EPAPER

Zaheerabad : హత్యకేసులో కీలక తీర్పు .. కుటంబంలో 9 మందికి జీవితఖైదు..

Zaheerabad :సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కాశీంపూర్‌లో జరిగిన హత్యకేసులో తొమ్మిది(9) మందికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి ఐదు వేలు రూపాయలు జరిమానా విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి సుదర్శన్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసు వివరాలు చిరాగ్ పల్లి ఎస్ఐ వెల్లడించారు. కాశీంపూర్‌కు చెందిన వడ్ల నర్సమ్మ 2016 సంవత్సరంలో హత్యకు గురి అయింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆమె బంధువులే హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Zaheerabad : హత్యకేసులో కీలక తీర్పు .. కుటంబంలో 9 మందికి జీవితఖైదు..
This image has an empty alt attribute; its file name is 99804966c10d3d79d5d851048e0d4bd3.jpg

Zaheerabad : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కాశీంపూర్‌లో జరిగిన హత్యకేసులో 9 మందికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి ఐదు వేలు రూపాయలు జరిమానా విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి సుదర్శన్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసు వివరాలు చిరాగ్ పల్లి ఎస్ఐ వెల్లడించారు. కాశీంపూర్‌కు చెందిన వడ్ల నర్సమ్మ 2016 సంవత్సరంలో హత్యకు గురైంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆమె బంధువులే హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.


నర్సమ్మ కొడుకుతో కలిసి జహీరాబాద్‌లో తన కుమారుడితో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉండేది. ఆమె బంధువు అయిన వడ్ల వీరన్న కూతురికి పెళ్లి కుదిరింది. బాల్యవివాహం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న అధికారులు.. వారిని విచారించి ఆ వివాహాన్ని రద్దు చేశారు. వ్యక్తిగత కక్షతో‌నే తన కూతురి పెళ్లి‌ని ఆపిందని ఆమెపై వీరన్న కక్షపెంచుకున్నాడు. ఎప్పటిలానే ఫించన్ డబ్బు తీసుకునేందుకు 2016 మార్చి 25న జహీరాబాద్ నుంచి కాశీంపూర్‌కు వెళ్ళింది. నర్సమ్మ కాశీంపూర్ వచ్చిందన్న విషయం వీరన్న తెలసుకున్నాడు. ఇదే అదునుగా భావించి కుటుంబ సభ్యులు అయిన వడ్ల ప్రభు(40), వడ్ల సంతోష్(19), వడ్ల ప్రభావతి(40), వడ్ల ఈశ్వరమ్మ (42), వడ్ల రేఖ (28), వడ్ల శ్రీకాంత్(17), వడ్ల ప్రశాంత్(19) తో కలిసి ఆమెపై దాడి చేసారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. చివరకు ఆసుపత్రిలో చికత్స పొందుతూ మరణించింది.

నర్సమ్మ కుమారుడు పాండు ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి సీఐ సదా నాగరాజు కేసు నమోదు చేశారు. చిరాగ్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ కేసును దర్యాప్తు చేసి పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాడు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తొమ్మిది మందిని దోషులుగా పేర్కొంది. వారికి జీవిత ఖైదు శిక్షను విధించింది. నిందితులు శిక్షతో పాటు రూ.500 రూపాయలు జరిమానా చెల్లించాలని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించకపోతే ఒక సంవత్సరం పాటు అదనంగా శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.


Related News

Florida Woman Buried Husband: ‘దృశ్యం’ సినిమా లాంటి కేసు.. భర్త శవాన్ని ఇంట్లో పాతిపెట్టిన మహిళ.. హత్య మరెవరో చేసి..

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Big Stories

×