EPAPER

Sewing Machine:‘మిషన్’ ఇంపాజిబుల్.. జాతీయ కుట్టు యంత్ర దినోత్సవం (జులై 13)

Sewing Machine:‘మిషన్’ ఇంపాజిబుల్.. జాతీయ కుట్టు యంత్ర దినోత్సవం (జులై 13)

National Sewing Machine Day celebrating on July 13


కుట్టు మిషన్ అనగానే మనకు పాత సినిమాలలో ఓ పేద తల్లి మిషన్ కుట్టి సంపాదించిన సొమ్ముతో తన కొడుకును పెద్దవాడిని చేస్తుంది. పూర్వ కాలంలో ఆడపిల్లలకు చదువు అక్కర్లేదని వాదించేవారు సైతం తమ కూతురుకు కుట్టు మిషన్ నేర్పించేవారు. ఒకవేళ భర్త వదిలేసినా కుట్టు పనితోనైనా ఆమె బతుకుతుందని అనుకునేవారు. ఇప్పటికీ పల్లెటూళ్లలో కుట్టు పని తో జీవనోపాధి గడిపే కుటుంబాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ కుట్టు యంత్రానికి కూడా ఓ రోజు ఉంది. అదే నేషనల్ స్టిచ్చింగ్ మిషన్ డే. జూన్ 13న దీనిని జాతీయస్థాయిలో జరుపుకుంటున్నాం.

20 వేల సంవత్సరాల చరిత్రs


కుట్టు యంత్రానికి దాదాపు 20 వేల సంవత్సరాల చరిత్ర ఉందని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. మొదట్లో జంతువుల ఎముకలు, కొమ్ములతో సూదులు చేయబడేవి. వాటి దారాలు కూడా జంతువుల నరాలతోనే ఉండేవట. అయితే 14వ శతాబ్దం నాటికి ఐరన్ తో చేసిన సూదులు వచ్చాయి. అనేక రూపాంతరాల తర్వాత పారిశ్రామిక విప్లవం పుణ్యమా అంటూ 1800 తర్వాత కుట్టు యంత్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఐజాక్ సింగర్, ఎలియాస్ హువే కుట్టు యంత్రాలను డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

ఐజాక్ సింగర్

కుట్టుమిషన్ ను వెలుగులోకి తెచ్చిన వ్యక్తిగా ఐజాక్ సింగర్ ను చెప్పుకుంటారు. ప్రస్తుత ఆధునిక కుట్టు యంత్రాలకు ఆద్యుడు సింగరే.1811 లో అమెరికాలోని న్యూయార్క్ లో జన్మించిన సింగర్ ది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. అప్పటిదాకా వచ్చిన కొత్త ఆవిష్కరణలలో సింగర్ కనిపెట్టిన కుట్టు మిషన్ ఓ ప్రత్యేకత సంతరించుకుంది. మహాత్మా గాంధీ కూడా సింగర్ కుట్టు మిషన్ ను చాలా సందర్భాలలో మెచ్చుకోవడం విశేషం.

స్వచ్ఛంద సంస్థల సాయం

నేటి ఆధునిక యుగంలో కుట్టు మిషన్ లేని జీవితం ఊహించడం కష్టమే. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్ ను అనుసరించి ఆకర్షణీయంగా తయారవుతున్న వస్త్రాలు అన్నీ కుట్టుమిషన్ నుంచి వస్తున్నవే. ప్రస్తుతం కొన్ని స్వచ్ఛంద సంస్థలు,రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పేదింటి మహిళలకు కుట్టు మిషన్లను అందజేస్తున్నారు. వారి జీవనోపాధికి తోడ్పడుతున్నారు. మహిళలు కూడా టైలరింగ్ నేర్చుకుని తమ కాళ్ల మీద తాము నిలబడి తమ కుటుంబాలకు జీవనాధారం అవుతున్నారు. చాలా ఊళ్లల్లో మహిళా సంఘాలు ప్రభుత్వ ఆర్డర్లను తీసుకుని స్కూలు పిల్లలకు యూనిఫాం, టైలు కుట్టుడం వంటి వాటితో ఉపాధిని పొందుతున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు వాళ్లే సంస్థలు నెలకొల్పి తమ కంపెనీ ప్రాడక్ట్ పేరుతో బ్రాండెడ్ వస్త్రాలుగా అమ్ముతుంటారు. ప్రత్యేకంగా మహిళా టైలర్లను వందలాదిగా చేర్చుకుని వాళ్లను జీతం ప్రాతిపదికగా తీసుకుని ఉపాధికి ఊతమిస్తున్నారు.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×