EPAPER

IRCTC Super App: అన్ని రైల్వే సేవలు ఒకే చోట, ఇండియన్ రైల్వేస్ సూపర్ యాప్ వచ్చేస్తోంది!

IRCTC Super App: అన్ని రైల్వే సేవలు ఒకే చోట, ఇండియన్ రైల్వేస్ సూపర్ యాప్ వచ్చేస్తోంది!

Indian Railways ‘Super-App’: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కలిపించేందుకు ఎప్పటికప్పు ప్రయత్నిస్తూనే ఉంటుంది. రైల్వే సేవలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే సరికొత్త ‘సూపర్ యాప్’ను ప్రారంభించబోతున్నది. ఇండియన్ రైల్వేస్ కు సంబంధించిన అన్ని సేవలు ఒకే చోట పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ అప్లికేషన్ ద్వారా టికెట్ల బుకింగ్, ఫ్లాట్ ఫారమ్ టికెట్ల కొనుగోలు, రైలు షెడ్యూళ్లను తెలుసుకోవడం సహా అన్నీ రైల్వే సేవలను పొందవచ్చు.


తుది దశకు చేరుకున్న సూపర్ యాప్ తయారీ

భారతీయ రైల్వే సంస్థ తీసుకొస్తున్న ఈ సూపర్ యాప్ ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(CRIS) IRCTC  ప్రస్తుత సిస్టమ్‌ ను కలిపి ఒకటిగా తయారు చేస్తున్నారు. CRIS టిక్కెట్లు కొనుగోలు చేసే ప్రయాణీకుల మధ్య ఇంటర్‌ ఫేస్‌ గా IRCT ఇప్పటికీ పని చేస్తుంది. ఇకపై సూపర్ యాప్ లోనే IRCTCకు సంబంధించి అన్ని సదుపాయాలు ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు టిక్కెట్ లావాదేవీల కోసం IRCTC రైల్ కనెక్ట్, ఫుడ్ డెలివరీ కోసం IRCTC eCatering ఫుడ్ ఆన్ ట్రాక్, ఫీడ్‌ బ్యాక్ కోసం Rail Madad, అన్‌ రిజర్వ్‌డ్ టిక్కెట్ల కోసం UTS, రైలు ట్రాకింగ్ కోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ లాంటి వేర్వేరు అప్లికేషన్లు వినియోగిస్తున్నారు. లేదంటే ఆయా వెబ్ సైట్లలో ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సేవలన్నీ సూపర్ యాప్ లో పొందవచ్చు.


IRCTC రైల్ కనెక్ట్ కు 100 మిలియన్ల డౌన్‌లోడ్స్

ప్రస్తుతం IRCTC రైల్ కనెక్ట్ అప్లికేషన్ 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్లను కలిగి ఉంది. దేశ వ్యాప్తంగా రైల్వే ప్రయాణీకులు అత్యధికంగా ఉపయోగిస్తున్న రైల్వే అప్లికేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది. దీనిని రిజర్వు చేయబడిన టికెట్ బుకింగ్ కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇకపై ఈ సేవలు సూపర్ యాప్ లో కొనసాగనున్నాయి.

గత ఆర్థిక సంవత్సరంలో 453 మిలియన్ బుకింగ్‌లు

IRCTC 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 1,111.26 కోట్ల నికర లాభాన్ని,  రూ. 4,270.18 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. భారతీయ రైల్వే వార్షిక నివేదిక ప్రకారం, దాదాపు 453 మిలియన్ల రైలు టికెట్లు బుక్ అయ్యాయి. బుకింగ్‌లను ప్రాసెస్ చేసిన టిక్కెట్ల విక్రయాలు మొత్తం ఆదాయంలో 30.33 శాతం ఉన్నాయి. ప్లాట్‌ ఫారమ్ టిక్కెట్లు, సీజన్ పాస్ డౌన్‌లోడ్ చేసుకునే UTS యాప్ 10 మిలియన్లకు పైగా డౌన్‌ లోడ్లను అందుకుంది. మొత్తంగా త్వరలో లాంఛ్ కాబోయే సూపర్ యాప్ గొడుగు కిందికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రైల్వే యాప్స్ సేవలు రానున్నాయి. ప్రయాణీకులు ఈజీగా రైల్వే పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సూపర్ యాప్ కోసం CRIS ఇండియన్ రైల్వేస్ కార్యకలాపాలు, సేవల కోసం అవసరమైన సాఫ్ట్‌ వేర్ సిస్టమ్ లను అభివృద్ధి చేస్తున్నది.

Read Also: రైల్వే టిక్కెట్లు ఇన్ని రకాలా? ఒక్కోదాని మధ్య తేడా ఏంటి? వాటిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

Related News

Vande Bharat – Rajdhani: ఈ రైలు వచ్చిందంటే.. వందే భారత్, రాజధాని ఎక్స్‌ ప్రెస్ కూడా పక్కకి తప్పుకోవల్సిందే!

Bihar Man on Indian Railway: RAC టికెట్ వెయిటింగ్ 12 నుంచి 18కి జంప్, ప్రయాణీకుడు ఏం చేశాడంటే?

Indian Railway: ఇండియన్ రైల్వేస్ లో రెడ్, బ్లూ కోచ్‌లు, వీటిలో ఏ బోగీలు స్ట్రాంగ్? తేడా ఏమిటీ?

Hyderabad – Visakhapatnam: నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు.. ఈ రైలు ప్రత్యేకత ఇదే, ఎప్పటి నుంచంటే?

Indian Railways: మన దేశంలో అన్ని రైళ్లు ఉన్నాయా? భోలు ఏనుగు లోగో ప్రత్యేకత ఏమిటీ?

Big Stories

×