పరీక్షలు చేసి అతని కండిషన్ను చెక్ చేస్తాడు . అతనికి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్తాడు. గుండెకు రక్తం సరఫరా చేసే రెండు నాళాలు బ్లాక్ అయ్యాయి అని ప్రస్తుతం అయితే ఒక నాలం అలా స్లోగా వెళుతుందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పేసి చెప్తారు . ఈ ఆపరేషన్ చేయాలంటే మొత్తం నాలుగు లక్షల ఒకేసారి కట్టాలి అప్పుడే చేస్తామని డాక్టర్ చెప్తాడు. నాలుగు లక్షల అంటే మాటలు కాదు అని అందరూ మాట్లాడుకుంటారు. డాక్టర్ చెప్పిన మాటలు విని ప్రభావతి ఎమోషనల్ అవుతుంది. నాలుగు లక్షల అంటే మాటలు కాదు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఏడుస్తుంది. ముగ్గురు కొడుకులున్నా కనీసం ఒక్కరు కూడా ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోతున్నారని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మీనాక్షి రంగా వస్తారు. ఇలా జరిగింది ప్రభావతిని మీనాక్షి ఓదారుస్తుంది. నాలుగు లక్షల అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావ్ రా బాలు అని రంగ అంటారు. ఇక మీనాక్షి చీటీ డబ్బులు కూడా పాడేసుకున్నారని చెబుతుంది. ఇక డబ్బుల కోసం అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు.
రోహిణి మనోజ్ ని పక్కన తీసుకెళ్లి , మీ ఆఫీసులో లోన్ అడగొచ్చు కదా అనేసి అంటుంది. మా ఆఫీసులోనూ ఇప్పుడు అప్లై చేసుకుంటే ఎప్పటికో వస్తుంది దాని గురించి నమ్మకాలు పెట్టుకోకూడదు .ఇప్పుడు అర్జెంట్ కదా అని మనోజ్ అంటాడు. ముగ్గురు కొడుకులు ఉండి కూడా ఒక్కరు కూడా ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోతున్నారనేసి రోహిణి ఫీల్ అవుతుంది.. ఇక అప్పుడు ప్రభావతి మీనాక్షి అక్కడికి వస్తారు . రోహిణి ఇప్పుడు మీ నాన్న ఒక్కరే దారి మీ నాన్నని డబ్బులు అడగమ్మా అనేసి ప్రభావతి అంటుంది. కానీ రోహిణి మాత్రం మా నాన్న వేరే కంట్రీ కి వెళ్లారు అక్కడ ఫోన్లు పనిచేయట్లేదు అత్తయ్య అనేసి చెప్తుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో అడగమ్మా ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కడితే ప్రభావతి రోహిణి తో అంటుంది. కానీ రోహిణి మాత్రం ఇప్పుడు కుదరలేదు అత్తయ్య ఉంటే నేను ఎందుకు చూడను అనేసి అంటుంది. ఇక మనోజ్ పార్లర్ ని తాకట్టు పెడదామనేసి అంటాడు. అది వేరే వాళ్ళ బిల్డింగ్ లో ఉంది మన బిల్డింగ్ లో కాదు కదా దానికి లోన్ అప్లై కాదు అనేసి అంటుంది.
బాలు ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వస్తాడు. అంతా అబద్ధం మోసం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు అంత డ్రామా అనేసి ఫోన్లో మాట్లాడుతాడు. అప్పుడు మీనాక్షి అరే పక్కకెళ్ళి మాట్లాడుకోరా నువ్వు అక్కడ అంటున్నావో ఇక్కడ అంటున్నావో తెలియట్లేదు అనేసి అంటుంది. ఉన్నాయి కదా అత్తయ్య వాటిని పెట్టి డబ్బులు తీసుకొని వద్దాం అనేసి రోహిణి అంటుంది. అవును ఆ పత్రాలు పెట్టి డబ్బులు తెచ్చుకుందాం ఆయన లేని ఇల్లు అవసరం లేదు . వెంటనే బాలుని పంపించి డబ్బులు తీసుకురమ్మని ప్రభావతి చెప్తుంది. మామయ్యకు బాగోలేదు అన్న విషయం తెలుసుకొని గుడికి వెళ్ళిన మీనా అక్కడ అంగప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. ఇల్లంతా వెతుకుతాడు మీనాకు ఫోన్ చేస్తే మీనా లిఫ్ట్ చేయదు .దానితో తిరిగి మళ్ళీ హాస్పిటల్ కి వస్తాడు. ప్రభావతి నీ పెళ్ళాం ఎక్కడ పెట్టిందో అడుగు అనేసి అంటుంది . అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. . రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.. మీనాను బాలు తీసుకొని వస్తాడా? లేక మీనానే డబ్బులను ఆరెంజ్ చేస్తుందా? రేపటి ఎపిసోడ్ లో మీనా బాలు కలిసిపోతారా? అనేది చూడాలి..