EPAPER

Bihar Man on Indian Railway: RAC టికెట్ వెయిటింగ్ 12 నుంచి 18కి జంప్, ప్రయాణీకుడు ఏం చేశాడంటే?

Bihar Man on Indian Railway: RAC టికెట్ వెయిటింగ్ 12 నుంచి 18కి జంప్, ప్రయాణీకుడు ఏం చేశాడంటే?

Indian Railway Ticket Booking: భారతీయ రైల్వేలో గత కొంత కాలంగా వింత వింత ఘటనలు జరుగుతున్నాయి. ఒకే రైళ్లో, ఒకే బోగీలో, ఒకే ప్రాంతానికి వెళ్తున్న ఇద్దరు ప్రయాణీకులు టికెట్ల ధరలు వేర్వేరుగా ఉండటం రీసెంట్ గా  వెలుగు చూసింది. తాజాగా మరో ఆసక్తిక విషయం బయటపడింది. సాధారణంగా టికెట్ బుక్ చేసుకున్న సమయంలో RAC టికెట్ వెయిటింగ్ లిస్టు ఎక్కువగా కనిపిస్తుంది. రైలు ప్రయాణ సమయానికి ఆ సంఖ్య తగ్గుతూ వస్తుంది. కానీ, ఓ ప్రయాణీకుడి విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు తక్కువ RAC టికెట్ వెయిటింగ్ ఉండి, ఫైనల్ ఛార్ట్ రెడీ అయ్యే సమయానికి ఆ సంఖ్య పెరగడంతో షాక్ అయ్యాడు.


12 నుంచి 18కి పెరిగిన RAC టికెట్ వెయిటింగ్ లిస్ట్

బీహార్ కు చెందిన జర్నలిస్ట్ హిమాన్షు ఝా తన కుటుంబంతో కలిసి ఛత్ పూజ జరుపుకునేందుకు తాజాగా న్యూఢిల్లీ నుంచి దర్భంగాకు టికెట్ బుక్ చేసుకున్నారు. కొద్ది వారాల ముందే టికెట్ బుక్ చేసుకోవడంతో RAC టికెట్ వెయిటింగ్ లిస్ట్ 124గా చూపించింది. నెమ్మదిగా ఆ సంఖ్య తగ్గుతూ 12కు చేరింది. ఫైనల్ ఛార్ట్ రెడీ అయిన తర్వాత ఆ సంఖ్య 18కి పెరగడంతో హిమాన్షు షాక్ అయ్యారు. RAC టికెట్ వెయిటింగ్ లిస్ట్ తగ్గాల్సింది పోయి, పెరగడం ఏంటని ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. “ఇండియన్ రైల్వేస్ లో ఏం జరుగుతోంది? అక్టోబరు 30న, RAC టికెట్ వెయిటింగ్ లిస్ట్31గా ఉంది. నిన్న ఆ సంఖ్య 12కు చేరింది. ఈ రోజు చార్ట్‌ ను సిద్ధం చేసినప్పుడు వెయిటింగ్ లిస్టు 18కి చేరింది. ఇదేం రిజర్వేషన్ సిస్టమ్?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, “ఛత్ పూజ సందర్భంగా ఓ బీహారీ ఇంటికి వెళ్లకపోతే ఏం జరుగుతుందో తెలుసా అశ్విని వైష్ణవ్ జీ?” అంటూ కేంద్ర రైల్వే మంత్రిని ప్రశ్నించారు. తన పోస్టుకు RAC టికెట్ వెయిటింగ్ లిస్ట్ స్క్రీన్ షార్ట్స్ ను జత చేశారు హిమాన్షు.


స్పందించిన రైల్వే సేవా

హిమాన్షు పోస్టుకు రైల్వేసేవా స్పందించింది. “సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. మీ ఫిర్యాదు రైల్‌ మద్దత్ లో నమోదు చేయడింది. ఫిర్యాదు నెంబర్ SMS ద్వారా మీ మొబైల్ నంబర్‌కు పంపబడింది” అని ఎక్స్ వేదికగా వెల్లడించింది.

మరోవైపు ఓ రైల్వే అధికారి ఈ విషయానికి సంబంధించి తనను సంప్రదించారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చెయ్యొచ్చని చెప్పారని హిమాన్షు తెలిపారు. తనకు సహకరించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: ఇండియన్ రైల్వేస్ లో రెడ్, బ్లూ కోచ్‌లు, వీటిలో ఏ బోగీలు స్ట్రాంగ్? తేడా ఏమిటీ?

Related News

Vande Bharat – Rajdhani: ఈ రైలు వచ్చిందంటే.. వందే భారత్, రాజధాని ఎక్స్‌ ప్రెస్ కూడా పక్కకి తప్పుకోవల్సిందే!

Indian Railway: ఇండియన్ రైల్వేస్ లో రెడ్, బ్లూ కోచ్‌లు, వీటిలో ఏ బోగీలు స్ట్రాంగ్? తేడా ఏమిటీ?

Hyderabad – Visakhapatnam: నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు.. ఈ రైలు ప్రత్యేకత ఇదే, ఎప్పటి నుంచంటే?

Indian Railways: మన దేశంలో అన్ని రైళ్లు ఉన్నాయా? భోలు ఏనుగు లోగో ప్రత్యేకత ఏమిటీ?

Big Stories

×