EPAPER

Danam Nagender: దానం నాగేందర్‌ని టార్గెట్ చేస్తున్న బీజేపీ.. అసలు కథ ఇదే..!

Danam Nagender: దానం నాగేందర్‌ని టార్గెట్ చేస్తున్న బీజేపీ.. అసలు కథ ఇదే..!

ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు ఒక రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా రాను రాను జంపింగ్ లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు , కడియం శ్రీహరి , కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలు కారు దిగి హస్తం నీడకు చేరారు. ఇక కంటోన్మెంట్ బైపోల్స్‌లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కోల్పోయింది. దాంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ బలం గడిచిన ఆరు నెలల్లో అసెంబ్లీలో 31 కు పడిపోయింది. ఇంకో 13 మంది అటూఇటు అయితే అసెంబ్లీలో కారు పార్టీకి ప్రతిపక్షహోదా కూడా ఉండదు.

మరోవైపు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. బల్దియా సమావేశానికి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. కౌన్సిల్ మీటింగ్‌కు ఎమ్మెల్యేలు కచ్చితంగా హాజరు కావాలని బీఆర్ఎస్ ఆదేశాలు జారీచేసింది. అధిష్టానం ఆదేశాలను ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాంతో గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారానికి బలం చేకూరినట్లైంది


ఇక ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు కేశవ రావు కాంగ్రెస్ తీర్థం తీసుకోగా.. తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్ లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేపో మాపో మరింత మంది బీఅరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరే పరిస్థితి కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన రెండు సార్లూ అన్ని పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చేసుకున్నారు కేసీఆర్.. ఆయన నేర్పించిన పాఠమే ఇప్పుడాయనకు బూమరాంగ్ అవుతోంది. ఆ క్రమంలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది.

Also Read: ఆ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో పార్టీ ఫిరాయింపుల పర్వం రసవత్తరంగా నడుస్తున్న తరుణంలో ఈ ఎపిసోడ్ లోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పార్టీని వదిలి వెళ్లిన ఎమ్మెల్యేలపై కేసీఆర్ పార్టీ గుర్రుగా ఉంది. వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ సైతం చేస్తోంది. చేరుతున్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. చేర్చుకుంటున్నది కాంగ్రెస్.. మధ్యలో బీజేపీకి పనేంటన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. అదీకాక బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంపింగ్ చేస్తే కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేనే బీజేపీ టార్గెట్ చేస్తోంది.

బీజేపీ హిట్‌లిస్ట్‌లో ఉన్న ఆ ఏకైక ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్.. అయనది వాస్తవానికి కాంగ్రెస్ డీఎన్ఏనే, కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన దానం నాగేందర్ మధ్యలో ఒక సారి టీడీపీ నుంచి గెలిచినా.. తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. రాష్ట్ర విభజన తరువాత మొదటి దఫా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికలు వచ్చే సరికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ టికెట్‌తో గెలిచారు. గత ఏడాది ఎన్నికల్లో ఆరో సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. తిరిగి సొంత గూటికి చేరిపోయారు. కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి కిషన్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు.

ఇక్కడివరకు ఆయన రాజకీయ ప్రస్థానం బానే ఉన్నప్పటికి, బీజేపీ దృష్టిలో ఎందుకు పడ్డారు..? దానంపై బీజేపీ ఎందుకు ఫొకస్ చేస్తోంది.? ఆయన మీద అనర్హత వేటు వేయాలని ఎందుకు టార్గెట్ చేస్తోంది..? స్పీకర్ చర్యలు తీసుకోకపోతే హై కోర్టు కెళ్ళి లీగల్ గా ఫైట్ చేస్తామని కాషాయ దళం ఎందుకు హెచ్చరిస్తోంది..? అసలు వారి వ్యూహాలు ఏంటి అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయిస్తే, ఇక్కడి నుంచి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే అదే ఖైరతాబాద్ స్థానం నుంచి పోటీ చేసి గెలువొచ్చనే ప్రణాళికలకు పదును పెడుతోంది కాషాయ దళం 2014 తెలంగాణ మొదటి దఫా ఎన్నికల్లో ఖైరతాబాద్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అప్పట్లో ఆ పార్టీకి టీడీపీతో పొత్తు, జనసేన మద్దతు కలిసి వచ్చాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో విజయం సాధించి, మరో స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవచ్చనే అంచనాలో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే దానం నాగేందర్ ను టార్గెట్ చేసి అనర్హత వేటు వేయించేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది.

Also Read: మణికొండ డ్రగ్స్ కేసు.. పట్టుబడినవారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన దానం నాగేందర్, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి, హస్తం గుర్తు పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధమంటోంది బీజేపీ.. అన్ని సాక్ష్యాధారాలు అందజేస్తాం దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు కంప్లయింట్ చేదామంటే స్పీకర్ అందుబాటులోకి రావటంలేదంటోంది. ఆయన కార్యాలయంలో ఇస్తే తీసుకోవడంలోదని అందుకే పోస్టల్ ద్వారా స్పీకర్ కు ఫిర్యాదు లెటర్ ను పంపించామని బీజేఎల్పీ చెబుతోంది. చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే లీగల్ గా కోర్టును సంప్రదిస్తామని హెచ్చరిస్తోంది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అనర్హత వేటు వేయాలని గులాబీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో బీఆర్ఎస్‌తో ఉన్న రహస్య స్నేహంతో ఆ పార్టీ మనుగడను కాపాడేందుకే బీజేపీ ఇప్పుడు అనర్హత రాగం అందుకుందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఏదేమైనా బీఆర్ఎస్, కాంగ్రెస్ పంచాయతీలోకి బీజేపీ దూరడం హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు.

Tags

Related News

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Big Stories

×