Gundeninda GudiGantalu Today episode November 1st : నిన్నటి ఎపిసోడ్లో.. ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి డబ్బులను తీసుకురావాలని బాలు వెళ్తాడు. సాయంత్రం కల్లా 4 లక్షలు డబ్బులు తీసుకురావాలంటే ఎలా అని ఆలోచిస్తారు.. ప్రభావతి ఏడుస్తుంది. డబ్బు కోసం ప్రభావతి అందరిని అడుగుతుంది. కానీ ఎవరూ సాయం చేయడానికి ముందుకు రారు. ఇంటి డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తానని బాలు ఇంటికి వెళతాడు. కానీ ఇంటి డాక్యుమెంట్స్ కనిపించవు. కోపంగా హాస్పిటల్‌కు వస్తాడు. ఇంటి పత్రాలను మనోజ్ దొంగతనం చేశాడని బాలు అనుమానపడతాడు. అతడిని నిలదీస్తాడు. మీనా కోసం బాలు వెళ్లి వెతుకుతాడు. కానీ మీనా కనిపించదు. దాంతో మీనా మీద కోపంగా ఉంటాడు. ఇక కారును అమ్మను అమ్మాలని అనుకుంటాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు డబ్బుల కోసం అన్ని చోట్ల వెతుకుతాడు. సేటు దగ్గరకు వెళ్తే అవమానిస్తాడు. డబ్బులు లేవని అంటాడు. ఇక బాలుకు తన కారును కొనాలని ఒక అతను వచ్చిన విషయానికి కారు షెడ్ ఓనర్ చెబుతాడు. దానికి సంతోషపడిన బాలు అక్కడికి వెళ్తాడు. ఇక ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకోవాలని రవి మౌనికకు ఫోన్ చేస్తాడు. పోలీస్ స్టేషన్‌లో నన్ను చూసి నాన్న ముఖం తిప్పుకున్న క్షణం నుంచే నేను ఎందుకు బతికి ఉన్నానా అనిపిస్తుందని, నాన్నకు నాపై కొంచెం కూడా కోపం తగ్గలేదా అని మౌనికను అడుగుతాడు రవి. నాన్నకు ఇప్పుడు నీతో మాట్లాడాలని ఉన్నా…ఆయన మాట్లాడలేరని, హార్ట్ ఎటాక్ వచ్చిందనే అసలు నిజం రవికి చెబుతుంది మౌనిక. నాన్నకు స్టంట్ వేయాలని డాక్టర్లు చెప్పారని, డబ్బుల కోసం బాలు, మనోజ్ ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అడ్జెస్ట్ కావడం లేదని మౌనిక చెబుతుంది.. నాన్నను నేను వెంటనే చూడాలని బైక్ కీస్ కోసం వెతుకుతాడు. అది కనిపించదు. శృతిని పిలుస్తాడు. జరిగిన విషయాన్ని చెబుతాడు.. రవిని ఆపి తన దగ్గర రెండు లక్షలు ఉన్నాయని, హాస్పిటల్ ఖర్చులకు ఈ డబ్బును వాడమని శృతి చెక్ ఇస్తుంది. అవసరమైతే ఇంకా డబ్బు పంపిస్తానని రవితో చెబుతుంది..
ఇక బాలు తన కారును చూసుకొని మురిసిపోతాడు.. నువ్వు మీనా ఒకటే మధ్యలోనే నా జీవితంలోంచి వెళ్లిపోయరని అనుకుంటాడు. కొత్త కారును ఎందుకు అమ్ముతున్నావని బాలును అడుగుతాడు మెకానిక్. కారు, కట్టుకున్న పెళ్లాం రెండు ఒకటే.. మనకు బాకీ ఉంటే మనతోనే ఉంటారు.. లేదంటే మధ్యలోనే జారిపోతారని మీనాపై తనకున్న కోపాన్ని బయటపెడతాడు బాలు.. నాకు జీవితాన్ని ఇచ్చిన నాన్న కోసం కారును అమ్ముతున్నా అని అంటాడు. తండ్రికి సాయంత్రం లోగా హార్ట్ ఆపరేషన్ చేయాలని అన్నారని, ఆ డబ్బుల కోసమే కారు అమ్మాల్సివచ్చిందని చెబుతాడు. అతడు మూడు లక్షలు ఇవ్వగానే దేవుడిలా వచ్చి డబ్బులు ఇచ్చారని కొన్న వ్యక్తితో అంటాడు బాలు. కన్న తండ్రి కోసం బాలు పడుతోన్న ఆరాటం చూసి కారు కొన్న వ్యక్తి ఫిదా అవుతాడు. మెకానిక్ కూడా తనకు కమీషన్ అవసరం లేదని, ముందు ట్రీట్‌మెంట్ సంగతి చూడు అని చెబుతాడు. బాలు కోసం హాస్పిటల్ లో అందరు వెయిట్ చేస్తుంటారు.
అప్పుడే డాక్టర్ వచ్చి ఆపరేషన్ కు డబ్బులు ఆరెంజ్ చేసారా.. ఈ డాక్టర్ సాయంత్రం వరకే ఉంటాడు ఆయన వెళ్లి పోతే మీరు వేరే హాస్పిటల్ కు వెళ్ళాలి అంటాడు. మనోజ్ అదే పనిలో ఉన్నాము అని చెబుతాడు. అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. మూడు లక్షలు తెచ్చానని అంటాడు. ఇంత డబ్బు ఎక్కడినుంచి తెచ్చావని బాలుపై మనోజ్ అనుమానం వ్యక్తంచేస్తాడు. మీ మావ మలేషియా నుంచి పంపించాడని బాలు సెటైర్‌వేస్తాడు. తన కారును అమ్మేసినట్లు అసలు నిజం బయటపెడతాడు. ఈ మూడు లక్షలు సరిపోవని, ఇంకా కావాలని మనోజ్ అంటాడు. నా తల తాకట్టు పెట్టిన ఇంకో దమ్మిడి పుట్టేలా లేదని బాలు కోపంగా సమాధానమిస్తాడు..
ఇంటి పత్రాలు మీనాను ఎత్తుకెళ్లి ఉంటుందని ప్రభావతి అంటుంది. మన సంతకాలు లేకుండా ఇంటి డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్లి మీనా ఏం చేస్తుందని బాలు అంటాడు. రవి కంగారుగా హాస్పిటల్‌లోకి వస్తాడు.. ఇంకా ఏం చూడటానికి వచ్చావు.. మీ నాన్నను పోలీస్ స్టేషన్‌లో నిలబెట్టి పరువు పోయేలా చేశావు.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చావు.. ఇంకా ఆయనకు ఏం జరగాలని కోరుకుంటున్నావని రవిపై ప్రభావతి కోపడుతుంది. ఇక బాలు వచ్చింది ఎవరు రా నువ్వు అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో రవీతో బాలు గొడవ పడి బయటకు పంపిస్తాడు. నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆశ ఉన్నా ఇక్కడి నుంచి వెళ్లిపో అని రవిని నెట్టేస్తాడు బాలు. నేను మీలాగే ఆయనకు కొడుకునే…ఆయన్ని చూడకుండా నన్ను ఎందుకు ఆపుతున్నావని బాలుకు ఎదురుతిరుగుతాడు రవి. అతడి మాటలతో బాలు కోపం పట్టలేకపోతాడు. రవిని కొట్టడానికి వెళతాడు.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..