EPAPER

Attack On BRS Leaders: నల్గొండలో కేటీఆర్, హరీష్ రావుకు నిరసన సెగ.. కోడిగుడ్లతో దాడి!

Attack On BRS Leaders: నల్గొండలో కేటీఆర్, హరీష్ రావుకు  నిరసన సెగ.. కోడిగుడ్లతో దాడి!

Attack on BRS Leaders With Eggs in Nalgonda:నల్గొండకు కేసీఆర్ రాకను నిరసిస్తూ సభకు వెళ్తున్న బీఆర్ఎస్ వాహనాలను యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కోడిగుడ్లతో దాడి చేశారు. కేసీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.


ఈ ఘటన వీటీ కాలనీ వద్ద జరిగింది. ఈ సమయంలో బస్సులు మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ఉన్నారు. పోలీసులు నిరసన చేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ చేశారు. ఆందోళనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఛలో నల్గొండ పేరుతో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తోంది. తెలంగాణ భవన్ నుంచి రెండు ప్రత్యేక బస్సులో నల్లగొండ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. కృష్ణా జలాలను KRMBకు అప్పగించద్దని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నిరసన సభను తలపెట్టింది.


ఛలో నల్గొండ పేరుతో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తోంది. తెలంగాణ భవన్ నుంచి రెండు ప్రత్యేక బస్సులో నల్లగొండ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. కృష్ణా జలాలను KRMBకు అప్పగించద్దని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నిరసన సభను తలపెట్టింది.

ఓటమి తర్వాత బీఆర్ఎస్ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే. కేసీఆర్ ఏం సందేశం ఇస్తారనే ఆతృతతో ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో నల్లగొండకు కేసీఆర్ వెళ్లారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గులాబీ బాస్ ఆతిథ్యం ఇచ్చారు. భోజనం తర్వాత సభా స్థలికి కేసీఆర్ వెళ్లారు.

నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడియారం సెంటర్ లో నిరసన సభకు పిలుపునిచ్చిది. KCR గతంలో నల్గొండ జిల్లాకు ఇచ్చిన హామీలు, ప్రాజెక్టులు అభివృద్ధి విషయంలో చేసిన అన్యాయాన్ని LED స్క్రీన్ పెట్టి ప్రజలకు చూపించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. కేసిఆర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బ్లాక్ బెలూన్స్ ఎగరవేసి నిరసన తెలిపారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×