EPAPER

AP Voters Returns to Hyderabad: హైదరాబాద్ బాట పట్టిన ఓటర్లు.. రహదారుల్లో వాహనాల రద్దీ!

AP Voters Returns to Hyderabad: హైదరాబాద్ బాట పట్టిన ఓటర్లు.. రహదారుల్లో వాహనాల రద్దీ!

AP Voters Returning to Hyderabad: హైదరాబాద్ కు వచ్చే రహదారుల్లో భారీగా వాహనాల రద్దీ నెలకొన్నది. ఓటు వేసేందుకు సొంతూర్లకు వెళ్లిన ఓటర్లు, ఓట్లు వేసి తిరిగి హైదరాబాద్ కు పయనమవుతున్నారు. సోమవారం సాయంత్రం నుంచే ఈ రద్దీ మొదలు కాగా మంగళవారం ఉదయానికి మరింతగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ఓటర్లు హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ క్రమంలో పలు టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నది. ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తిరిగి తెలంగాణకు వస్తున్నారు. బస్సులు, కార్లు.. ఇలా ఏ వాహనం దొరికితే ఆ వాహనం పట్టుకుని హైదరాబాద్ కు బయల్దేరి వస్తున్నారు.


అయితే, ఓటు వేసేందుకు నగరం విడిచి సొంతర్లూకు బయల్దేరివెళ్లిన ప్రజలు తిరుగు ప్రయాణమయ్యారు. పోలింగ్ ముగియడంతో మళ్లీ నగరం బాట పట్టారు. ఈ క్రమంలో మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు రహదారులు రద్దీగా మారాయి. ఊరెళ్లిన ఓటర్లు తిరుగుప్రయాణవ్వడంతో రద్దీగా మారాయి. ఏపీ నుంచి హైదరాబాద్ కు పెద్ద సంఖ్యలో ఓటర్లు రిటర్న్ అవుతుండడంతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు తెలుస్తోంది.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఏ బస్టాండులోకి హైదరాబాద్ వైపు ఏ బస్సు వచ్చినా ఎక్కి నగరానికి వస్తున్నారు. భారీగా ప్రయాణికులు వస్తుండడంతో హైదరాబాద్ వైపు వచ్చే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి వస్తున్నాయి. దీంతో ఏ బస్సు చూసినా ప్రయాణికులతో నిండుగా కనిపిస్తోంది. అటు ప్రైవేట్ వాహనాలు, ట్రావెల్స్ బస్సులు, వాహనాలు కూడా ప్రయాణికులతో నిండుగా కనిపిస్తూ ఉన్నాయి. సొంత వాహనాలు ఉన్నవాళ్లు వారి వారి వాహనాల్లో నగరానికి బయల్దేరి వస్తున్నారు. ఈ క్రమంలో రహదారుల్లో భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది.


Also Read: డిప్యూటీ సీఎం మాట, పోలీసులు పట్టించుకోవట్లేదట..

ఇటు తెలంగాణలో కూడా పలు టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు తెలుస్తోంది. మూడురోజులపాటు వరుస సెలవులు రావడంతో ప్రజలు పట్నం నుంచి పల్లెబాట పట్టారు. ఈ క్రమంలో నగరంలోని రోడ్లన్నీ రెండు రోజులుగా నిర్మానుష్యంగా కనిపించాయి. కేవలం సంక్రాంతి పండుగ సమయంలోనే కనిపించే దృశ్యాలు మళ్లీ కనిపించాయి. ఇప్పుడు ఓటర్లంతా హైదరాబాద్ వైపు ప్రయాణం కావడంతో రోడ్లన్నీ మళ్లీ సందడి సందడిగా కనిపిస్తున్నాయి.

Tags

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×