EPAPER

KCR : నాడు ఉద్యమ వీరులు.. నేడు నిరుద్యోగులు.. కేసీఆర్ హామీల సంగతేంటి?

KCR : నాడు ఉద్యమ వీరులు.. నేడు నిరుద్యోగులు.. కేసీఆర్ హామీల సంగతేంటి?

KCR : తెలంగాణ ఉద్యమ సమయంలో అన్నివర్గాలకు కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక ఉద్యోగం అన్నారు. అప్పటికే పట్టభద్రులైన వాళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి, బతుకు తెరువు లేక చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే నిరుద్యోగులందరిలో ఒక ఆశ ఉదయించింది. అంతే ఎక్కడవక్కడ చిన్నా చితకా ఉద్యోగాలు వదిలేసి కట్టుబట్టలతో పల్లెలు, పట్టణాల నుంచి కదిలి తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని వదిలి హైదరాబాద్ సిటీకి చేరుకున్నారు.


మండుటెండల్లో కాళ్లకి చెప్పుల్లేకపోయినా తిరిగారు. వానకి తడిసిపోయారు. ఎక్కడ పడుకున్నారో, ఎలా లేచారో, ఎప్పుడు తిన్నారో తెలీదు. అలా నెలల తరబడి హైదరాబాద్ లో ఉండిపోయారు. కొందరికి ఉస్మానియా యూనివర్శిటీ హాస్టల్స్ అండగా నిలబడితే, మరికొందరికి పబ్లిక్ గార్డెన్స్, ఇందిరా పార్క్, ట్యాంక్ బండ్ లే దిక్కయ్యాయి.

ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులైపోయాయి. పస్తులతో అల్లాడిపోయారు. మాసిపోయిన బట్టలు, పెరిగిన గడ్డంతో రోడ్లపైకి వచ్చి ఉద్యమించారు. ఇలా ఒక్కటి కాదు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పడరాని పాట్లు పడ్డారు. భోజనం చేశావా? అని ఒక్కడు అడిగిన పాపాన పోలేదు.


అలా తెలంగాణ ఉద్యమం కోసం కాళ్లు అరిగేలా తిరిగిన నిరుద్యోగులకు అధికార పీఠమెక్కాక కేసీఆర్ మొండి చేయి చూపించారు. అధికారంలో ఉన్న పదేళ్లలో నోటిఫికేషన్ల సరిగా ఇవ్వలేదు. వయసు మీరిపోయిన నిరుద్యోగులు ఎందరో ఉన్నారు. బీఈడీ చదివిన వారిదైతే మరీ దురదృష్టమని చెప్పాలి. టెట్ రాయడం, దానిని అధికారులు పక్కన పెట్టేయడం, మళ్లీ పెట్టడం, వీరు రాయడం…ఇలా రాస్తుండగానే సగం మంది వయసు దాటి పోయారు.

ఆ రోజున తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు అంటే పదేళ్ల క్రితం 25 నుంచి 35 ఏళ్ల వయసున్నవారు ఎక్కువగా ఉద్యమంలో పాల్గొన్నారు. నేటికి వారి వయసు 35 నుంచి 45కి వెళ్లిపోయింది. అంటే ఒక ఐదేళ్లు ఆగితే ఆఫ్ సెంచరీ కూడా అయిపోతుంది. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. ఏడాదికేడాది ఒకొక్క బ్యాచ్ కింద వారు అవుట్ డేటెడ్ అయిపోతున్నారు. ఈ పాపం కేసీఆర్ దేనని తిట్టిపోస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యను తలకెత్తుకుని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్ని ఉద్యమాలు చేసినా కేసీఆర్ కనికరించలేదు. దీంతో రేవంత్ రెడ్డి నిరుద్యోగ మార్చ్ పేరుతో ర్యాలీలు చేశారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అయినా కేసీఆర్ కనికరించలేదు.

ఈ నేపథ్యంలోనే విద్యార్థులు, నిరుద్యోగులు కలిసి జేఏసీగా ఏర్పడ్డారు. కేసీఆర్ పై పోరాటానికి నడుం బిగించారు. రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి, నిరుద్యోగి కూడా కేసీఆర్ కి ఓటేయకూడదని తీర్మానించారు.  ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగానే కనిపిస్తోంది.

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×