EPAPER

BRS leader ship change: అయ్యా గమ్మునుండు, నేను చూసుకుంటా.. ఆ సంకేతాలు దేనికి?

BRS  leader ship change: అయ్యా గమ్మునుండు, నేను చూసుకుంటా.. ఆ సంకేతాలు దేనికి?

BRS leader ship change: కారులో పార్టీలో ఏం జరుగుతోంది? కేసీఆర్ సైలెంట్ వెనుక లీడర్ షిప్ చేంజ్ అవుతుందా? పార్టీ వ్యవహారాలు కేటీఆర్ ఆధ్వర్యంలో నడుస్తు న్నాయా? కనీసం నేతలతో కేసీఆర్ సమావేశాలు ఎందుకు పెట్టలేదు? దాదాపుగా కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నా యి. అసలు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోందన్న చర్చ తెలంగాణలో మొదలైపోయింది.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ నోరు ఎత్తలేదు. కేవలం ఇంటికే పరిమితమయ్యారు. తొలుత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాలు పెట్టేవారు. ఇప్పుడు అదీ కూడా లేదు. అసలు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది. జైలు నుంచి వచ్చిన తర్వాత కవితక్క యాక్టివ్‌గా లేరు. ఆమె కూడా సైలెంట్ అయిపోయారు.

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు మూసీ, హైడ్రా చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికార-విపక్షాల మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. విపక్షాలు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయినా సరే మాజీ సీఎం కేసీఆర్ సైలెంట్‌గానే ఉన్నారు. ఈ లెక్కన పార్టీ పగ్గాలు కేటీఆర్‌కు అప్పగించి నట్టేనా? అవుననే అంటున్నాయి పార్టీ శ్రేణులు.


రీసెంట్‌గా విద్యార్థుల నాయకులతో కేటీఆర్ పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు. ఈ సమయంలో బీఆర్ఎస్ లోగో లో కేసీఆర్ కనిపించేవారు. ఆయన స్థానంలో కేటీఆర్ ఫోటో చూసి అవాక్కయ్యారు. అందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లెక్కన తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసినట్టేనని  అనుకుంటున్నారు.

ALSO READ: మహిళా అఘోరితో ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. సంచలన విషయాలు!

BRS logo leader ship change
BRS logo leader ship change

మూసీ వ్యవహారంలో రెండురోజల కిందట గ్రేటర్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ మాత్రమే సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. చర్చల్లో కేసీఆర్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారట యువనేత. ఈ విషయాన్ని కొందరు నేతలు చెబుతున్నారు. ఈ లెక్కన కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించారనే చర్చ తెలంగాణలో జోరుగా సాగుతోంది.

బీఆర్ఎస్‌లో లీడర్ షిప్ మార్పుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? అనేది తెలియాల్సివుంది. నిజంగానే కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించారా? అధినేత రెస్ట్ తీసుకున్నట్టేనా? నిప్పు లేనిదే పొగ రాదని అంటుంటారు. ఆ తరహా ప్రచారానికి కారు పార్టీ నేతలు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.

Related News

Young India Skill University: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. లక్ష్యాలు, ప్రత్యేకతలు ఇవే..!

Lady Aghori Naga Sadhu: మహిళా అఘోరితో ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. సంచలన విషయాలు!

Musi river : మూసీకి జలకళ సాధ్యమే..

Congress : ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి

Musi River : మూసీ నిర్వాసితులకు సర్కారు చేయూత

Hyderabad: మియాపూర్‌లో చిరుత సంచారం.. హైదరాబాద్ వాసుల్లో భయం భయం!

Big Stories

×