EPAPER

Ratan Tata : రతన్‌ టాటా.. ఓ వ్యక్తి కాదు.. బ్రాండ్‌..

Ratan Tata : రతన్‌ టాటా.. ఓ వ్యక్తి కాదు.. బ్రాండ్‌..

Ratan Tata : రతన్ టాటా.. 5 దశాబ్దాలబాటు టాటా గ్రూప్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1937 డిసెంబర్ 28న రతన్ జన్మించారు. 87వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఆయన జీవితం ఎలా సాగిందో తెల్సుకోవాల్సిందే. రెండు దశాబ్దాలపైగా టాటా సంస్థను నాయకుడిగా నడిపించారు. ఆ తర్వాత రతన్‌ టాటా.. సంస్థ బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకుని రూ.5 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను సైరస్ మిస్త్రీకి అప్పగించారు.


రూ.10,000 కోట్లగా ఉన్న టాటా గ్రూపు సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాల్లో రూ. 4.75 లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్లిన ఘనత రతన్ టాటాదే. ఆ సంస్థ కార్యకలాపాలను ఎల్లలు దాటించారు. అంతేకాదు దేశ పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధిలోనూ టాటా గ్రూప్ కీలక పాత్ర పోషించేలా చేశారు. సరైన నడవడికి, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం ఈ 4 లక్షణాలు ఆయనలో బలంగా ఉన్నాయి. అందుకే ఆయన గురించి తెలిసినవాళ్లు రతన్‌ను పుట్టుకతోనే నాయకుడని ప్రశంసిస్తూ ఉంటారు. అలసట, పని రేపు చేద్దాం అనే మాటలు ఆయన నోటరావు. ఎప్పుడూ టార్గెట్ పైనే గురి. పదేళ్లలో లక్ష కోట్ల రూపాయలతో టెట్లే టీ, కోరస్‌ స్టీల్‌, జేఎల్‌ఆర్‌ లాంటి 22 కంపెనీలను కొనుగోలు చేశారు. అలా టాటా సామ్రాజ్యాన్ని విస్తరించారు. రతన్‌ టాటా వ్యక్తి కాదు.. ఓ బ్రాండ్‌. సృజనాత్మకత, దార్శనికత ఉన్న వ్యక్తి.

కొన్నేళ్ల క్రితం ఓ కుటుంబం స్కూటరుపై వెళ్తుండగా రతన్ టాటా చూశారు. తండ్రి డ్రైవ్‌ చేస్తున్నాడు.. ముందు కొడుకు నిలబడ్డాడు. వెనక సీట్లో భార్య కూర్చుంది. ఆమె ఒడిలో ఓ చిన్నారి ఉంది. ఈ దృశ్యం చూశాక ఆయనలో కొత్త ఆలోచన వచ్చింది. మధ్యతరగతి ప్రజల కోసం మార్కెట్ లోకి కారు తీసుకురావాలనుకున్నారు. ఆ విషయాన్ని ప్రకటించగానే చాలామంది గేలి చేశారని గతంలో ఆయన చెప్పారు. ఈ కల నెరవేరదని.. చాలా మంది నిరుత్సాహపరిచారని వివరించారు. అయినా సరే ఆయన పట్టుదలతో తన కలల కారు మార్కెట్లోకి తెచ్చారు. అదే రూ.లక్ష కారు.. ‘నానో’.


రతన్‌కు విమానాలు, హెలికాప్టర్లు నడపడమంటే ఎంతో ఇష్టం. కార్లపైనా మక్కువ ఎక్కువే. ‘ఫెరారీ కాలిఫోర్నియా’కారు ఆయనకు బాగా ఇష్టం. ఇంకా మసరాటీ క్వాట్రోపోర్టే, క్యాడిలాక్‌ ఎక్స్‌ఎల్‌ఆర్‌, క్రిస్లర్‌ సెబ్రింగ్‌, ల్యాండ్‌రోవర్‌ ఫ్రీల్యాండర్‌, మెర్సిడెస్‌ 500ఎస్‌ఎల్‌, మెర్సిడెస్‌ ఎస్‌-కస్‌, ఇండిగో మెరీనా కార్లు వినియోగిస్తారు.

రతన్‌ టాటా జీవితంలో తొలి ఇన్నింగ్స్ కార్పొరేట్ లక్ష్యాలతో సాగితే.. రెండో ఇన్నింగ్స్‌లో సామాజిక సమస్యలే ప్రధాన అజెండా సాగుతోంది. గ్రామీణాభివృద్ధి, నీటి పొదుపు, శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందించడంపై దృష్టిపెట్టారు. ‘కార్పొరేట్‌’ శైలిలో టాటా ట్రస్టులను ముందుకు నడిపిస్తున్నారు. పియానో సాధన, పెంపుడు శునకాల పెంపకం ఆయనకు చాలా ఇష్టమైన వ్యాపకాలు. తన పెంపుడు కుక్కల కోసం ఇండిగో మెరీనా కారులోని వెనుక సీటు తీయించేశారు. అక్కడ పరుపు ఏర్పాటు చేశారు.

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×