EPAPER
Kirrak Couples Episode 1

Telangan Police: మరీ ఇంత దారుణమా.. వైద్యశాలలో పేకాట… పట్టుబడిన మహిళలు

Telangan Police: మరీ ఇంత దారుణమా.. వైద్యశాలలో పేకాట… పట్టుబడిన మహిళలు

Telangan Police: డ్రగ్స్, మత్తు పదార్థాలు, పేకాట, చట్టవ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లొద్దు.. వెళ్లారో ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదంటున్నారు తెలంగాణ పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు ముమ్మర దాడుల పర్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సాగిస్తున్నారు. ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అక్కడ వాలిపోతున్నారు తెలంగాణ పోలీసులు. దీనితో హడలెత్తి పోతున్నారు ఇలాంటి నేరస్థులు. హైదరాబాద్ నగరంలోనే కాక అన్ని జిల్లాల ఎస్పీల ఆదేశాలతో ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీస్ అధికారులు, సిబ్బంది సైతం అదే స్థాయిలో దాడుల పర్వాన్ని సాగిస్తున్నారు.


ప్రధానంగా పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దూకుడు పెంచిన పోలీసులు.. ఎంతటి ప్రముఖులనైనా ఇట్టే కటకటాల్లోకి పంపించేస్తున్నారు. అటువంటి ఘటనే నిజామాబాద్ లో తాజాగా జరిగింది. ఇక్కడ పేకాట ఆడుతూ దొరికింది పురుషులు అనుకుంటే పొరపాటే.. వారందరూ మహిళలే. అందులో ప్రముఖ వైద్యుల సతీమణులని తెలుస్తోంది. నిజామాబాద్ పరిధిలో పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిఘా పెంచారు. ఈ తరుణంలోనే వారికి పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యశాలలో పేకాట జోరుగా సాగుతుందని సమాచారం అందింది. అక్కడికి వెళ్ళిన పోలీసులు షాక్ కు గురయ్యారు.. కారణం అక్కడ పేకాట ఆడుతున్నది ఎవరో కాదు అంతా బడాబాబుల సతీమణులే.

నిజామాబాద్ పట్టణంలోని సరస్వతి నగర్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రి నాలుగో అంతస్థులో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు పోలీస్ రైడింగ్ సాగింది. అక్కడ డబ్బు పెట్టి పేకాట ఆడుతున్న నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15 వేల నగదుతో పాటు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని సమాచారం. కాగా పోలీసులు వైద్యశాలలో దాడులు నిర్వహించడంతో ఈ విషయం సంచలనంగా మారింది. రోగులకు వైద్యసేవలు అందించే వైద్యశాలను.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.


Also Read: R Krishnaiah: బ్రేకింగ్ న్యూస్… కాంగ్రెస్‌లోకి ఆర్. కృష్ణయ్య ?

పోలీసులు మాత్రం మాకు ఎంతటి వారైనా ఓకే.. పేకాట ఆడారా.. లేదా.. అందుకే అదుపులోకి తీసుకున్నామంటూ తెలుపుతున్నారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని, అలాగే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ దాడుల పరంపర నిరంతరం కొనసాగుతుందని, యువత ఇటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి దాడుల పర్వాన్ని సాగించి, ఇలాంటి నేరస్థుల భరతం పట్టాలని ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలతోనే పోలీసులు దాడులను ముమ్మరం చేసి, ఇటీవల ఎందరో గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను పట్టుకున్నారు. అయితే ఈ దాడులలో పట్టుబడ్డ వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి కఠిన శిక్షలు అమలయ్యేలా పోలీసులు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారనే చెప్పవచ్చు. చివరగా ఇలాంటి అసాంఘిక చర్యలకు ఎవరైనా పాల్పడుతున్నారా.. ఖబడ్దార్ అంటున్నారు తెలంగాణ పోలీసులు.

Related News

R Krishnaiah: బ్రేకింగ్ న్యూస్… కాంగ్రెస్‌లోకి ఆర్. కృష్ణయ్య ?

Indiramma Housing Scheme: శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి… ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు..

Etela Rajendhar: సర్పంచులు చనిపోతున్నా.. సర్కారు పట్టించుకోదా.. ?: ఈటల రాజేందర్

Kaleshwaram: కాళేశ్వరంపై విచారణ… ప్రశ్నలు దాటేసిన పద్మావతి.. జస్టిస్ అసహనం

Uttam Kumar Reddy: ఆ ఒక్కటి మాత్రం మాకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు : మంత్రి ఉత్తమ్

BRS on Musi River: మూసీపై అప్పుడు కేసీఆర్ అలా.. ఇప్పుడు కేటీఆర్ ఇలా.. అడ్డంగా దొరికిపోయారుగా!

Big Stories

×