EPAPER

Shivraj singh Chauhan: తెలంగాణ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం..

Shivraj singh Chauhan: తెలంగాణ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం..

Union Minister Shivraj singh Chauhan visits flood effected areas: మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివారజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం పరిసరాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తో కలిసి ఆయన వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తరువాత ఖమ్మంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శివరాజ్ సింగ్ పాల్గొని మాట్లాడారు. వరద బాధితులకు కేంద్రం అండగా నిలిస్తదంటూ ఆయన హామీ ఇచ్చారు.


Also Read: తీవ్ర విషాదం.. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

భారీ వరదలతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వరదలు ముంచెత్తి రైతులు సర్వం కోల్పోయారు. నిజంగా వారిని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే చాలా బాధేస్తుంది. సంక్షోభ పరిస్థితుల్లో వారికి కేంద్రం అడంగా నిలుస్తది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నిధులను దారి మళ్లించింది. ఎస్ డీఆర్ఎఫ్ నిధులను సరిగ్గా వినియోగించుకోలేదు. నేను రాజకీయాలు చేసేందుకు ఇక్కడికి రాలేదు.. రైతులను ఆదుకునేందుకే ఇక్కడికి వచ్చాను. నేను కూడా ఒక రైతునే.. అందువల్ల నాకు కూడా రైతుల కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. ఏరియల్ సర్వేతో వరద ప్రభావిత ప్రాంతాలను పూర్తిగా పరిశీలించాను. వరదల కారణంగా వరి, ఇతర పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులు చూడలేదు. పశువులు, ఇతర మూగ జీవులు ప్రాణాలు కోల్పోయాయి. వరద సమయంలో రాజకీయాలు వద్దు. కేంద్ర ప్రభుత్వం తరఫున వరద బాధితులకు భరోసాగా ఉంటాం’ అని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.


Also Read: కేసీఆర్ మహాయాగం.. ఈసారి కుటుంబం కోసమా? ప్రజల కోసమా?

ఇదిలా ఉంటే.. భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో పంట నష్టం భారీగా వాటిల్లింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నష్టం ఎక్కువగా వాటిల్లింది. మున్నేరు ఉధృతికి ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇటు మహబూబాబాద్ జిల్లా కూడా అతలాకుతలమైంది. వరదలు జిల్లాను మంచెత్తడంతో వరద బాధితులు సర్వం కోల్పోయారు. రైతులు కూడా భారీగా నష్టపోయారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో కేంద్రమంత్రు శివరాజ్ సింగ్, బండి సంజయ్ పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఖమ్మంలో కేంద్ర మంత్రుల పర్యటన కొనసాగింది.

ఇటు ఏపీలోనూ వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తాను వరద నష్టం పరిశీలన చేసేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. రైతులు ఎవరూ కన్నీరు కార్చవద్దు.. కేంద్రప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబుతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆయన కళ్లల్లో నీళ్లు చూశానని చెప్పారు. రైతుల బాధలు తనకు తెలుసనని అన్నారు. వరదల వల్ల పంట మునిగిందన్నారు. అరటి, పసుపు, తమలపాకు, వరి, మినుము పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. వరదల కారణంగా రైతులు సర్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్న విషయం తనకు అర్థమైందని ఆవేదన చెందిన విషయం తెలిసిందే.

Related News

Rajiv Gandhi: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

TGSRTC Special Buses: గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. 600 స్పెషల్ బస్సులు!

BRS Party: నా వల్ల కాదు.. బిడ్డా హ్యాండిల్ చేయు, రెండు వర్గాలుగా చీలిపోయిన బీఆర్ఎస్ పార్టీ?

Big Stories

×