EPAPER

Uttam Kumar: కేసీఆర్ తనకు తానే ఆర్కిటెక్ట్ అనుకుని కట్టిన ప్రాజెక్ట్ ఇదీ.. అందుకే ఇంత నష్టం

Uttam Kumar: కేసీఆర్ తనకు తానే ఆర్కిటెక్ట్ అనుకుని కట్టిన ప్రాజెక్ట్ ఇదీ.. అందుకే ఇంత నష్టం

Kaleshwaram Project: నేషనల్ డ్యామ్ సేఫ్టీ కార్యాలయంలో ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై సుదీర్ఘ సమీక్ష జరిగింది. సోమవారం ఇంజినీర్ల స్థాయిలో ఈ చర్చల మళ్లీ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ టెస్టులు చేయకుండా బ్యారేజీలు కట్టేశారని విమర్శించారు. ప్రపంచంలో ఏ బ్యారేజీలో కూడా 3 నుంచి 4 టీఎంసీల కంటే ఎక్కువ నీరు స్టోరేజీలో పెట్టరని వివరించారు. కానీ, కేసీఆర్ తనకు తాను ఆర్కిటెక్ట్ అనుకుని 16 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా బ్యారేజీలు కట్టారని తెలిపారు. బేసిక్ ఫౌండేన్‌లోనే ఇంత పెద్దు తప్పు జరిగిందని, కాబట్టి, ఇంత నష్టం తలెత్తిందని చెప్పారు.


గత ప్రభుత్వంలో చాలా అట్టహాసంగా, ఆర్భాటంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని అనుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులో కొన్ని పనులు అప్పటికే ప్రారంభమయ్యాయని, కానీ, రీ డిజైన్ పేరుతో ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ పైసలు వస్తాయన్న దురుద్దేశంతో తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని పనులు ప్రారంభించారని వివరించారు. కాళేశ్వరం కట్టింది కమీషన్ల కక్కుర్తి తప్ప మరొకటి కాదని తాము మొదటి నుంచి చెబుతున్నామని, రూ. లక్ష కోట్ల ప్రజా ధనం, అందులో ఎక్కువ భాగం అధిక వడ్డీతో రుణాలు తీసుకుని ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. ఇంత ఖర్చు పెట్టినా కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా రాలేదని, ఐదేళ్లపాటు మొత్తం లెక్కలు చూస్తే.. కాళేశ్వరంలో మొత్తం పంప్ చేసిన నీళ్లు 65 టీఎంసీలు అని, ఏడాదికి సగటున 13 టీఎంసీల నీరు అని వివరించారు.

తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే విద్యుత్ కోసం ఏడాదికి రూ. 1,000 కోట్ల ఖర్చయ్యేదని, కానీ, కాళేశ్వరం దగ్గర పంపులు అన్నీ ఆపరేట్ చేస్తే ఏడాదికి రూ. 10 వేల కోట్లు అవుతుందని మంత్రి వివరించారు. వడ్డీకి రూ. 15 వేల కోట్లు, విద్యుత్ ఖర్చు రూ. 10 వేల కోట్లు అయ్యేలా ఆ ప్రాజెక్టు రూపొందించారని తెలిపారు.


Also Read: సినిమా లవర్స్‌కు షాక్.. మూవీ టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై సెస్ బాదుడు

వాళ్లు కట్టిన ప్రాజెక్టు వాళ్ల హయాంలోనే కూలిపోయిందని, ఫౌండేషన్ ఆరు అడుగుల లోతుకు దిగిపోయిందని మంత్రి చెప్పారు. 40 రోజులపాటు కేసీఆర్ ఈ అంశంపై నోరు కూడా మెదపలేదని వివరించారు.

ఎంతమేర మరమ్మతు పనులు పూర్తయితే అంత మేరకు వినియోగించుకోవాలని చూస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రౌండింగ్, ఫౌండేషన్ పటషం చేయడం సహా వారు సూచించిన మరకు సవరణలు చేశఆమని వివరించారు. ఆ మూడు బ్యారేజీల్లో అన్ని గేట్లు ఎత్తి నీళ్లు పూర్తిగా వదిలేయాల్సిందిగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని తెలిపారు. మేడిగడ్డలో ఒక గేటు ఎత్తడం కుదరకపోతే.. కట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఉన్న బ్యారేజీల నుంచి ఎంతమేర తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఉంటుందో.. అంత మేర ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నామని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో ఉన్న నిపుణులకు కేటీఆర్ కంటే ఎక్కువ పరిజ్ఞానం ఉందని భావిస్తున్నామని చురకలంటించారు.

Tags

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×