EPAPER

Yadadri Power Plant : యాదాద్రి పవర్ ప్లాంట్.. అంచనాలు డబుల్.. అవినీతి లెక్కలు తేల్చే పనిలో విజిలెన్స్..

Yadadri Power Plant : ప్రతి పనిలో అవినీతి. డబుల్‌ అయిన అంచనాలు. తెలంగాణను వెలుగుల రాష్ట్రంగా తీర్చిదిద్దుతామంటూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేల కోట్లతో మొదలుపెట్టిన యాదాద్రి సూపర్‌ క్రిటికల్‌ అల్ట్రా థర్మల్‌ పవర్ ప్లాంట్ అభాసుపాలైంది.

Yadadri Power Plant : యాదాద్రి పవర్ ప్లాంట్.. అంచనాలు డబుల్.. అవినీతి లెక్కలు తేల్చే పనిలో విజిలెన్స్..
This image has an empty alt attribute; its file name is 02c988e1e2c701afc4dae1df08630f87.jpg

Yadadri Power Plant : ప్రతి పనిలో అవినీతి. డబుల్‌ అయిన అంచనాలు. తెలంగాణను వెలుగుల రాష్ట్రంగా తీర్చిదిద్దుతామంటూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేల కోట్లతో మొదలుపెట్టిన యాదాద్రి సూపర్‌ క్రిటికల్‌ అల్ట్రా థర్మల్‌ పవర్ ప్లాంట్ అభాసుపాలైంది.


నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద గత ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. 2015 జూన్‌ 8న.. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్లాంట్ నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. 4,200 ఎకరాలలో.. 28 వేల కోట్ల వ్యయంతో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టు పనులను 2017 అక్టోబర్ 17న జెన్కో ప్రారంభించింది. నిర్మాణ బాధ్యతలను BHELకు అప్పగించింది.

పనులలో తీవ్ర జాప్యం జరగటంతో నిర్మాణ వ్యయం రెట్టింపు అయ్యి.. 56 వేల కోట్లకు చేరుకుంది. బీహెచ్‌ఈఎల్‌ చేపట్టిన ప్లాంటు ప్రధాన పనులను ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే పూర్తి చేసినట్లు సమాచారం. అంచనా వ్యయానికి ఇప్పటికి 80 శాతం నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. అయితే వెచ్చించిన వ్యయం వివరాలను ఇప్పటివరకు జెన్‌కో అధికారులు వెల్లడించిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు.


మరోవైపు.. విద్యుత్‌ బాయిలర్ల నిర్మాణాలు,ఇతరత్రా పనుల కోసం సుమారు 20 వేల కోట్ల విలువైన టెండర్లను జెన్‌కో అధికారులు తమకు అనుకూలమైన సంస్థలకే వచ్చే విధంగా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్లాంటు నిర్మాణం కోసం కావలసిన భూసేకరణ విషయంలో కూడా పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. 2015 నుంచి 2023 వరకు భూనిర్వాసితులకు 100 కోట్ల మేర చెల్లించారు. ఈ చెల్లింపులపై కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు.

యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై నూతన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకోనిరావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయటంతో విజిలెన్స్‌ బృందం విచారణ చేపట్టింది.

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×