EPAPER

TS Inter Hall Ticket 2024: నేడు ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TS Inter Hall Ticket 2024: నేడు ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TS Inter 1st & 2nd Year Hall Ticket 2024: తెలంగాణలో ఫిబ్ర‌వ‌రి 28, 2024 నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ప‌రీక్ష‌లు మార్చి 19 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ విద్యాశాఖ‌ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నుంది. ఇక‌ తెలంగాణ ఇంటర్‌మీడియ‌ట్‌ పరీక్షల షెడ్యూల్‌ను సైతం ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ పరీక్షలు (1st year inter hall ticket 2024) జరగనున్న నేప‌థ్యంలో ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లను (2nd year inter hall ticket 2024) నేడు విడుదల చేయనుంది.


ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లో నేడు అప్‌లోడ్ చేయనుంది. విద్యార్థులు ఈ వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులు ఈఎస్ఎస్ఎస్ సి లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్‌తో థియరీ పరీక్ష హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు.

Read More: గృహజ్యోతి పథకం వీరికే.. ముహూర్తం ఫిక్స్.. ఈ షరతులు వర్తిస్తాయ్..


ఇంట‌ర్ రెండో సంవ‌త్స‌రం విద్యార్థులు, మొద‌టి సంవ‌త్స‌రం హాల్ టికెట్ నంబర్ లేదా సెకండియర్ హాల్ టికెట్ నెంబర్‌తో హాల్ టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు. హాల్ టికెట్లో ఫోటో తప్పుగా పడటం, సంతకాలు, ఇతర వివరాలు ఏవైనా తప్పుగా పడినట్లయితే క‌ళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా క‌ల్పించారు.

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 2024 నుంచి 15 వరకు నిర్వహంచిన విషయం తెలిసిందే. రెండో శనివారం, ఆదివారాల్లో కూడా ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వ‌హించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌ పరీక్షలు నిర్వహించగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జ‌రిగాయి.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×