EPAPER

Congress Tweet: ఏడుపు ఎందుకు సబితమ్మా..? చేవెళ్ల చెల్లమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా..??

Congress Tweet: ఏడుపు ఎందుకు సబితమ్మా..? చేవెళ్ల చెల్లమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా..??

Congress Tweet: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య రాజకీయ వార్ కొనసాగింది. ఒకరిపై మరొకరు విమర్శ, ప్రతి విమర్శలు చేసుకున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ తీరును ఎండగట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడపైం బీఆర్ఎస్ నేతలు ఖండిస్తుండడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు మీకు గుర్తుకురాలేదా అంటూ మంత్రి విమర్శించారు.


ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరుతున్న సమయంలో తాను ఆహ్వానించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. అవును వాస్తవమే కానీ, నాకు సోపర్ట్ చేస్తానని చెప్పుకొచ్చిన సబితక్క మల్కాజిగిరి ఎంపీ టికెట్ రాగానే బీఆర్ఎస్ పార్టీలోకి పోయిందంటూ చెప్పుకొచ్చారు. ఇలా అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. అసెంబ్లీ గురువారానికి వాయిదా పడిన అనంతరం ఎమ్మెల్యే సబితా మీడియాతో మాట్లాడారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్.. బీఆర్ఎస్‌‌కు మళ్లీ కౌంటర్


అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందంటూ మహిళలను అవమానించేలా సీఎం మాట్లాడారంటూ ఆమె ఆరోపించారు. అసెంబ్లీలో తన గురించి, సునీత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశామని సీఎం అన్నారని ఆమె పేర్కొన్నారు. ఆడబిడ్డలు ఎప్పుడైనా క్షేమం కోరుతారన్నారు. నమ్ముకున్నవాళ్లకు ప్రాణమైనా ఇస్తాం కానీ.. మోసమైతే చేయబోమన్నారు. సబిత, సునీతకు జరిగిన అవమానం కాదు ఇది.. యావత్ తెలంగాణలోని మహిళలకు జరిగిన అవమానంగా భావిస్తున్నామన్నారు. గత 24 ఏళ్ల నుంచి తాను అసెంబ్లీకి వస్తున్నానని.. ఎంతోమంది సీఎంలను చూశానని ఆమె అన్నారు. ఎవరూ కూడా రేవంత్ రెడ్డిలా వ్యాఖ్యలు చేయలేదన్నారు. సీఎ పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించేలా రేవంత్ రెడ్డి వ్యవహరించారన్నారు. రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు.

అయితే, ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఏడుపు ఎందుకు సబితమ్మా? చేవెళ్ల చెల్లెమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా.? ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో నిన్ను హోంమంత్రిని చేసినందుకా? కష్టకాలంలో కాంగ్రెస్‌ను మోసం చేసి పదవి కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ.. లోక్ సభ ఎన్నిక్లో బీజేపీకి పని చేసినందుకా? నువ్వు ఏడిస్తే సానుభూతి రాదు సబితమ్మా.. అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నది.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×