EPAPER

Scam Alert : ఈ పది నెంబర్ల నుంచి వచ్చిన ఫోన్లు ఎత్తారా.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీనే!

Scam Alert : సామాన్య ప్రజలను మోసం చేయడానకి సైబర్ దొంగలు కొత్త కొత్త దారులు ఉపయోగిస్తున్నారు. ఈ మోసాలు ఎక్కువగా ఒక ఫోన్ కాల్ రూపంలోనే మొదలవుతుంది. ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇటీవల ఈ సైబర్ మోసగాళ్లు ప్రజలను ఎలా దోచుకుంటున్నారనే అంశంపై ఒక నివేదిక తయారు చేసింది. ఇందులో ముఖ్యంగా పది ఫోన్ నెంబర్లు ఉన్నాయి.

Scam Alert : ఈ పది నెంబర్ల నుంచి వచ్చిన ఫోన్లు ఎత్తారా.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీనే!

Scam Alert : సామాన్య ప్రజలను మోసం చేయడానకి సైబర్ దొంగలు కొత్త కొత్త దారులు ఉపయోగిస్తున్నారు. ఈ మోసాలు ఎక్కువగా ఒక ఫోన్ కాల్ రూపంలోనే మొదలవుతుంది. ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇటీవల ఈ సైబర్ మోసగాళ్లు ప్రజలను ఎలా దోచుకుంటున్నారనే అంశంపై ఒక నివేదిక తయారు చేసింది. ఇందులో ముఖ్యంగా పది ఫోన్ నెంబర్లు ఉన్నాయి.


ఈ పది ఫోన్ నెంబర్లను చాలా వరకు కామన్‌గా సైబర్ దొంగలు ఉపయాగిస్తున్నారు. వీటి ద్వారా మీకు ఫోన్ వస్తే ఆ ఫోన్ కాల్ ఆన్సర్ చేయొద్దు, ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వద్దు అని ఆ నివేదికలో ఉంది. ఈ ఫోన్ నెంబర్ల ద్వారా ఫోన్ చేసి ఏదో ఒక లాభం కలుగుతుందని చెబుతూ.. మాటల్లో పెట్టి మీ బ్యాంక్ అకౌంట్‌ని సైబర్ దొంగలు ఖాళీ చేస్తారు.

ఇవే ఆ ఫోన్ నెంబర్లు :


1.(469)709-7630
మీకు ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ డెలివరీ అందకపోతే పై నెంబర్‌కు కాల్ చేయమని మెసేజ్ వస్తుంది. కాల్ చేసిన తరువాత మీ పేమెంట్ పూర్తి కాలేదు. మళ్లీ డబ్బులు చెల్లించమని లింక్ పంపిస్తారు. ముందు చేసిన పేమెంట్ మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయబడుతుందని నమ్మిస్తారు. మీరు డబ్బులు మళ్లీ చెల్లించారో అంతే సంగతులు.

2.(865)630-4266
పై నెంబర్ నుంచి కాల్ చేసే దొంగలు.. వెల్స్ ఫార్గో సంస్థలో మీ అకౌంట్‌ని టెంపరరీగా బ్లాక్ చేశాము. వెంటనే అన్‌లాక్ చేయడానికి ఒక నకిలీ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్‌కు కాల్ చేస్తే అవతలి వ్యక్తి మీ అకౌంట్ వివరాలు అడిగి.. అందులో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని ఖాళీ చేస్తాడు.

3.(805)637-7243
ఈ నెంబర్ నుంచి కాల్ చేసి.. మేము పోలీసుల డిపార్ట్‌మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం. నకిలీ వీసా కేసులో మీపై కేసు నమోదైంది అని భయపెడతారు. ఆ తరువాత పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయమంటారు.

4.(858)605-9622
ఈ నెంబర్ నుంచి కాల్ చేసే వారు మీ బ్యాంక్ అకౌంట్ టెంపరరీగా నిలిపేయ బడిందని చెప్పి.. మిమ్మల్ని భయపెడతారు.

5.(863)532-7969
ఈ నెంబర్ నుంచి కాల్ చేసే దొంగలు.. చాలా నిపుణులు. మీ డెబిట్ కార్డ్‌ని 24 గంటలపాటు బ్లాక్ చేసి.. అది సరిచేయాలంటే ఇంత డబ్బు చెల్లించమని అడుగుతారు.

6.(904)495-2599
ఈ నెంబర్ నుంచి కాల్ చేసే దొంగలు.. మీరు ఏటి అండ్ టి అనే రైఫెల్ తుపాకీ గెలుచుకున్నారు వెంటనే డెలివరీ చేస్తాం డబ్బులు చెల్లించమని అడుగుతారు.

7.(312)339-227
ఈ నెంబర్ నుంచి కాల్ చేసిన వారు మీ అధిక బరువు తగ్గించేందుకు మా వద్ద మంచి ప్రాడక్ట్‌లు ఉన్నాయి.. అని చెబుతూ పెద్ద మొత్తంలో అమ్మకాలు జరిపారు. కానీ అందులో నకిలో మందులు ఉంటాయని తేలింది.

8.(917)540-7996
ఈ నెంబర్ నుంచి కాల్ చేసే దొంగలు.. మీకు స్కీమ్ 6 లో విన్నర్‌గా నిలిచారని చెబుతూ.. వెంటనే మినిమమ్ చార్జీలు చెల్లించమని అడుగుతారు.

9.(347)437-1689
ఈ నెంబర్ నుంచి కాల్ చేసిన వారు పెద్ద పెద్ద స్కామ్‌లు చేస్తారు. అమెరికన్ డాలర్లు మీ అకౌంట్‌లో వేయాలి, మీకు లాటరీ తగిలింది.. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, వచ్చిన ఓటిపీని అడుగుతారు.

10.(301)307-4601 -USPS Delivery
ఈ నెంబర్ నుంచి కాల్ చేసి మీకు అమెరికా నుంచి పోస్టు రూపంలో ఖరీదైన బహుమతి వచ్చిందని. దాని డెలివరీ కోసం అయ్యే ఖర్చుని ముందుగా చెల్లించమని అడుగుతారు అని బాధితులు తెలిపారు.

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×