EPAPER

Japan Earthquakes Mystery | జపాన్‌లోనే ఎక్కువ భూకంపాలు ఎందుకు? .. వాటిని ప్రజలు ఎలా ఎదుర్కొంటున్నారు?

Japan Earthquakes Mystery | భూకంపం.. నివారించలేని ప్రకృతి విపత్తు. ఎవరూ అడ్డుకోలేరు. భరించాల్సిందే. నష్టపోవాల్సిందే. ముందస్తుగా గుర్తు పట్టలేం.. క్షణాల వ్యవధిలో ప్రజలను అలర్ట్ చేయలేం. నిజానికి ఏమీ లేని చోట భూకంపంతో పెద్దగా నష్టం ఉండదు. కానీ బిల్డింగ్ లు కూలడంతోనే ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంటుంది.

Japan Earthquakes Mystery | జపాన్‌లోనే ఎక్కువ భూకంపాలు ఎందుకు? .. వాటిని ప్రజలు ఎలా ఎదుర్కొంటున్నారు?

Japan Earthquakes Mystery | భూకంపం.. నివారించలేని ప్రకృతి విపత్తు. ఎవరూ అడ్డుకోలేరు. భరించాల్సిందే. నష్టపోవాల్సిందే. ముందస్తుగా గుర్తు పట్టలేం.. క్షణాల వ్యవధిలో ప్రజలను అలర్ట్ చేయలేం. నిజానికి ఏమీ లేని చోట భూకంపంతో పెద్దగా నష్టం ఉండదు. కానీ బిల్డింగ్ లు కూలడంతోనే ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంటుంది. ఇవి లేని చోట భూమి కంపిస్తే పెద్దగా నష్టమేమీ ఉండదు. అయితే ప్రపంచం ఇప్పుడు భూకంపాలతో డేంజర్ జోన్ లోకి వెళ్తోంది. తరచూ ఎక్కడో చోట భూమి కంపిస్తూనే ఉంటోంది. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ముఖ్యంగా జపాన్, ఇండోనేషియా, హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో ఈ ప్రకంపనల తీవ్రత పెరుగుతోంది.


భూకంపాలు చెప్పి రావు. ముందుగా గుర్తించలేం. వెంటనే రియాక్ట్ కాకపోతే నష్టాన్ని నివారించలేం. ఇదీ సమస్య. భూ ప్రకంపనలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడో చోట భూమి కంపించిందనే వార్త వినిపిస్తూనే ఉంటోంది. ఇప్పుడు జపాన్ వంతు వచ్చింది. అగ్ని పర్వతాలు, ముడుత పర్వతాలు, అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో ఎర్త్ క్వేక్ ఎక్కువగా వస్తున్నాయి. జపాన్ కు రెగ్యులర్ గా ఈ భూకంపాల భయం పట్టి పీడిస్తూనే ఉంది. అలాగే ఇండోనేషియా కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతోంది.

జపాన్ కు న్యూ ఇయర్ మొదటి రోజే బ్యాడ్ వెల్కమ్ చెప్పింది. కొత్త సంవత్సర వేడుకల జోష్ ముగియక ముందే వరుస భూ ప్రకంపనలు షేక్ చేశాయి. ఒకటి కాదు రెండు కాదు.. 155 ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై వీటి తీవ్రత 3 నుంచి 7.6 మధ్య నమోదయ్యాయి. భూకంపం వచ్చిందంటే ఆ ఎఫెక్ట్ మరికొన్ని రోజుల పాటు ఉంటుంది. చిన్న చిన్న ప్రకంపనలు కొన్ని రోజుల వరకు నమోదవుతుంటాయి.


భూకంపంతో భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాలు జరగడం, షార్ట్ సర్క్యూట్స్ ఇలాంటి కారణాలతో పదుల సంఖ్యలో చనిపోయారు. నీగట, టొయామ, ఫుకూయ్‌, గిఫూ నగరాల్లో చాలా మందికి గాయాలయ్యాయి. 45 వేల ఇళ్లకు కరెంట్ సప్లై ఆగిపోయింది. పర్యాటక ప్రదేశమైన వాజిమా నగరంలో అసైచి వీధిలో భూకంపంతో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ బీటలు వారి.. వాహనాలు వెళ్లలేని పరిస్థితి జపాన్ లో చాలా చోట్ల ఏర్పడింది. భూప్రకంపనలు ఆగకపోవడంతో సహాయ చర్యలకు పెద్ద అడ్డంకిగా మారింది.

సాధారణంగా భూకంపం నేరుగా మనిషి ప్రాణం తీయదు. కేవలం కూలిన భవనాలతోనే ప్రాణనష్టం ఉంటుంది. గత చరిత్రను పరిశీలిస్తే.. భూకంపాలు వచ్చిన సమయంలో 90శాతం మందిని తొలి మూడు రోజుల్లోనే రక్షించగలిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. భూకంపం వచ్చిన తొలి 24 గంటల్లో స్థానికులు.. చేతులు, చిన్న చిన్న పరికరాలతో చేపట్టే సహాయక చర్యలు అత్యంత కీలకం. వీరే అత్యధిక మందిని కాపాడుతుంటారు. ఆ తర్వాత సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌, ఫైర్‌ ఫైటర్లు, పోలీసులు మిషనరీతో కూలిన భవనాల దగ్గరికి చేరుకుని కాపాడడం మరో సవాల్ తో కూడుకున్నది. శిథిలాల మీద పడితే కొందరు 72 గంటల దాకా బతికే అవకాశాలు ఉంటాయి. శిథిలాల తొలగింపుతో వారిని కాపాడవచ్చు. అయితే జపాన్ లో రోడ్లు నెర్రలు బారి వాహనాలు వెళ్లలేకుండా ఉన్నాయి. ఎయిర్ పోర్ట్ రన్ వేలూ దెబ్బతినడంతో రెస్క్యూ ఆపరేషన్ లకు మరింత టైం పడుతోంది. చాలా ప్రాంతాల్లో రైలు, విమాన సేవలు ఆపేశారు. పోర్టుల వద్ద మునిగిపోయిన పడవలే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితితో ప్రాణనష్టం మరింతగా ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో జపాన్ లో మరికొన్ని భూకంపాలు సంభవించవచ్చని అలర్ట్ చేశారు. దీంతో అక్కడి జనానికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది.

జపాన్ ప్రజలకు భూకంపం నిత్యగండంగా మారిపోయింది. ఎప్పుడు ప్రకంపనలు వస్తాయో తెలియదు.. ప్రశాంతంగా ఉన్న సముద్ర మహోగ్రంగా మారుతుందో తెలియదు. అందుకే తక్కువ ప్రాణ నష్టం ఉండేలా ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారు. 2011లో ఇదే జపాన్ లో 9.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత అది సునామీగా మారింది. దాదాపు 20 వేల మందికి పైగా అప్పట్లో చనిపోయారు. ప్రపంచంలోనే భయంకరమైన భూకంపాల్లో ఇదీ ఒకటి. అక్కడ అప్పుడప్పుడూ రెగ్యులర్ గా ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. వీటికి జపాన్ జనం అలవాటు పడిపోయారు. అసలు జపాన్‌లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తున్నాయన్న చర్చ మరోసారి జరుగుతోంది. నిజానికి జపాన్ భౌగోళిక పరిస్థితులే ఆ దేశానికి ఎక్కువ ముప్పు కలిగిస్తున్నాయి. అలాగే ప్రపంచంలో ఎక్కువగా ఎర్త్ క్వేక్స్ వచ్చేది పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోనే. దాదాపు 68% భారీ భూకంపాలు ఇక్కడే నమోదవుతాయి. అందుకే ఇదే తీరంలో ఉన్న జపాన్‌లో తరచూ భూమి కంపిస్తూ ఉంటుంది.

సింపుల్ గా చెప్పాలంటే భూమి లోపలి ఫలకాల్లో కదలికల కారణంగా భూకంపాలు వస్తుంటాయి. ఇవి ఎందుకు కదులుతాయంటే.. అక్కడి భూమి పొరల్లో విపరీతమైన వేడి ఉంటుంది. దీంతో ఆ ఒత్తిడి, రాపిడిని తట్టుకునే పరిస్థితి ఉండదు. ఒక ప్లేట్ మరో ప్లేట్ తో ఢీకొట్టడం వల్ల అది భూకంపం రూపంలో పైకి కనిపిస్తుంటుంది. ముఖ్యంగా జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రీజియన్ లో ఉంది. ఇది భూకంపాలు రావడానికి, అగ్ని పర్వతాలు పేలడానికి అనుకూలంగా ఉంది. ఇక్కడ మూడు టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. పసిఫిక్ సముద్రం, ఫిలిప్పైన్ సీ ప్లేట్ వీటి పైన పసిఫిక్ ప్లేట్ ఉంటాయి. వీటిని టెక్నికల్‌గా కాంటినెంటల్, ఒషియానిక్ ప్లేట్స్ గా పిలుస్తారు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానికి ఒకటి ఢీకొట్టుకునే ప్రాంతంలో ఉంది జపాన్. అందుకే ఈ ప్రకంపనలు జపాన్ ఎపి సెంటర్ గా రిపీట్ అవుతుంటాయి.

భూకంపాలకు భయపడి బతకడం కంటే.. వాటి నుంచి తప్పించుకోడానికి ఏం చేయాలనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు జపాన్ వాసులు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఎర్త్ క్వేక్స్ పై పాఠాలు చెబుతున్నారు. డ్రిల్స్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నట్టుండి అలారమ్స్‌ మోగించి వెంటనే విద్యార్థులందరూ బెంచ్‌ల కింద దాక్కోవాలని చెబుతుంటారు. ఇదో రెగ్యులర్ ప్రాక్టీస్ అయిందక్కడ. కాస్త భూకంపం వచ్చినా వెంటనే సేఫ్‌ ప్లేస్‌కి వెళ్లిపోయేలా జపాన్ స్కూల్ పిల్లలు కూడా అలవాటు పడ్డారు. మ్యాటర్ ఇక్కడితో ఆగలేదు. భూకంపాలను తట్టుకునేలా ఇళ్లని నిర్మించే టెక్నాలజీని వినియోగిస్తోంది జపాన్.

ఇక్కడి బిల్డింగ్స్‌లో సెస్మిక్ ఇసోలేషన్ బేరింగ్స్ ను వాడుతున్నారు. భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్‌ హారిజాంటల్‌గా కదిలేలా చేస్తాయి ఈ బేరింగ్స్. ఫలితంగా భవనంపై ఒత్తిడి తగ్గి డ్యామేజ్‌ తగ్గిపోతుంది. ఈ బేరింగ్స్‌తో పాటు కాంక్రీట్‌ ఫ్రేమ్స్‌నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. భవనాలు కూలిపోకుండా ఇవి అడ్డుకుంటాయి. భూకంపాన్ని ముందుగా పసిగట్టేలా భవనాల్లో అలారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడైనా భూమి కంపించినప్పుడు ఆటోమెటిక్‌గా గ్యాస్, ఎలక్ట్రిసిటీ సప్లై నిలిచిపోతుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా బిల్డింగ్ కోడ్స్ ను తీసుకొచ్చింది. రూల్స్ ప్రకారమే బిల్డింగ్ లు కట్టాల్సి ఉంటుంది. భూకంప తీవ్రతను తట్టుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాదు.., జపాన్‌లోని అన్ని బిల్డింగ్స్‌నీ పదేళ్లకోసారి చెక్ చేస్తుంటారు. ఏమైనా లోపాలుంటే వెంటనే సరి చేసుకోవాలని ఆదేశాలిస్తారు. ఈ విషయంలో చాలా కచ్చితంగా వ్యవహరిస్తోంది జపాన్ ప్రభుత్వం. ఎందుకంటే ఏ భూకంపం ఏ రూపంలో వస్తుందో తెలియదు. ప్రాణనష్టం ఎక్కువగా బిల్డింగ్ ల కారణంగానే జరుగుతుండడంతో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు తీరంలో భూకంపం వచ్చి సునామీలు వచ్చినా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జపాన్ అణువిద్యుత్ కేంద్రాల దగ్గర ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×