EPAPER

Vegetable Prices: సామాన్యుడిపై మరో భారం.. సెంచరీ చేరువలో ఉల్లి, టమాట

Vegetable Prices: సామాన్యుడిపై మరో భారం.. సెంచరీ చేరువలో ఉల్లి, టమాట

Vegetable Prices Hike: సామాన్యుడిపై మరో భారం పడింది. పండుగ వేళ మార్కెట్‌లో కూరగాయాల ధరలు ఆకాశన్నంటాయి. గత కొంతకాలంగా ఉల్లి ధరలు పెరుగుతుండగా.. తాజాగా, టమాట ధరలు సైతం ఒక్కసారిగా చుక్కలనంటాయి. ఎక్కడ చూసినా కిలో టమాట ధర రూ.80కంటే తక్కువగా దొరకడం లేదు. రెండు రోజుల క్రితం రూ.50లోపు ఉన్న ధర ఇప్పుడు ఒక్కసారిగా డబుల్ అయిపోయాయి.


అసలే పండగ సీజన్ కావడంతో పాటు ఆపై ధర పెరిగిపోవడంతో ఏం తినాలోనని వాపోతున్నారు. టమాట లేనిదే దాదాపు ఎవరింటిలోనూ కూడా వంట పూర్తి కాదు. వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏం వండినా టమాట ఉంటే ఆ వంటకానికి అదనపు రుచి వస్తుంది. కుటుంబానికి సరిపడేలా వంటకం పూర్తి అవుతుంది.

ఇప్పుడు టమాట వందకు చేరుకోవడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. కొందరు చింతపండును వినియోగిస్తుంటే.. మరికొందరు నిమ్మకాయలతో సరిపెట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వాతావరణ పరిస్థితులకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. అక్కడ పండించే పంట పూర్తిగా నాశనమైపోయింది. అక్కడి దిగుబడి పూర్తిగా పడిపోయింది.


అయితే, మదనపల్లిలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చే టమాట ఒక్కసారిగా తగ్గిపోవడంతో పరిస్థితి మారిపోయింది. మొన్నటివరకు రూ.50 వరకు ఉండే టమాట ధరలు ఇప్పుడు ఏకంగా రూ.100కు చేరువవుతున్నాయి. కాగా, ఉల్లిగడ్డల ధరలు కూడా ఆ స్థాయిలోనే కనిపిస్తున్నాయి.

Also Read: నేతన్నలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం… దసరా కానుకగా మీకు…

మహారాష్ట్ర నుంచి సరిపడా సరకు రాకపోవడంతో ఉల్లి రేటు పెరిగిపోతోంది. అది కూడా క్వాలిటీ ఉండటం లేదన్నది వినియోగదారులు చెబుతున్నారు. వర్షాలు, వరదలకు ఇతర రాష్ట్రాల్లో టమాట, ఉల్లి దిగుమతులు తగ్గడంతో ఏపీ, తెలంగాణలో డిమాండ్ ఏర్పడింది.

Related News

Where is KCR and Kavitha: కవిత, కేసీఆర్‌కి ఏమైంది ? బీఆర్ఎస్‌లో ఆందోళన

Heavy Rain: బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Minister Seethakka: వారి మరణానికి కారణం మీరు కాదా..? : ప్రధాని మోదీకి మంత్రి సీతక్క కౌంటర్

Scircilla: నేతన్నలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం… దసరా కానుకగా మీకు…

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

CM Revanth Reddy: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి

×