Uppal Warangal Highway Elevated Corridor Car Damage: హైదరాబాద్ మహానగరంలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల వద్ద రోడ్డు కుంగుబాటుకు గురైంది. దీని కారణంగా ఉప్పల్ రింగ్‌రోడ్డు నుండి వరంగల్ వైపుగా వెళ్లే వాహనదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.నిత్యం రద్ధీగా ఉండే ఈ దారి గుండా నిత్యం వేల వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి.కొన్ని వాహనాలు అయితే ఆ గుంతలో పడి చాలామట్టుకు ధ్వంసమయ్యాయి. అంతేకాదు ఈ కారిడార్ రోడ్డు మధ్యలో నిర్మాణం చేపడుతున్నారు. అంతేకాదు ఈ నిర్మాణంలో ఉన్న పిల్లర్ల గుంతలలోకి భారీ స్థాయిలో మట్టి కూరుకుపోయి.. రోడ్డు పక్కన భారీ గుంతలు ఏర్పడ్డాయి.
దీంతో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ రోడ్డు కుంగడంతో స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ వైపు వెళ్లేందుకు ఈ రోడ్డు మార్గమే ప్రధానం కాబట్టి అటుగా రోడ్డు విస్తరణ పనులు ఓ వైపు.. ఫిల్లర్ల నిర్మాణ పనులు మరోవైపు కొనసాగుతుండటంతో రోడ్డుపై వెళ్లే వాహనాదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు ఈ ఘటనలో ఒక కారు రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోవడంతో గుంతలో కారు దిగబడింది.దీంతో వాహనదారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యి అందరూ ఒక్కసారిగా ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు.అంతేకాదు ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసి వాహనదారులకు విముక్తి కలిగించాలని అటుగా వెళ్లే వాహనదారులు కోరుకుంటున్నారు. అంతేకాదు ఈ నిర్మాణం వల్ల ఏర్పడిన గుంతలను పూడ్చడానికి వరంగల్ హైవేపై రెండు వైపుల కొత్తగా బీటీ రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం ఫండ్స్ సమకూర్చగా..ఈ నిర్మాణం పూర్తయితే వరంగల్ వైపు వెళ్లే వాహనదారులకు మార్గం సులభం కానుంది.
Also Read: అరుదైన శస్త్ర చికిత్స, బాలుడికి తోకని తొలగించిన ఎయిమ్స్ వైద్యులు
ఈ నిర్మాణం 2020 జూలైలో కంప్లీట్ కావాల్సి ఉండగా గుత్తేదారు సంస్థ కొన్నికారణాల మూలంగా దివాలా తీసింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు కష్టాలు పడుతున్నారు.ఆర్ అండ్ బీ అధికారులు సైతం ఈ రోడ్డు మార్గానికి మరమ్మత్తులు చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో రద్ధీగా ఉండే ఈ రోడ్డు ఇంకా ఇరుకుగా మారింది. అంతేకాకుండా ఈ రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్షాల కారణంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ మళ్లీ మొదటికి వచ్చాయి. ఈ వంతెన నిర్మాణం కోసం ఏకంగా రూ. 6 వందల కోట్లు పనిని..రూ. 450 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని ఎల్‌వన్ గా నిలిచిన గుత్తేదారు సంస్థ దివాలా తీసిందన్న రూమర్స్ రావడంతో ఈ వ్యవహారం కాస్త అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈ నిర్మాణాన్ని రాబోయే 6-7 నెలల్లో కంప్లీట్ చేస్తామని కాంట్రాక్టర్ తెలపగా ఇంకా ఎన్ని నెలలు అయినా ఈ నిర్మాణం కంప్లీట్ కాదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.