EPAPER
Kirrak Couples Episode 1

BRS: బీఆర్ఎస్ తో ఎంతెంత దూరానికి?.. ఎర్రకోట చిక్కేనా?

BRS: బీఆర్ఎస్ తో ఎంతెంత దూరానికి?.. ఎర్రకోట చిక్కేనా?

BRS: టీఆర్ఎస్. పక్కా లోకల్. ఇప్పుడు బీఆర్ఎస్. పక్కా నేషనల్ అవుతుందా? ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్. పార్టీని పెట్టడం ఈజీనే. దాన్ని గెలుపు తీరాలకు చేర్చడమే కష్టం. బీఆర్ఎస్ బోణి అయితే జరిగిపోయింది. అదికూడా చాలా సింపుల్ గా. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. ఢిల్లీలో పార్టీ కార్యాలయం కూడా ప్రారంభమైంది. కలర్ అదే. పేరు, మ్యాప్ మారాయి. జెండా మార్చేసినంత సులువుగా.. పార్టీని దేశవ్యాప్తం చేయడం మామూలు విషయం కాదంటున్నారు. అందులోనూ, చాలా రాష్ట్రాల్లో బీజేపీ బలంగా పాతుకొనిపోయి ఉండటం.. కేజ్రీవాల్, మమత లాంటి వాళ్లు ఢిల్లీ పీఠంపై కన్నేసి ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో కేసీఆర్ హస్తిన ప్రయాణం ఎంత సాఫీగా సాగుతుందనేది కీలకాంశం. ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురుతుందని కేసీఆర్ యధాలాపంగా అన్నా.. అక్కడ ఎగిరేది జాతీయ జెండా మాత్రనే. ఏదో పంచ్ కోసం అలా అని ఉంటారు.


దేశంలో మార్పు, కొత్త తరహా రాజకీయాలు.. ఇలా చెవులకు ఇంపుగా ఉండే మాటలు ఎన్ని చెప్పినా.. ప్రజలు బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పైనా ఆసక్తి కనబరుస్తారా? గుజరాత్ లో బీజేపీ ఘన విజయం చూస్తే కమలనాథుల ప్రాభవం ఇప్పట్లో కనుమరుగు అయ్యే అవకాశం తక్కువే. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపునూ ఎక్కువ చేసి చూడలేం. రేపేమాపో గోవా, మహారాష్ట్ర, కర్ణాటక మాదిరే అక్కడా కాషాయ సర్కారు కొలువుదీరడం ఖాయం అంటున్నారు. మరి, కేసీఆర్ ధీమా ఏంటి?

బీఆర్ఎస్ ఆవిర్భావంలో ఆయన వెంట ఉన్నది ఎవరు? టీఆర్ఎస్ నేతలు మినహా.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, నటుడు ప్రకాశ్ రాజ్. అంతేగా. అంతకుమించి ఇంకెవరూ లేరుగా. ప్రకాశ్ రాజ్ కు గతంలో ఓడిన చేదు అనుభవం ఉంది. బీజేపీపై తీవ్ర వ్యతిరేకతే ఆయన్ను కేసీఆర్ పక్కన నిలిచేలా చేసిందనుకోవచ్చు. యూపీలో ప్రస్తుతం యోగి నాయకత్వంలో బీజేపీ అత్యంత పటిష్టంగా ఉంది. అఖిలేష్ యాదవ్ అధికారంలోకి రావడం అంత సులువేమీ కాదు. ఇక, కుమారస్వామి. ఆయన అవుట్ డేటెడ్ లీడర్ అంటున్నారు. కర్నాటకలో ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ రెండూ బలంగా ఉన్నాయి. జేడీఎస్ కు బీఆర్ఎస్ మద్దతు తెలపడం చూస్తుంటే.. ఇదంతా బీజేపీకి అనుకూలంగా, కాంగ్రెస్ ను దెబ్బకొట్టే వ్యూహమన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు ఆలోచింపజేస్తున్నాయని అంటున్నారు.


తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడూ అనేకమంది తనను విమర్శించారని.. అయినా ఓపిగ్గా ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. బీఆర్ఎస్ విషయంలోనూ తొందరేమీ లేదంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనే దేశంలో అధికారంలోకి వచ్చేయాలని అనుకునేంత అమాయకుడేమీ కాదాయన. మరి, ఎన్నాళ్లని ఓపిగ్గా రాజకీయం చేస్తారు? ఎంత డబ్బున్నా ఎందాక పార్టీని లాగగలరు? మీద పడుతున్న వయసు, ఆరోగ్యం మాటేంటి? మోదీ పోతే యోగి వస్తారని.. ఇక భారతదేశం తమదేనని ధీమాగా ఉన్న కమలనాథులను.. ఢిల్లీ గద్దె దించడం కేసీఆర్ కు సాధ్యమవుతుందా? ఆయన శక్తి సరిపోతుందా?

దేశంలో బీజేపీకి పోటీ ఎవరంటే ఆప్ అనే అంటారు ఉత్తరాది వారు. మోదీకి కేజ్రీవాలే కరెక్ట్ ప్రత్యర్థని చెబుతుంటారు. కేజ్రీవాల్ తర్వాత కాస్తోకూస్తో నేషనల్ వైడ్ పాపులారిటీ ఉన్నది మమతా బెనర్జీకే. ఇక, బీహార్ బాద్షా నితీష్ కుమార్ తనకు ప్రధాని పీఠంపై మక్కువ లేదని ఇప్పటికే చెప్పేశారు. వారందరినీ కాదని దేశప్రజలు కేసీఆర్ కు ఎందుకు జై కొట్టాలి? కనీసం పక్క రాష్ట్రంలోనైనా పునాదులు లేని, తెలంగాణలోనూ పక్కాగా గెలుస్తామనే నమ్మకం లేని బీఆర్ఎస్.. కేసీఆర్ ను ఢిల్లీ సుల్తాన్ చేయగలదా? కనీసం ఆప్ మాదిరి జాతీయ పార్టీగా గుర్తింపైనా సాధించగలదా? యాగ ఫలితం ఎప్పటికి దక్కేను? ఇలా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related News

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Big Stories

×