EPAPER

Warangal : రెండో రాజధానిగా వరంగల్ – మాస్టర్‌ ప్లాన్‌పై మెుదలైన కసరత్తులు?

Warangal : రెండో రాజధానిగా వరంగల్ – మాస్టర్‌ ప్లాన్‌పై మెుదలైన కసరత్తులు?

Warangal :


⦿ రెండో రాజధానిగా వరంగల్?
⦿ మాస్టర్‌ ప్లాన్‌పై కసరత్తులు
⦿ విజన్ 2050తో ముందుకెళ్తున్న ప్రభుత్వం
⦿ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు
⦿ ఎయిర్ పోర్ట్, ఎకో టూరిజం
⦿ అన్నింటిపైనా ఫోకస్ చేసిన రేవంత్ సర్కార్

హైదరాబాద్, స్వేచ్ఛ : తెలంగాణలో రెండో రాజధాని ఏదంటే, ఎవరైనా వెంటనే వరంగల్ అని చెప్పేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మాదిరిగా వరంగల్, హన్మకొండ కలిసిపోయి విస్తరిస్తున్నాయి. పైగా, కాకతీయులు ఏలిన చారిత్రక నగరం కావడంతో భౌగోళికంగా కూడా వరంగల్ ఎంతో స్పెషల్. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సీఎం దీనిపై అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రణాళికలు రచించాలని చెప్పారు. ఈ క్రమంలోనే వడివడిగా అడుగులు పడుతున్నాయి.


విజన్ 2050

చారిత్రక నేప‌థ్యం ఉన్న వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దికి భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా విజన్ 2050తో ముందుకెళ్తోంది ప్రభుత్వం. అప్పటి జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మాస్ట‌ర్ ప్లాన్ కూడా తుది దశకు చేరుకుంది. త్వ‌ర‌లోనే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మాస్ట‌ర్ ప్లాన్‌ను విడుద‌ల చేయనున్నారు. దీనికి సంబంధించి వ‌రంగ‌ల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్‌డీలో వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ జిల్లాల‌ అభివృద్ది కార్య‌క్ర‌మాల‌పై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్ర‌భాక‌ర్‌, ఆయా జిల్లాల ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో నూత‌న మాస్ట‌ర్ ప్లాన్, వ‌రంగ‌ల్ ఇన్న‌ర్ రింగ్ రోడ్‌, ఔట‌ర్ రింగ్ రోడ్‌, భ‌ద్ర‌కాళి టెంపుల్ అభివృద్ది, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజ్‌, మెగా టెక్స్‌టైల్ పార్క్‌, మామునూరు ఎయిర్‌ పోర్ట్, ఎకో టూరిజం త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించారు.

అభివృద్ధి పనుల వేగవంతం

హైద‌రాబాద్ న‌గ‌రానికి ధీటుగా వరంగ‌ల్‌ను అభివృద్ది ప‌ర‌చాల‌న్న కృత‌నిశ్చ‌యంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక దృష్టి సారించార‌ని అన్నారు పొంగులేటి. ఎన్నో సంవ‌త్స‌రాలుగా పెండింగ్‌లో ఉన్న వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్‌ను త‌మ ప్ర‌భుత్వం కొలిక్కి తీసుకువచ్చింద‌ని చెప్పారు. అభివృద్ది ప‌నుల్లో వేగం పెంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇన్న‌ర్ రింగ్ రోడ్, ఔట‌ర్ రింగ్ రోడ్‌కు అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 41 కిలోమీట‌ర్ల ప‌రిధి ఉన్న వ‌రంగ‌ల్ ఔట‌ర్ రింగ్ రోడ్డును మూడు ద‌శ‌ల్లో చేప‌ట్టాల‌ని మొద‌టి ద‌శ‌లో 20 కిలో మీట‌ర్లు, రెండ‌వ ద‌శ‌లో 11 కిలోమీట‌ర్లు, మూడ‌వ ద‌శలో 9 కిలోమీట‌ర్లు చేప‌ట్టాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు.

త్వరలోనే ఎయిర్‌పోర్ట్ పనుల ప్రారంభం

హైద‌రాబాద్ మిన‌హా రాష్ట్రంలో మ‌రెక్క‌డా సరైన ఎయిర్‌పోర్ట్ లేదు. అయితే, వ‌రంగ‌ల్ జిల్లాలో రాబోతోంద‌ని, వీలైనంత త్వ‌ర‌గా ప‌నుల‌ను ప్రారంభించి ఏడాదిలోపు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావ‌డానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు పొంగులేటి. 382 ఎక‌రాల ప‌రిధిలో ఉన్న చారిత్రాత్మ‌క‌మైన భ‌ద్ర‌కాళి చెరువులో పేరుకుపోయిన పూడిక‌ను తీయాల‌ని, ఇందుకు సంబంధించిన ప‌నుల‌ను వెంటనే మొద‌లు పెట్టాల‌ని, ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా చెరువును ఖాళీ చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ఈ చెరువు 40 శాతం గుర్ర‌పుడెక్క‌తో నిండిపోయింద‌న్నారు. మెగా టెక్స్ టైల్‌ పార్క్ లో ఏర్పాటు చేసిన కంపెనీలు త‌ప్ప‌నిస‌రిగా స్దానికుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప‌నుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

ALSO READ : తెలంగాణ కుల సర్వే దేశానికి ఓ దిక్సూచీ.. రాహుల్ ఆసక్తికర కామెంట్లు..

Related News

Sridhar Babu on BRS: బీఆర్ఎస్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఈ ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముందా అంటూ సవాల్, ఏం అడిగారంటే?

Revanth Speech : రాహుల్ గాంధీ మాటే.. మాకు శాసనం.. చెప్పాం అంటే చేసి చూపిస్తాం

Rahul In HYD : తెలంగాణ కుల సర్వే దేశానికి ఓ దిక్సూచీ.. రాహుల్ ఆసక్తికర కామెంట్లు..

Rahul Gandhi : రాష్ట్రానికి చేరుకున్న రాహుల్.. కులగణన పై కీలక మీటింగ్..

Viral News: నేనే పరమశివుడిని.. ఆరడుగుల గొయ్యి త్రవ్వండి.. పూనకంతో ఊగిన బాలుడు.. ఎక్కడంటే?

Caste Census Survey: బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే

Big Stories

×