EPAPER

petrol and diesel rates : లీటర్ పెట్రోల్, డీజిల్ రూ.70లకే.. రాష్ట్రాలు ఒప్పుకుంటే కేంద్రం రెడీ

petrol and diesel rates : లీటర్ పెట్రోల్, డీజిల్ రూ.70లకే.. రాష్ట్రాలు ఒప్పుకుంటే కేంద్రం రెడీ
petrol and diesel rates

petrol and diesel rates : ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధర 80 డాలర్లకు అటుఇటుగా ఉంది. అయినా, ఈ మార్కెట్‌తో సంబంధం లేకుండా రష్యా నుంచి దాదాపు 60 డాలర్లకే అతి చౌకగా క్రూడ్ కొంటోంది భారత్. అందులోనూ రవాణా ఛార్జీలు, ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా లేవు. దాదాపు ఏడాదిగా ప్రపంచంలో ఏ కంట్రీ తీసుకోనంత తక్కువ ధరకు క్రూడాయిల్ కొంటోంది ఇండియా. రష్యా ఇండియాకు ఇచ్చిన ఆఫర్‌ను బాగా ఉపయోగించుకుటోంది. ఈ లెక్కన ఇప్పటికే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాల్సి ఉంది. అయినప్పటికీ.. కేంద్రం ధరలు తగ్గించడానికి ముందుకు రావడం లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అప్పులు ఉన్నందున.. ఆ బాకీలు క్లియర్ చేసుకునేందుకే మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం లేదనేది కేంద్రం చెబుతున్న వర్షన్.


సరే.. ఈ వర్షన్‌ను వదిలేద్దాం. ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే మార్గం మరోటి ఉంది. అదే వన్ నేషన్-వన్ ట్యాక్స్. ఈ ఫార్ములాతో వచ్చిందే జీఎస్టీ. దేశంలో ఒక వస్తువు ధర ఎక్కడైనా ఒకేలా ఉండాలనే ఉద్దేశంతో జీఎస్టీ తీసుకొచ్చారు. కాని, పెట్రో ప్రాడక్ట్స్ మాత్రం మినహాయించారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం రెడీ అంటోంది. కానీ, రాష్ట్రాలే వ్యతిరేకిస్తున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున.. ప్రజా సంఘాలు, ఎన్జీవోలు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పట్టుబడుతున్నాయి. దీన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని కూడా హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో పెట్రో ప్రాడక్ట్స్‌ను జీఎస్టీలోకి తీసుకురావాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.

కేంద్రం రెడీ అంటోంది. కాని, రాష్ట్రాలే ససేమిరా అంటున్నాయి. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాలను, రాష్ట్రాలు అమ్మకపు పన్నులను విధించుకోవచ్చు. పెట్రో ఉత్పత్తులు, కేంద్ర రాష్ట్రాలకు ప్రధాన ఆదాయం. వీటి ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి పన్ను రూపంలో 2,64,182 కోట్లు వచ్చాయి. రాష్ట్రాలకు కూడా దాదాపు అంతే మొత్తంలో రూ.2,36,864 కోట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ.17,500 కోట్లు, తెలంగాణకు రూ.15,000 కోట్లు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రాల సొంత ఆదాయంలో పెట్రో ఉత్పత్తులపై పన్ను రూపంలో వచ్చే ఆదాయం 16-18 శాతం వరకు ఉంటోంది. దీనికితోడు రకరకాల పన్నులు విధించుకునే సౌలభ్యం రాష్ట్రాలకు ఉంది. అందుకే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. 


Related News

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

Big Stories

×