EPAPER

BRS : ఇల్లు గుల్ల.. బయట డొల్ల, ప్రతిపక్షం ఎవరి పక్షం?

BRS : ఇల్లు గుల్ల.. బయట డొల్ల, ప్రతిపక్షం ఎవరి పక్షం?

BRS: తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అధికార పార్టీని బీఆర్ఎస్ ఎదుర్కోలేక పోతుందా? బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతుందా? కేడర్‌తోపాటు నేతలూ డీలా పడుతున్నారా? బోలెడు సమస్యలతో సతమతమవుతున్న పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుందా? ప్రజా సమస్యలను పక్కన పెట్టేసిందా? అవుననే సంకేతాలు కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.


గడిచిన పదేళ్లు బీఆర్ఎస్‌కు స్వర్ణయుగం. కొత్తగా రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత అధికారంలోకి రావడం జరిగింది. పదేళ్ల తర్వాత తొలిసారి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. అపోజిషన్ అంటే.. అధికార పార్టీని నిలదీయడానికి సరైన అవకాశం ఉంటుంది. కానీ, ఆ పాత్రకు కారు పార్టీ దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అధికార పార్టీ ఎత్తులను పసిగట్ట లేకపోతోంది. ప్రతీరోజూ ఆ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేకపోతోంది. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, చివరకు ఆ పార్టీలోని కీలక నేతలు సైతం ఇదే విధంగా వ్యవహరిస్తున్నట్లు కొన్నివర్గాల ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతీ కార్యక్రమం సరిగా జరుగుతుందా, లేదా అన్నదానిపై ఏ మాత్రం ఫోకస్ పెట్టలేదు. కొద్ది రోజులుగా కారు పార్టీలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ. కారులో శాశ్వతంగా షెడ్‌కి వెళ్లిందని, ఇక రాదని ఒకానొక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బహుశా అదే కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తోంది. అధికార పార్టీ లేవనెత్తిన ప్రతీ అంశాన్ని బురద జల్లడం చేసే ప్రయత్నంలో నిగమ్నమైంది. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కనిపించలేదు. మా పథకాలను తొలగించారంటూ చీటికి మాటికీ చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.


మొన్నటికి మొన్న రైతుల రుణమాఫీ గురించి విపక్ష నేతల ఆరోపణలు కేవలం మీడియాకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత ఆ విషయాన్ని సైడున పెట్టేసింది కారు పార్టీ. ఈలోగా గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. దాని దెబ్బకు కారు రెండు ముక్కలైంది. ఆ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు హైదరాబాద్‌లో శాంతి భద్రతల వ్యవహారాన్ని ప్రస్తావించి ప్రజల్లో ఆ పార్టీ మరింత చులనైపోయింది.

ALSO READ: మూసీ ఆక్రమణలు.. రెడీగా హైడ్రా బుల్డోజర్లు, ఇప్పటికే నోటీసులు.. రేపోమాపో

సెక్రటేరియేట్‌లో సీఎం రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఆ క్రమంలో అధికార విపక్షాల మధ్య మాటలయుద్ధం సాగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు ఎత్తారు. తాము అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామంటూ కేడర్‌ను ఉత్తేజపరిచే మాటలు తప్పితే, సరిగా ప్రతిపక్ష పాత్ర పోషించలేదన్నది కొందరి వాదన.

రాజు బలహీనపడితే.. సామంత రాజులు రెచ్చిపోతారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో అదే జరుగుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆ పార్టీకున్న 38 మంది ఎమ్మెల్యేలు.. ఇప్పటికే కొందరు మిగతా పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారు. పైగా నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు అరికెపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి వ్యవహారం ఆ పార్టీలో ముసలం రేపింది. గట్టిగా మాట్లాడే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం నోరు మెదపలేదని పరిస్థితి నెలకొంది. గట్టిగా మాట్లాడితే తమ కుర్చీ కిందకు నీళ్లు వస్తాయని భావిస్తున్నారు.

కొద్ది రోజులుగా ఏ ఒక్కరూ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఆ పార్టీ వ్యవహారాలకు నేతలు దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్.. పేరుకే జాతీయ పార్టీ.. కనీసం ప్రాంతీయ పార్టీ మాదిరిగా వ్యవహరించ లేదన్నది కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. రాబోయే రోజుల్లో ఆ పార్టీలో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Related News

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Bandi Sanjay: ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వదిలేస్తున్నా.. ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటే ఊరుకోను: బండి సంజయ్

Kavitha: కవిత మౌనమేల.. దూరం పెట్టారా.. ఉంచారా..?

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Big Stories

×