EPAPER

Konda Surekha: మంత్రి కొండా, ఎంపీ రఘునందన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్.. ఒకరు మాజీ సర్పంచ్.. మరొకరు ?

Konda Surekha: మంత్రి కొండా, ఎంపీ రఘునందన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్.. ఒకరు మాజీ సర్పంచ్.. మరొకరు ?

Minister Konda Surekha Trollings Effect: సోషల్ మీడియాతో మంచి ఏమేరకు ఉందో.. ఆ మేరకు చెడు కూడా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో ఎవరినైనా ట్రోలింగ్ చేయడం ఫ్యాషన్ గా మారింది. మహిళలను అయితే మితిమీరి ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే కొంత వరకు ఓకే కానీ హద్దులు దాటితే మాత్రం కటకటాల పాలు కావాల్సిందే. ఇటీవల పలువురు యూట్యూబర్స్ కూడా ఇదే తరహాలో జైలు పాలయ్యారు. తాజాగా మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకు వారెవరిని ట్రోలింగ్ చేశారంటే.. ఏకంగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్ లనే.


గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎంపీ రఘునందన్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా సోదరి భావనతో రఘునందన్.. ఆ సమావేశంలో దండను అందించారు మంత్రి సురేఖకు. దీనితో పార్టీలు వేరైనా సోదర, సోదరీ భావాన్ని చాటిచెప్పిన వీరిని చూసి అక్కడి ఇరు పార్టీల నాయకులు ముచ్చటపడ్డారు. అయితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ కాగా.. కొందరు ఆకతాయిలు ట్రోలింగ్స్ మొదలుపెట్టారు.

ఈ ట్రోలింగ్స్ శృతి మించగా… పలుమార్లు ఎంపీ రఘునందన్ హెచ్చరించారు కూడా. మంత్రి కొండా సురేఖ కామెంట్స్ దేశవ్యాప్తంగా వైరల్ కావడానికి పునాది కూడా ఈ ట్రోలింగ్స్ అనే చెప్పవచ్చు. మంత్రి సురేఖ కూడా ట్రోలింగ్స్ బ్యాచ్ ని వదిలే ప్రసక్తే లేదని కూడా హెచ్చరించారు. ఆ తర్వాత తన ట్రోలింగ్స్ పై మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేయడం, అలాగే అక్కినేని ఫ్యామిలీ వ్యక్తిగత విషయాలను కూడా మంత్రి మాట్లాడడం.. సారీ చెప్పడం.. అదే అంశం కోర్టుల వరకు వెళ్లడం అందరికీ తెలిసిన విషయమే.


Also Read: Delhi Congress Committee: ఇద్దరు మంత్రులకు కీలక భాద్యతలు అప్పగించిన అధిష్టానం.. కారణం అదేనా.. మరేదైనా ఉందా ?

ఈ ట్రోలింగ్స్ ని మాత్రం సీరియస్ గా తీసుకున్నారు ఎంపీ రఘునందన్. స్వతహాగా న్యాయవాదైన రఘునందన్ చట్టబద్దంగా బాధ్యులకు శిక్ష పడాలన్న ఉద్దేశంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ట్రోలింగ్ కారకులు ఎవరనే రీతిలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దశలోనే తాజాగా.. ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫోటోలను అసభ్యంగా ఎడిట్ చేశారని గుర్తించిన పోలీసులు.. ట్రోలింగ్స్ కారకులుగా నిజామాబాద్‌కు చెందిన మాజీ సర్పంచ్‌ దేవన్న, జగిత్యాలకు చెందిన వ్యాపారవేత్త మహేష్‌ లను అరెస్ట్‌ చేశారు. వీరిని న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఏదైనా గీత దాటితే.. తిప్పలు తప్పవనేందుకు ఇదే ఉదాహరణ అంటున్నారు ప్రజలు. అందుకే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు తస్మాత్ జాగ్రత్త సుమా !

Related News

FIR on KTR : మూసీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు… పోలీసులకు ఫిర్యాదు, కేసు పెట్టింది ఏవరంటే ?

TPCC Chief: గాంధీ భవన్‌లో కీలక మీటింగ్.. ఆ ఆపరేషన్ షురూ!

KTR: ఢిల్లీకి మూటలు పంపడమే మీ పనా..? : కేటీఆర్

IAS Officers: క్యాట్‌లోనూ ఆ ఐఏఎస్‌లకు చుక్కెదురు.. వెళ్లిపోవాల్సిందేనంటూ..

CM Revanth Reddy : మరోసారి హస్తీనాకు సీఎం రేవంత్‌రెడ్డి… ఆశావహుల్లో ఉత్కంఠ

MP Aravind: బీఆర్ఎస్‌కు పట్టిన గతే.. మీకూ పడుతుంది: ఎంపీ అరవింద్

Big Stories

×