EPAPER

jagital: మంత్రగాళ్లారా.. తస్మాత్ జాగ్రత్త.. చంపేస్తున్నాం.. పోస్టర్ల కలకలం!

jagital: మంత్రగాళ్లారా.. తస్మాత్ జాగ్రత్త.. చంపేస్తున్నాం.. పోస్టర్ల కలకలం!

We are killing The confusion of posters in jagital dist: ‘మంత్రగాళ్లారా.. తస్మాత్ జాగ్రత్త! మంత్రాలు చేసిన వారిని ఒక్కొక్కరిని చంపేస్తున్నాం’ అంటూ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు గోడలపై రాస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేసేవారు. తాజాగా, ఏకంగా పోస్టర్లను ప్రింట్ చేసి మరి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో గందరగోళం నెలకొంది.


వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో మంత్రాలు చేస్తే చంపేస్తామంటూ ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిలాఫలకానికి మంత్రాలు చేసేవాళ్లను హెచ్చరిస్తూ వాల్ పోస్టర్లు అంటించారు. అయితే తొలుత ఈ పోస్టర్లు గ్రామంలో ఇద్దరు వ్యక్తులతో ప్రారంభంమైంది. ఇప్పుడెమో మిగతా వాడలకు పైతం పాకిపోయింది. ఇకనుంచి మంత్రాలు చేసే వారందరినీ చంపేస్తామంటూ వాల్ పోస్టర్‌లో ఎరుపు రంగు అక్షరాలతో రాసి అంటించారు.

అయితే ఈ వాల్ పోస్టర్లు చూసిన గ్రామస్తులు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రామంలో ఎక్కడ చూసిన ఇదే చర్చ కొనసాగుతోంది. ఈ పోస్టర్లు ఎవరూ పెట్టారనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సరిగ్గా రెండున్నర ఏళ్ల క్రితం జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ గ్రామంలో ఓ 8 మంది మాంత్రికలను హెచ్చరిస్తూ ఏకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఈ విషయంపై ఏకంగా పోలీసులు సైతం ఆరా తీశారు.


ఆకాశానికి రాకెట్ పంపుతున్న ఆధునిక యుగంలో మంత్రాలు, చేతబడులు పూర్తిగా మూఢనమ్మకమని ఇలాంటి సున్నితమైన విషయాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అతిగా రియాక్ట్ కాకూడదని విజ్ఞాన వేదిక సభ్యులు చెబుతున్నారు. అయితే మంత్రగాళ్లు అంటూ ఎవరూ లేరని చెప్పారు. ఇలా చెప్పడం ఏంటో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.

Also Read: నేవీ రాడార్ కేంద్రంపై రచ్చ.. కేటీఆర్‌పై మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం.. కేసీఆర్ వద్ద ఆందోలన చేయి..

ఈ పోస్టర్ లో మంత్రగాళ్లను ఒక్కొక్కరిని చంపుతామని, ప్రజలకు మంచి చేయాలనే రాసినట్లు తెలుస్తోంది. కానీ ఇది మంచి పరిణామం కాదని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది అమాయకప్రజలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోస్టర్లకు సంబంధించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది కావాలని చేశారా? టార్గెట్ చేస్తున్నారా? అనే కోణంలో విచారిస్తున్నారు.

Related News

Kiran Kumar on KTR: పదేళ్లలో భారీ బిల్డింగ్స్ కట్టుకున్నారు.. అప్పుడు కనిపించలేదా.. కేటీఆర్ కు ఎంపీ సూటి ప్రశ్న

IAS officers: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల పిటిషన్.. మళ్లీ వాయిదా.. తీరని ఉత్కంఠ!

TSPSC Group 1: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్ కొట్టివేత!

Kishan Reddy on BRS: నేవీ రాడార్ కేంద్రంపై రచ్చ.. కేటీఆర్‌పై మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం.. కేసీఆర్ వద్ద ఆందోళన చేయాలంటూ..

Damodar Raja Narasimha: బీఆర్ఎస్‌పై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం.. పదేళ్లలో ఏం చేశారు? కాగితాలకే పరిమితమా?

Brs Approved For Radar Station : అప్పట్లోనే రాడార్ స్టేషన్’కు బీఆర్ఎస్ అనుమతి… ఇప్పుడేమో ?

Big Stories

×