EPAPER

Brahmamudi Serial Today September 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కోమాలోంచి బయటకు వచ్చిన అపర్ణ – తల్లి చేయి విదిలించుకున్న రాజ్‌

Brahmamudi Serial Today September 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కోమాలోంచి బయటకు వచ్చిన అపర్ణ – తల్లి చేయి విదిలించుకున్న రాజ్‌

Brahmamudi serial today Episode : రాజ్‌ నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా ఆ పిచ్చిది నిన్ను భరించింది. కానీ కావ్య తెలియకుండా ఒక్క పొరపాటు చేసిందని తనను ఇంతలా బాధపెడతావా? తనకై తాను ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేస్తావా? తాను వెళ్లిపోతుంటే కనీసం ఆపకుండా చలనం లేని వాడిలా నిలబడిపోయవెందుకు అంటూ ఇందిరాదేవి రాజ్‌ను అడుగుతుంది. మీరు పంతాలు, పట్టింపులకు పోయి మమ్మల్ని బాధపెడుతున్నారు. ఈ ఒక్కసారికి కావ్యను క్షమించి ఇంటికి తీసుకురా రాజ్‌ అంటుంది ఇందిరాదేవి. ఇందిరాదేవి మాటలను లెక్క చేయని రాజ్‌ తాను వెళ్లి తీసుకురావడం ఇంపాజిబుల్‌ అంటాడు. తాను వెళ్లకపోయి ఉంటే నేనే వెళ్లగొట్టేవాడినని ఆ వ్యక్తి నిర్లక్ష్యం మా అమ్మకు శాపంగా మారిందని ఇప్పుడు మా అమ్మ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. దానికి బాధ్యులెవరు అంటూ రాజ్‌ ప్రశ్నిస్తాడు. ఇప్పుడు తనంతట తానుగా ఇంటికి వచ్చినా నేను మళ్లీ వెళ్లగొడతానని రాజ్‌ కరాకండిగా చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ఇందిరాదేవి షాకింగ్‌ గా చూస్తూ ఉండిపోతుంది.


కావ్యను ఓదార్చిన స్వప్న

మరోవైపు దిగాలుగా ఇంటి మెట్ల మీద కూర్చుని కావ్య బాధపడుతుంది. ఇంతలో అక్కడికి అప్పు వస్తుంది. కావ్య ఏడవడం చూసి నవ్వుకుంటుంది. అక్కా నువ్వు ఏడవటం ఏంటి? నువ్వు ఏడ్వటం మొదటిసారి చూస్తున్నాను అక్కా అంటూ కావ్యను ఓదారుస్తుంది అప్పు. అయినా అక్కడ అంత రాధాంతం జరుగుతుంటే నువ్వు మౌనంగా ఎందుకు వచ్చావని అడుగుతుంది. దీంతో ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అవుతుంటే ఇక ప్రశ్నించడమే వృథా అనుకుని అక్కడ ఉండలేక వచ్చేశాను అని కావ్య చెప్తుంది. అయితే ఇదంతా మా వల్లే జరిగింది. మేము పెళ్లి చేసుకోవడం వల్లే జరిగింది అక్కా అని అప్పు అంటుంది. అదేం లేదు అప్పు దీనికి కారణం మా ఆయనే.. ఆయనకు అసలు నా మీద ప్రేమే లేదు. పెళ్లికి ముందు ప్రేమ లేకపోయినా పర్వాలేదు కానీ పెళ్లై ఇన్ని రోజులైనా ఇంకా ప్రేమ లేకపోతే ఎలా? అసలు ఆయన మనసులో నాకు స్థానమే లేదు. అందుకే అక్కడే ఉండి అవమానాలు పడలేక వచ్చేశాను అంటుంది కావ్య. ఇక నా బతుకు నాదే.. ఆయన బతుకు ఆయనదే అంటూ నిట్టూరుస్తుంది కావ్య.


కోమాలోంచి బయటకు వచ్చిన అపర్ణ

మరోవైపు హాస్పిటల్‌ ఐసీయూలో ఉన్న అపర్ణ దగ్గర సుభాష్‌ కూర్చుని బాధపడుతుంటాడు. ఇంట్లో ఏవేవో గొడవలు జరుగుతున్నాయి. నీకేమో ఇలా అయింది. అక్కడేమో కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇంట్లో పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో ఏమో.. అసలు మన ఇల్లే ఒక నరకంటా మారిపోయింది అంటూ బాధపడుతుండగానే అపర్ణ కొద్దిగా కదిలినట్లు అనిపించడంతో సుభాష్‌ తీక్షణంగా చూస్తాడు. నిజంగానే అపర్ణ కదులుతుంది అనుకుని గట్టిగా డాక్టర్‌‌ ను పిలుస్తాడు. కట్‌ చేస్తే ఐసీయూలో అపర్ణ కోమాలోంచి బయటకు వచ్చి ఉంటుంది. అందరూ అపర్ణ చుట్టూ నిలబడి ఉంటారు. అందరినీ చూసిన అపర్ణ కావ్య లేదని గమనిస్తుంది. ఇందిరాదేవి ఎమోషనల్‌ గా ఫీలవుతూ.. ఆ దేవుడే నిన్ను మళ్లీ బతికించాడు అపర్ణ మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నిన్ను మళ్లీ మాకు ఇచ్చాడు అని సంతోషంగా చెప్తుంది.

Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ తో మిస్సమ్మ రొమాన్స్‌ – తాను ఆత్మను అని మిస్సమ్మకు చెప్పిన అరుంధతి

కావ్య గురించి ఆరా తీసిన అపర్ణ

అపర్ణ మాత్రం కావ్య కోసం చూస్తుంటుంది. కావ్య కనిపించకపోయేసరికి డల్‌గా చూస్తుంది. ఇంతలో రాజ్ ఏంటీ మమ్మీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా..? ఎందుకు అలా చూస్తున్నావు అని అడగ్గానే అపర్ణ తన కోడలు కావ్య కనిపించడం లేదేంటని ఇంతకీ కావ్య ఎక్కడికి వెళ్లిందని అడుగుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో సిస్టర్‌ వచ్చి ఆమెకు ఇప్పుడే స్పృహ వచ్చిందని మీరు ఇంతమంది ఇక్కడ ఉంటే ఇన్ఫెక్షన్‌ వస్తుందని అందరూ బయటకు వెళ్లండని చెప్తుంది. అందరూ బయటకు వెళ్లబోతుంటే అపర్ణ రాజ్‌ చేయి పట్టుకుని నా కోడలు కావ్య ఎక్కడుందిరా అని అడుగుతుంది. వెంటనే అపర్ణ చేయి విదిలించుకున్న రాజ్‌ మమ్మీ నిన్ను ఎప్పుడు డిశ్చార్జ్‌ చేస్తారో కనుక్కుని వస్తాను అని బయటకు వెళ్లిపోతాడు.

అపర్ణను గాజుబొమ్మలా చూసుకోవాలన్న డాక్టర్‌

డాక్టర్‌ దగ్గరకు వెళ్లిన రాజ్‌ కు డాక్టర్‌ జాగ్రత్తలు చెప్తుంది. చాలా కష్టపడి ఆమెను బతికించామని మరోసారి ఇలాంటి పరిస్థితి వస్తే ఆమె బతకడం కష్టం అని చెప్తుంది. ఇప్పటి నుంచి ఆమెను మీరు గాజు బొమ్మలా చూసుకోవాలని ఆమెకు ఎలాంటి షాకింగ్‌ న్యూస్‌ చెప్పడం కానీ ఆమె మనసుకు కష్టం కలిగించే విషయాలు చెప్పడం కానీ చేయోద్దని చెప్తుంది. మెడిసిన్స్‌ ఇచ్చి వాటిని ఎలా వాడాలో ఎ టైంలో వాడాలో అన్ని విషయాలు చెప్తుంది. డాక్టర్‌ .

కావ్యకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన స్వప్న

మరోవైపు కావ్య, స్వప్నకు ఫోన్‌ చేసి అపర్ణ గురించి వాకబు చేస్తుంది. అత్తయ్యకు ఎలా ఉందని అడుగుతుంది. దీంతో స్వప్న బాగానే ఉందని ఇంతక ముందే కోమాలోంచి బయటకు వచ్చిందని అందరూ హ్యాపీగా ఉన్నారని ఆంటీ ఇంటికి వచ్చి నీ గురించి తెలిశాక అందరికీ వాయిస్తుంది అని స్వప్న చెప్పగానే కావ్య సంతోషంగా ఆనందబాష్పాలు రాలుస్తుంది. వెంటనే తన అమ్మా నాన్నాల దగ్గరకు వెళ్లి అపర్ణ కోమాలోంచి బయటకు వచ్చిందని చెప్తుంది. దీంతో కనకం, మూర్తి హ్యాపీగా ఫీలవుతారు. నీ మీద ఒక నింద పడకుండా ఆ దేవుడే నిన్ను రక్షించాడని అంటారు. దీంతో ఇక నేను కూడా నా జీవితం గురించి ఆలోచించుకోవాలని ఏదైనా జాబ్‌ చూసుకోవాలని కావ్య చెప్తుంది. కావ్య మాటలకు కనకం, మూర్తి షాక్‌ అవుతారు. తల్లికి బిడ్డ బరువు అవుతుందా? అమ్మా నువ్వు జాబ్‌ చేయడం ఏంటని వద్దని వారిస్తారు. అయితే జాబ్‌ చేస్తేనే నాకు మర్యాదగా ఉంటుందని కావ్య చెప్పడంతో మూర్తి సరే అంటాడు. తర్వాత కావ్య గురించి కనకం, మూర్తి బాధపడతారు. అన్నింటికి కాలమే సమాధానం చెప్తుందని అనుకుంటారు.

ఇంట్లో వాళ్లకు షాక్‌ ఇచ్చిన అపర్ణ

తర్వాత ఇంటికి వచ్చిన అపర్ణకు స్వప్న హారతి ఇవ్వడానికి వెళ్తుంది. దీంతో స్వప్న ను అపర్ణ ఆపుతుంది. ఎందుకు నువ్వు హారతి ఇస్తున్నావని అడుగుతుంది. దీంతో హారతి ఇవ్వడం మంచిదే కదా అపర్ణ అని ఇందిరాదేవి అంటుంది. అయితే హారతి ఇవ్వడం మంచిదే అత్తయ్యా.. కానీ ఎప్పుడైనా ఇలాంటివి కావ్య చేస్తుంది కదా? ఇప్పుడు స్వప్న చేయడం ఏంటి? ఇంతకీ కావ్య ఎక్కడ? అసలు తాను కనిపించడం లేదు. కావ్యకు ఏమైంది. తనకు ఏదైనా ప్రమాదం జరిగిందా? మీరెవరు చెప్పడం లేదేంటి? నేను కావ్య గురించి అడిగినప్పుడల్లా మాట దాటేస్తున్నారేంటి? అని అపర్ణ అడగ్గానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ ముగుస్తుంది.

 

 

Related News

Gundeninda Gudigantalu Today Episode: ప్రభావతిని ఎదురించిన మీనా.. అడ్డంగా దొరికిన రోహిణి.. శృతి పెళ్లి డేట్ ఫిక్స్..

Satyabhama Serial Today September 19th: క్రిష్ ను కాపాడుకున్న సత్య.. నిజం తెలుసుకున్న మహదేవయ్య..

Trinayani Serial Today Episode: గాజులు దొంగిలించిన వల్లభ – తిలొత్తమ్మను ఓ ఆటాడుకున్న హాసిని

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరికి ధైర్యం చెప్పిన అమర్‌ – గుప్తకు హెల్ఫ్‌ చేసిన అరుంధతి

Brahmamudi Serial Today Episode: రాజ్‌ కు జీతం ఇస్తానన్న కావ్య – రుద్రాణిని రాయబారానికి పంపాలన్న స్వప్న

Kirrak Couples Promo: భార్యను మోయలేకపోయిన ఆదిరెడ్డి, కంగారులో పెదవి కొరికిన షరీఫ్, ఈవారం ‘క్రిర్రాక్ కఫుల్స్‘ ప్రోమో అదుర్స్ అంతే..

Nindu Noorella Saavasam Serial Today September 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు ఘోర పూజలు – ఎలాగైనా కాపాడతానన్న గుప్త

Big Stories

×