EPAPER

Rain Alert For Telangana: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు

Rain Alert For Telangana: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు

Rain Alert For Telangana: తెలంగాణ వ్యాప్తంగా వర్ష ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చాలా ప్రాంతాలు వర్షాలు, వరదలతో అతలాకుతలం కాగా.. మరోసారి భారీవర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వివిధ జిల్లాల్లో పింక్‌, రెడ్‌, గ్రీన్ అలెర్ట్ జారీ చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో వర్షాలు పడి.. ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరోసారి అలాంటి సంకేతాలు ఉన్నాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ చెబుతోంది.


కుమరంభీమ్ అసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, భూపాలపల్లి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ములుగు, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు IMD చెబుతోంది. ఈ జిల్లాల్లో పింక్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ప్రభుత్వం కూడా ఆయా ప్రాంతాల్లో అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. ఆదిలాబాద్‌, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లోనూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్‌, సిద్ధిపేట, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి, నల్గొండ, వికారాబాద్, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

మహబూబ్‌నగర్‌, నారాయణ్‌పేట్‌, వనపర్తి, నాగర్‌ కర్నూలు, గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలకు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. IMD హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పింక్‌ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశంతో పాటు వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రెడ్‌ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని IMD చెబుతోంది.


Also Read: తెలుగు రాష్ట్రాలకు వరద సాయం.. మేము సైతమంటూ నటుడు చిరంజీవి.. చెరో

కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలతో అతలాకుతంలం చేసిన వాయుగుండం.. అల్పపీడంనంగా మారి ఉత్తర తెలంగాణ, దక్షిణ మధ్రప్రదేశ్ పై కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. వీటి ప్రభావంతో మరో 3 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని IMD చెబుతోంది.

మిగతా జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈరోజు కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అవసరమైతే తప్పా బయటకు రావద్దని అధికారులు సూచించారు. భారీ వర్షాలకు తోడుగా ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×