Ponniyin Selvan 2 Twitter Review : స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా 2 పార్ట్స్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్ గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైంది. ఈ మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. దీంతో పొన్నియన్ సెల్వన్ -1 భారీ విజయం సాధించింది. ఇక సెకండ్ పార్ట్ తాజా విడుదలైంది.
పొన్నియన్ సెల్వన్ -2 ఫస్ట్ షో సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మూవీ చాలా బాగుందంటున్నారు. పార్ట్ 1లో కథనం స్లోగా సాగితే.. పార్ట్ 2లో మాత్రం స్పీడుందని అభిప్రాయపడుతున్నారు.
చిత్రంలో ఆర్ట్ డిజైన్ , పాటలు డీసెంట్‌గా ఉన్నాయని టాక్ వచ్చింది. స్క్రీన్‌ప్లే కూడా పార్ట్ 1 కంటే బాగుందని ట్విట్టర్ లో కామెంట్లు చేస్తున్నారు. మణిరత్నం డైరెక్షన్, రవివర్మ సినిమాటోగ్రఫీపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఫస్ట్ హాఫ్ బాగా ఆకట్టుకుందని టాక్. సెకండాఫ్ అదిరిపోయిందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. విజువల్స్, సీజీ వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్ని అంశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయని అంటున్నారు. క్లైమాక్స్ అదిరిపోయిందని చెబుతున్నారు. సినిమాలో వచ్చే యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. ఓవరాల్ పొన్నియన్ సెల్వన్ -2పై మంచి టాక్ నడుస్తోంది.
Movie is so entertaining !! First half is 🔥.. Second half got some lag but at the end looks great..
— TVK IT WING ( THALAPATHY VIJAY) (@venkyjohn67) April 28, 2023
Some Goosebumps scenes are there.. Great effort from the technicians and ARR did a great job in #PonniyanSelvan2..
Ratting 4/5#PonniyanSelvan2Review #PS2