EPAPER

TSPSC Group 1: నిరుద్యోగులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ గ్రూప్‌ 1 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

TSPSC Group 1: నిరుద్యోగులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ గ్రూప్‌ 1 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
TSPSC Group 1 application process
TSPSC Group 1 application process

TSPSC Group 1 application process: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్‌ 1 రిక్రూట్‌మెంట్‌ 2024 దరఖాస్తు ప్రక్రియను ప్రారంభమైంది. తెలంగాణ పీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్ష 2024 మే, జూన్‌లో జరిగే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2024 కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియను కమిషన్ ప్రారంభించింది.


అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కోసం దరఖాస్తును చేసుకోవచ్చు. డిప్యూటీ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారితో సహా మొత్తం 563 ఖాళీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఈ దరఖాస్తులకు అభ్యర్థులందరూ అప్లికేషన్‌ ఫీజూ రూ.200 చెల్లించాలి. పరీక్ష ఫీజు కాకుండా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ దరఖాస్తుదారులందరికీ పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది. 26 ఏప్రిల్ 2022 తేదీ నోటిఫికేషన్ నంబర్ 04/2022 కోసం గతంలో దరఖాస్తు చేసిన, ఫీజు చెల్లించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు.


Read More: విషాదం నింపుతున్న ఓఆర్‌ఆర్.. ఈ రోడ్డులో మృతిచెందిన ప్రముఖులు వీరే..

టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష 2024 పరీక్షా సరళి
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష 2024 ఎంపిక ప్రక్రియలో మూడు రౌండ్‌లు ఉంటుంది. ఇందులో ప్రీ, మెయిన్స్, డాక్యుమెంట్‌ల వెరిఫికేషన్ రౌండ్స్‌ ఉంటాయి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో ఒక పేపర్ ఉంటుంది, దీనిలో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తొలగిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష 2.5 గంటలు, ప్రధాన పరీక్ష పేపర్ 3 గంటల పాటు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ
ముందుగా tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
హోమ్‌పేజీలో ‘కొత్త రిజిస్ట్రేషన్ OTR’ లింక్‌పై క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ తర్వాత.. దరఖాస్తు ఫారమ్ నింపండి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి.
ఇప్పుడు అవసరమైన పత్రాలను సమర్పించి దరఖాస్తు రుసుమును చెల్లించండి
దీని తర్వాత అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తదుపరి సూచన కోసం అప్లికేషన్ కాపీని ప్రింట్ చేయండి.

 

Tags

Related News

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Ram Charan : హాలీవుడ్‌లో అరుదైన గౌరవం… గ్లోబల్ స్టార్ అంటే ఇదే మరీ..!

CID Shakuntala: ఇండస్ట్రీలో విషాదం.. సిఐడి శకుంతల కన్నుమూత..!

Bigg Boss 8: చంద్రముఖిలా మారిన యష్మీ.. ఏడిపించేసిన విష్ణు

Big Stories

×