EPAPER

Minister Tummala: గాంధీభవన్‌లో మంత్రి తుమ్మల ముఖాముఖీ

Minister Tummala: గాంధీభవన్‌లో మంత్రి తుమ్మల ముఖాముఖీ

హైదరాబాద్, స్వేచ్ఛ: రుణమాఫీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూనే ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దసరా తర్వాత రూ. 2 లక్షల పైబడిన రుణాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని వ్యాఖ్యలు సరికాదన్నారు. పది నెలల కాలంలోనే 25 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశామన్నారు.


Also Read: గుడ్ న్యూస్.. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రత్యేక బస్సులు

ప్రాసెస్ లో ఉంది


రుణమాఫీ ఇంకా ప్రాసెస్ లో ఉందని, దసరా తర్వాత రూ. 2 లక్షల పైబడి రుణం ఉన్న వాళ్లపై సమీక్ష జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. రైతులు ఎవరు ఆందోళనలో లేరని, కేవలం అధికారం పోయిన విపక్ష పార్టీకే ఆందోళన ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ చేపట్టిన రైతు వ్యతరేక విధానాలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని ఎద్దేవా చేశారు. రైతులపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీళ్లు కార్చుతున్నారని మండిపడ్డారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల పాటు సాగిన ముఖాముఖీ కార్యక్రమంలో కార్యకర్తలు, నేతలు, ప్రజల నుంచి వచ్చిన 95 ఆర్జీలను మంత్రి తుమ్మల స్వీకరించారు. భూ సమస్యలు, ఉద్యోగాలు, పెన్షన్స్ ,ఇందిరమ్మ ఇల్లు, పలు సమస్యలపై వినతి పత్రాలు వచ్చాయని, కొన్ని సమస్యలపై వెంటనే కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరిస్తున్నమన్నారు. గాంధీ భవన్ కి వస్తే తమ సమస్యలు తీరతాయని ప్రజలు వస్తున్నారని మంత్రి అన్నారు.

Related News

TGSRTC: గుడ్ న్యూస్.. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రత్యేక బస్సులు

Amit Shah: ఆ విషయంలో తెలంగాణ భేష్ : అమిత్ షా

Guidelines: ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం.. అప్లై చేసుకున్నారా?

Hyderabad MP: సచివాలయాన్ని కూడా కూల్చేస్తారా…?

Congress Party: అతి చేస్తున్న ఆ బ్యాచ్.. సీఎం పేరు చెప్పి బిల్డప్!

Pawan Kalyan: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు..?

×