EPAPER

UPSC: యూపీఎస్సీలోనూ ఆగమాగం!.. TSPSCలా దొందుదొందేనా?

UPSC: యూపీఎస్సీలోనూ ఆగమాగం!.. TSPSCలా దొందుదొందేనా?
upsc

UPSC: దేశంలో అత్యంత పకడ్భందీగా నిర్వహించే పరీక్ష UPSC సివిల్స్. సుమారు వెయ్యి పోస్టులకు ఏటా లక్షల మంది పరీక్షలు రాస్తారు! ఈ కలను కొంతమందే సాకారం చేసుకుంటారు! మరి ఇలాంటి పరీక్షలో తప్పు దొర్లితే ఎలా? ఇప్పుడు ఇదే ప్రశ్న హాట్‌ టాపిక్‌ అయింది. ఏకంగా ఇద్దరికి ఒకే ర్యాంకు వచ్చింది.


మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఆయేషా ఫాతిమా, మక్రాణికి 184వ ర్యాంక్ వచ్చింది. దాంతో ఈ ర్యాంకు తనదంటే తనది అంటూ ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. ఇద్దరు పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కారు. యూపీఎస్సీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. 184 ర్యాంకు వచ్చిందని ఎవరికి వాళ్లు సంతోష పడుతున్న టైంలో తన లాంటి ర్యాంకే వేరే వాళ్లకు ఉందని తెలిసి ఆందోళన చెందుతున్నారు. అసలు తాము సంతోషపడాలో బాధ పడాలో తెలియని అయోమయంలో ఉన్నారు.

ఈ వ్యవహారం కాంట్రవర్సీగా మారడంతో.. ఇద్దరి అడ్మిట్‌ కార్డులను బయటపెట్టారు. అయితే ఇందులో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయ్. ఫాతిమాకు పర్సనాలిటీ టెస్ట్‌ 2023 ఏప్రిల్‌ 25న జరిగింది. ఆ రోజు మంగళవారం రాసి ఉంది. మక్రాణి కార్డులో చూస్తే మాత్రం డేట్ అదే ఉంది. కానీ వారం మాత్రం గురువారం చూపిస్తోంది. వాస్తవంగా క్యాలెండర్ చూస్తే మాత్రం ఏప్రిల్ 25న మంగవారం పడింది. ఫాతిమా కార్డుపై వాటర్‌మార్క్, క్యూఆర్ కోడ్‌ కూడా ఉంది. మక్రాణి కార్డు మాత్రం తెల్లకాగితంపై ప్రింట్ తీసింది స్పష్టంగా కనిపిస్తోంది. తప్పు ఎక్కడ జరిగిందో ఎంక్వయిరీ చేస్తున్నామని అంటున్నారు అధికారులు.


UPSC పరీక్ష అంటేనే ఎంతో పకడ్భందీగా నిర్వహిస్తారు…! మరి ఇలాంటి పరీక్షలో ఇప్పుడు తప్పుదొర్లడం.. చర్చనీయాంశంగా మారింది. ఇద్దరికి ఒకే ర్యాంకు రావడం టెక్నికల్‌ ప్రాబ్లమా? లేదా అధికారుల నిర్లక్ష్యమా? అసలు ఏం జరిగిందనే దానిపై సమాధానం చెప్పడం లేదు యూపీఎస్సీ అధికారులు. ఫలితాలు విడుదలై.. మూడు రోజులు అవుతున్నా.. ఇద్దరికి ఒకే ర్యాంకు ఎలా కేటాయించారో చెప్పలేదు.

ఇప్పటికే పరీక్ష పేపర్ల లీకేజీతో TSPSC అట్టర్‌ఫ్లాప్ అయింది. చేతగాని కమిషన్ అంటూ ప్రతిపక్షాలు, నిరుద్యోగులు దుమ్మెత్తిపోస్తున్నాయి. బాధ్యత వహించి మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. యూపీఎస్సీలా టీఎస్‌పీఎస్సీని పటిష్టపరిచాలనే సూచనలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో యూపీఎస్సీలోనే ఇలా ర్యాంకుల గగ్గోలు జరగడంతో.. ఇక కమిషన్లు అంటేనే ఇంతేనా? అనే అసహనం ఏర్పడుతోంది. టీఎస్‌పీఎస్సీ వైఫల్యాలకు కేసీఆర్ సర్కారుదే బాధ్యత అంటున్నప్పుడు.. మరి, యూపీఎస్సీ ఫెయిల్యూర్‌కు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా?

Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×