EPAPER

Indian Railways: మన దేశంలో అన్ని రైళ్లు ఉన్నాయా? భోలు ఏనుగు లోగో ప్రత్యేకత ఏమిటీ?

Indian Railways: మన దేశంలో అన్ని రైళ్లు ఉన్నాయా? భోలు ఏనుగు లోగో ప్రత్యేకత ఏమిటీ?

భారత్ లో రైల్వే వ్యవస్థ 165 సంవత్సరాల క్రితమే ఏర్పడింది. రోజు రోజుకూ అభివృద్ధి చెందుతూ ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు సైతం తన సేవలను విస్తరించింది. రోజూ సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల మంది ప్రయాణీలకును గమ్యస్థానాలకు చేర్చుతుంది. భారతీయ రవాణాకు వెన్నెముకగా మారిన ఇండియన్ రైల్వేస్ లోని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకతలు

భారతీయ రైల్వే వ్యవస్థ దేశ నలుమూలలను చుట్టి ఉంది. ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కాగా, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ.


భారత్ లో తొలిసారి 1853 ఏప్రిల్ 16న రైలు ప్రయాణం మొదలయ్యింది. తొలి రైలు బొంబాయి- థానే మధ్య కొనసాగింది.

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద రూట్ రిలే ఇంటర్‌ లాకింగ్ సిస్టమ్‌ ను కలిగి ఉంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది.

భారతీయ రైల్వే వ్యవస్థ అత్యంత రద్దీ రైల్వే వ్యవస్థలలో ఒకటి. రోజుకు సుమారు 3 నుంచి 4 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతుంది.

న్యూ ఢిల్లీ- రాజస్థాన్‌లోని అల్వార్ మధ్య నడిచే ఫెయిరీ క్వీన్ మొత్తం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన స్టీమ్ ఇంజిన్‌ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఒడిశాలోని IB రైల్వే స్టేషన్ దేశంలోనే అతి చిన్న పేరున్న రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

భారతీయ రైల్వేల ట్రాక్‌ల పొడవు భూమి చుట్టూ సుమారు ఒకటిన్నర(1.5) సార్లు తిప్పే అవకాశం ఉంది.

భారతీయ రైల్వే ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రతి రోజూ సుమారు 11 వేలకు పైగా రైళ్లను నడుపుతున్నది.

ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ వెబ్‌సైట్ ప్రపంచంలోనే అత్యంత బిజీ వెబ్ సైట్లలో ఒకటి. ప్రతి నిమిషానికి సుమారు 12 లక్షల హిట్స్ అందుకుంటుంది.

భారతీయ రైళ్లలో ఇప్పుడు మరుగుదొడ్లు కామన్ గా కనిపిస్తాయి. కానీ, రైల్వే వ్యవస్థ ప్రారంభం అయ్యాక సుమారు 50 ఏండ్లకు రైళ్లలో మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.

భారతీయ రైల్వే వ్యవస్థలో 7,308 స్టేషన్లు, సుమారు లక్ష కిలో మీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి.

డార్జిలింగ్ టాయ్ రైలు ఇప్పటికీ 1881లో తయారు చేయబడిన ఆవిరి ఇంజిన్‌తో నడుస్తోంది.

భారతీయ రైల్వేస్ అధికారిక చిహ్నం భోలు ఏనుగు. దీని గురించి చాలా మందికి తెలియదు. భోలూ ది ట్రైన్ మేనేజర్ (ట్రైన్ గార్డ్) అనేది ఇండియన్ రైల్వేస్ అధికారిక చిహ్నంగా గుర్తించింది. ఇందులో ఒక చేతిలో ఆకుపచ్చ లెన్స్‌ తో సిగ్నల్ ల్యాంప్‌ ను పట్టుకున్న ఏనుగును కార్టూన్‌ ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ 150వ వార్షికోత్సవ సందర్భంగా భోలు ఏనుగు చిహ్నాన్ని 2002 ఏప్రిల్ 16న బెంగళూరులో ఆవిష్కరించారు.

Read Also: దేశంలో రైల్వే లైన్ లేని ఏకైక రాష్ట్రం ఇదే.. కారణాలు ఏంటో తెలుసా?

Related News

Hyderabad – Visakhapatnam: నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు.. ఈ రైలు ప్రత్యేకత ఇదే, ఎప్పటి నుంచంటే?

Big Stories

×