EPAPER

Assistance: ఎట్టకేలకు స్పందించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు భారీ సాయం.. ఎంత ప్రకటించిందంటే?

Assistance: ఎట్టకేలకు స్పందించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు భారీ సాయం.. ఎంత ప్రకటించిందంటే?

Financial Assistance amid Heavy Rains in Telugu States: భారీ వర్షాలు, వరదలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంభించింది. భారీగా నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తాజాగా భారీ సాయాన్ని ప్రకటించింది. వరదలతో తల్లడిల్లుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ భారీ ఎత్తున సాయం చేస్తున్నట్లు తెలిపింది. ఇరు రాష్ట్రాలకు వరద సాయం కింద రూ. 3,300 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.


ఇదిలా ఉంటే.. తెలంగాణ, ఏపీలో ఇటీవల భారీగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా పడింది. ఇటు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, కామారెడ్డి జిల్లాలపై వరదలు భారీగా ప్రభావం చూపాయి. ఇరు రాష్ట్రాల వర్షాలు, వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రూ. వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది.

Also Read: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం.. ఆయన నేపథ్యమిదే


ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా నెలకొన్న పరిస్థితిని వివరించారు. అనంతరం సాయం చేయాలని కోరారు. ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వరదల నేపథ్యంలో సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. అదేవిధంగా ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్పందించిన కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో వరదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, అన్ని వివరాలు తెప్పిచుకుంటున్నామని తెలిపింది. వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర కమిటీ కూడా ఇరు రాష్ట్రాల్లో పర్యటిస్తదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

కాగా, గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. గురువారం ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏరియల్ సర్వే కూడా చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తో కలిసి ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పంటనష్టం, ఆస్తి నష్టం జరిగిన ప్రాంతాలను ఆయన కలియతిరిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం అండగా ఉంటుందని ఏపీకి భరోసా ఇచ్చారు.

Also Read: తెలంగాణ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం..

శుక్రవారం తెలంగాణలో కూడా పర్యటించారు. మధ్యాహ్నం నుంచి తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శివరాజ్ సింగ్ పర్యటించారు. కేంద్రమంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల్లోనూ వరదల ముంచెత్తిన ప్రాంతాలను పర్యటించానన్నారు. ఎంతనష్టం వాటిల్లిందో అనేది, దీంతో ప్రజలు ఎంత ఇబ్బందిపడుతున్నారో అనేది తనకు స్పష్టం అర్థమైందన్నారు. ఇటు రైతులు కూడా భారీగా నష్టపోయారని చెప్పారు. ఒక రైతుగా తను కూడా రైతుల బాధలేంటో తెలుసనని స్పష్టం చేశారు. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు అండగా ఉంటుందంటూ ఆయన హామీ ఇచిచారు.

ఆ తరువాత హైదరాబాద్ లోని సచివాలయానికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన వరద సహాయక చర్యలపై చర్చించారు.

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×