EPAPER

YS Sharmila: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ ప్రశంసలు

YS Sharmila: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ ప్రశంసలు

Farm Loan Waiver: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశంసలు కురిపించారు. రైతుల రుణమాఫీ చేయడాన్ని హర్షించారు. రైతు రుణమాఫీ వరం చరిత్ర గర్వించే రోజు అని తెలిపారు. రైతు కళ్లల్లో ఆనందం తిరిగి తీసుకువచ్చే క్షణమని వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.


15 ఏళ్ల క్రితం ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. మళ్లీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేసి చూపించిందని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. రాహుల్ గాంధీ ఎన్నికల వేళ చేసిన వాగ్దానం సాకారమైన రోజు అని వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన వైఎస్ షర్మిల అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వానికి కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రైతుల తలసరి అప్పుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి రైతుపై రూ. 2,45,554 రూపాయల రుణం ప్రతి రైతు నెత్తి మీద కత్తిలా వేలాడుతున్నదని వివరించారు. గడిచిన దశాబ్ద కాలంలో కరువు, తుఫాన్‌లతో మరో వైపు పూర్తికాని ప్రాజెక్టులు, సర్కార్లు నిర్లక్ష్యంతో కర్షకులందరూ తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.


Also Read: అమెరికాకు సీఎం రేవంత్..షెడ్యూల్ ఇదే

డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి ప్రభుత్వం కేంద్రం సాయంతో ఎందుకు రైతు రుణమాఫీ చేయడం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీని తప్పకుండా అమలు చేసేవారిమని వివరించారు. రైతు రుణమాఫీ చేసి అన్ని విధాల చితికిపోయిన రైతులను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నామని ట్వీట్ చేశారు. ఇది చాయిస్ కాకూడదని, బాధ్యత అనుకోవాలని సూచించారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×