EPAPER

Brahmamudi Serial Today October 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్:   ఆఫీసు నుంచి కావ్యను గెంటివేయించబోయిన రాజ్‌ – అయోమయంలో పడిపోయిన కనకం  

Brahmamudi Serial Today October 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్:   ఆఫీసు నుంచి కావ్యను గెంటివేయించబోయిన రాజ్‌ – అయోమయంలో పడిపోయిన కనకం  

Brahmamudi serial today Episode: ఆటోలో కళ్యాణ్‌ పాట పాడటంతో శ్రద్దగా విన్న ప్రొడ్యూసర్‌ ఆటో దిగగానే చాలా బాగా పాడావని  నా సినిమాలో పాట ఉండాలని కళ్యాణ్‌ చేతిలో డబ్బులు పెట్టి రైటర్‌గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈ అబ్బాయి పాడిన పాట మన సినిమాలో ఉండాలి అని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు. రైటర్‌ లక్ష్మికాంత్‌ కూడా చాలా బాగా పాడావని కళ్యాణ్‌ చేతిలో డబ్బులు తీసుకుని కొన్ని 5 వేలు మాత్రమే కళ్యాణ్‌కు ఇచ్చి నువ్వు ఇప్పుడు పాడిన పాట ఇంకా డెవలప్‌ చేసి తీసుకురా అని చెప్తాడు. ఆఫీసుకు రావాలా? సార్‌ అన కళ్యాన్‌ అడగ్గానే వద్దని ఫోన్‌లో టచ్‌లో ఉండమని చెప్పి నెంబర్‌ ఇచ్చి వెళ్లిపోతాడు.


ఆఫీసుకు వెళ్లిన రాజ్‌ తన చాంబర్‌లోకి వెళ్లగానే అక్కడ తన ఛైర్‌ లో ఆఫీసు బాయ్‌ కూర్చోవడం చూసి తిడతాడు. అసలు ఈ చైర్‌ విలువ తెలిసే కూర్చున్నావా? అంటూ ఈ సీట్లో కూర్చోవాలి అంటే ఒక అర్హత ఉండాలని.. క్లాస్‌ పీకుతాడు. ఆఫీస్‌ బాయ్‌ ఏదో చెప్పబోతుంటే రాజ్‌ అలాగే తిడుతూ ఇక్కణ్నుంచి వెళ్లిపో అటాడు. దీంతో బాయ్‌ సార్‌ ఇంతకు ముందు క్లీన్‌ చేస్తుంటే ఈ సీటు కింద పడిపోయింది. సరి చేశాను. కానీ ఏమైనా డ్యామేజ్‌ అయిందేమోనని చెక్‌ చేయడానికి కూర్చున్నాను అని చెప్పి బాయ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

రైటర్‌ ఇచ్చిన 5వేలు తీసుకుని ఇంటికి వెళ్తాడు కళ్యాణ్‌. అప్పు గట్టిగా పిలుస్తాడు. లోపలి నుంచి వచ్చిన అప్పు ఏంటి కూచి అంతలా అరుస్తున్నావు అంటుంది. ఏం జరిగిందో చెప్తే నువ్వు నాకంటే గట్టిగా అరుస్తావు పొట్టి అంటాడు కళ్యాణ్‌. అరుస్తానో కరుస్తానో ముందు ఏం జరిగిందో చెప్పు కూచి అంటుంది అప్పు. దీంతో వెంటనే తన జేబులోంచి ఐదు వేలు తీసి అప్పుకు ఇస్తాడు. ఇంత డబ్బు ఎక్కడిది అని అడుగుతుంది అప్పు. దీంతో జరిగిన విషయం మొత్తం చెప్తాడు కళ్యాణ్‌.


తన ఆటోలో సినిమా ప్రొడ్యూసర్‌, లిరిక్‌ రైటర్‌ లక్ష్మీకాంత్‌ గారు ఎక్కారని వాళ్లు నా పాట విని బాగుందని ఈ డబ్బులు ఇచ్చారు. నేను ఆయన్ని తన దగ్గర అసిస్టెంట్‌ గా పెట్టుకోమని అడిగానని తర్వాత చూద్దామన్నారని చెప్తాడు కళ్యాణ్‌. దీంతో అప్పు హ్యాపీగా కళ్యాణ్‌కు కంగ్రాట్స్‌ చెప్పి నువ్వు వెంటనే అసిస్టెంట్‌ గా జాయిన్‌ అవ్వు తర్వాత నీ టాలెంట్‌ చూసి నీకు పెద్ద పెద్ద సినిమా అవకాశాలు వస్తాయని ఏదేదో ఊహించుకుంటుంటే కళ్యాణ్‌ ఆపి పొట్టి అప్పుడే అంత దూరం ఊహించుకోకు ఆయన నన్ను ఇంకా ఆసిస్టెంట్‌గా జాయిన్‌ చేసుకోలేదు అంటూ ముందు నువ్వు నీ కోచింగ్  గురించి ఆలోచించు అంటాడు కళ్యాణ్‌.

ఇంట్లో దేవుడి దగ్గర  దీపం వెలిగించి మొక్కుతుంది కావ్య. దుగ్గిరాల వారి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన  స్వరాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌లో సీఈవోగా అడుగుపెట్టే మొదటి  రోజు ఇది.  కంపెనీ వైభవం కోల్పోకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అందరూ నామీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసాన్ని నేను ఏ పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. నన్ను ఆశీర్వదించు స్వామి  అని దేవుడిని వేడుకుని అక్కడి నుంచి హాల్లోకి వెళ్లి నాన్నా నన్ను ఆశీర్వదించండి అని కృష్ణమూర్తి కాళ్లు మొక్కుతుంది. పక్కనే ఉన్న కనకం నాక్కూడా కాళ్లున్నాయి అంటుంది.

నువ్వు ఏమని దీవిస్తావో నాకు తెలుసు మిసెస్‌ క్యాన్సర్‌ కనకం అంటూ వెటకారంగా మాట్లాడుతుంది కావ్య. అవునా అయితే నేను దీవించిందే జరగాలని కోరుకుంటున్నాను మిసెస్‌ కావ్య దుగ్గిరాల అంటూ సమాధానం ఇస్తుంది కనకం. దీంతో కావ్య ఎమోషనల్‌ గా ఇందులో తమరి హస్తం కూడా ఉందని నాకు అర్థం అయింది. కానీ నీ పప్పులు ఉండకవు. నేను ఆఫీసుకు వెళ్లేది ఆయనతో కలిసిపోవాలని మళ్లీ ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టాలని ఆశతో కాదు. నా వల్ల కంపెనీకి నష్టం జరిగింది. నా మీద నింద పడింది. వాటిని పూడ్చాలని వెళ్తున్నాను అని చెప్తూ.. నాన్నా నేను వెళ్లి వస్తాను అంటుంది.

అయితే నాకు చెవులు ఉన్నాయి అంటుంది కనకం. దీంతో అమ్మో ఆఫీసులో మొదటి రోజు అడుగుపెడుతున్నాను..  నువ్వు క్షేమంగా వెళ్లి లాభంగా రా అంటావు. నాకు జరిగిన నష్టం ఈ జన్మలో లాభంగా మారదు అని బాధగా వెళ్లిపోతుంది కావ్య. కృష్ణమూర్తి కోపంగా ఇందులో నీ హస్తం కూడా ఉందని అంటుంది కావ్య మళ్లీ ఏం రోగం తెచ్చుకున్నావే అని నిలదీస్తాడు. అయ్యోయ్యో ఏం లేదండి అని కనకం చెప్పగానే ఏదైనా ఉందని తెలియాలి ఈసారి నీకు బొమ్మలా రంగేలేసి మార్కెట్‌ లో పెట్టి అమ్మేస్తాను అంటూ తిడతాడు మూర్తి.

ఆఫీసుకు వెళ్తున్న రాజ్ పనిమనిషి పిలిచి టిఫిన్‌ రెడీ చేశావా అని అడుగుతాడు. కాఫీ తీసుకుని హాల్లోకి వచ్చి పనిమనిషి నేను కావ్యమ్మలా అంత స్పీడు కాదు బాబు అంటుంది. దీంతో రాజ్ నువ్వు ఇంకొకరితో పోలిక పెట్టుకోవద్దని ఆమె చేతిలో కాఫీ తాగుతాడు. చీ కాఫీ ఏంటి ఇలా ఉందని అడుగుతాడు. అది పెద్దమ్మ గారికి తీసుకొచ్చానని చెప్తుంది. అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు కలిసి కావ్య గురించి చెప్పబోతుంటే రాజ్‌ వినకుండా అక్కడి నుంచి ఆఫీసుకు వెళ్లిపోతాడు.

ఆఫీసుకు వెళ్లిన రాజ్ తన చాంబర్‌లో ఉన్న కావ్యను చూసి షాక్ అవుతాడు. మీ అమ్మలాగా నీకు ఉత్తితి పిచ్చి పట్టిదా వచ్చి నా చాంబర్‌ లో కూర్చున్నావు అంటాడు. దీంతో కావ్య.. బాస్‌ క్యాబిన్‌ లోకి రావడానికి మే ఐ కమిన్‌ మేడం అని అడగాలి. తెలియదా? మిస్టర్‌ మేనేజర్‌ అంటుంది. దీంతో రాజ్‌ కోపంగా మేనేజరా.. నన్నే లిమిట్స్‌ లో ఉండమంటావా? ఉండవే నిన్ను సెక్యూరిటీతో గెంటిస్తాను.. అంటూ బయటకు వెళ్లిన రాజ్‌ సెక్యూరిటీని పిలిచి ఎవరిబడితే వాళ్లను ఆఫీసులోకి ఎందుకు రానిస్తున్నావు అని అడుగుతాడు.

ఇంతలో కావ్య రాగానే సెక్యూరిటీ కావ్యకు నమస్తే చెప్తాడు. కావ్య తన అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను రాజ్‌కు ఇస్తుంది. నన్ను ఈ కంపెనీ సీఈవోగా తాతయ్యే అపాయింట్‌ చేశారని చెప్తుంది. లెటర్‌ చదువుకున్న రాజ్‌ గట్టిగా తాతయ్యా.. అని అరుస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

GundeNinda GudiGantalu Today Episode : మీనాను బయటకు వెళ్లమని చెప్పిన తల్లి.. బాలుతో చనిపోతానని చెప్పిన మీనా..

Satyabhama Today Episode : కొడుకును మహాదేవయ్య దగ్గరకు చేర్చిన చక్రవర్తి.. సత్యను లైన్లో పెట్టే ప్రయత్నం..

Nindu Noorella Saavasam Serial Today October 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఘోరాకు వార్నింగ్‌ ఇచ్చిన గుప్త – అమర్‌కు తెలిసిపోయిన మను నిజస్వరూపం   

Trinayani Serial Today October 22nd: ‘త్రినయని’ సీరియల్‌: ఎవరి వల్ల గండమో చెప్పిన విశాలాక్షి – పేరు తెలుసుకుని షాకైన తిలొత్తమ్మ

Intinti Ramayanam Today Episode: అవనిని మరోసారి అడ్డంగా బుక్ చేసిన పల్లవి.. ఇంటికి తాగొచ్చిన భర్తను చూసి అవని షాక్ ..

GundeNinda GudiGantalu Today Episode : మీనాను గెంటేయమని చెప్పిన బాలు .. రవికోసం వెతుకుతున్న బాలు.. పుట్టింటికి చేరిన మీనా ..

Big Stories

×